Horoscope Today: ఈ రోజు మీ రాశి ఫలం ఎలా ఉందో చూసుకున్నారా? - రాశిఫలాలు
Horoscope Today : ఈ రోజు (జనవరి 5) రాశి ఫలాల గురించి శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?
horoscope today
By
Published : Jan 5, 2023, 6:14 AM IST
|
Updated : Jan 5, 2023, 6:42 AM IST
Horoscope Today : ఈ రోజు (జనవరి 5) రాశి ఫలాల గురించి శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?
వృత్తి,ఉద్యోగాల్లో అనుకూలత ఉంది.పెద్దల సహకారం ఉంటుంది.ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.అనవసర ధనవ్యయం సూచితం.సూర్య స్తోత్రం చదివితే మంచిది.
మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది.అధికారులు మీకు అనుకూలమైన ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు. కొన్ని కీలకమైన పనులను పూర్తిచేయగలుగుతారు.కీలక నిర్ణయాలు ఫలిస్తాయి. శివస్తోత్రం చదవడం శుభప్రదం.
కుటుంబ సభ్యుల నుంచి సంపూర్ణ సహకారం లభిస్తుంది.మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి.కొన్ని సంఘటనలు మీ మనోధైర్యాన్ని పెంచుతాయి.శని ధ్యానశ్లోకం చదవాలి.
ప్రారంభించిన కార్యక్రమాల్లో ఆటంకం కలుగకుండా ముందు జాగ్రత్తతో వ్యవహరించాలి.ముఖ్య విషయాల్లో జాగ్రత్త అవసరం. వృథా ప్రయాణాలు చేయకండి. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. శ్రీవేంకటేశ్వరస్వామి సందర్శనం శుభకరం.
ఒక శుభవార్త వింటారు.ఉద్యోగులకు స్వస్థానప్రాప్తి సూచనలు ఉన్నాయి. బుద్ధిబలం బాగుండటం వల్ల కీలక సమయాలలో సమయోచితంగా స్పందించి అధికారుల ప్రశంసలు పొందుతారు. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి.అన్నదానం చేయడం వల్ల మంచి ఫలితాలను పొందుతారు.
కుటుంబ వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది.పెద్దలతో సాన్నిహిత్యం ఏర్పడుతుంది.శుభవార్తలు వింటారు.బుద్ధిబలం బాగుంటుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు.ఇష్ట దైవ సందర్శనం శుభప్రదం.
వృత్తి,ఉద్యోగ,వ్యాపారాది రంగాలలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. ప్రయాణాలలో ఆటంకాలు ఉంటాయి. ఒక సంఘటన లేదా వార్త కాస్త బాధ కలిగిస్తుంది.శివారాధన శుభప్రదం.
శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. బంధు,మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. కనకధారా స్తోత్రం చదవడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.
కీలక బాధ్యతలు మీ భుజాన పడతాయి. వాటిని సమర్థంగా నిర్వహించి అందరి ప్రశంసలూ పొందుతారు.విందు,వినోద,ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.దైవారాధన మానవద్దు.శనిశ్లోకం చదవండి.
మీ ఉత్సాహాన్ని రెట్టింపుచేసే సంఘటనలు చోటుచేసుకుంటాయి.మీ కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. కొన్ని సంఘటనలు మీ మనసుకు బాధ కలిగిస్తాయి. హనుమాన్ చాలీసా చదవడం మంచిది.
వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలలో అంచనాలను అందుకుంటారు. ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తిచేయగలుగుతారు.విందు,వినోద,ఆధ్యాత్మిక కార్యక్రమాలలోనూ పాల్గొంటారు.ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. దైవారాధన మానవద్దు.
మీ మంచితనమే మీ ఎదుగుదలకు మూలం అవుతుంది. మంచి మనస్సుతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. ధనవ్యయం పెరిగే అవకాశాలు ఉన్నాయి.ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. శ్రీలక్ష్మీ నారాయణ సందర్శనం శుభప్రదం.