Horoscope Today: ఈ రోజు మీ రాశి ఫలం ఎలా ఉందంటే? - ఈ రోజు రాశి ఫలాలు
Horoscope Today: ఈ రోజు(జవవరి 31) రాశి ఫలాల గురించి డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?
horoscope today
By
Published : Jan 31, 2023, 6:34 AM IST
Horoscope Today: ఈ రోజు(జవవరి 31) రాశి ఫలాల గురించి డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?
ప్రారంభించబోయే పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. కీలకమైన పనులను కొన్నాళ్లు వాయిదా వేయడమే మంచిది. కొన్ని పరిస్థితులు బాధ కలిగిస్తాయి. దుర్గారాధన శుభప్రదం.
విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక వ్యవహారంలో ధనం చేతికి అందుతుంది. భవిష్యత్ ప్రణాళికలు కొన్ని అమలు చేయగలుగుతారు. సొంతింటి పనుల్లో ముందంజ వేయగలుగుతారు. బంధు,మిత్రులతో సంతోషంగా గడుపుతారు.దుర్గాధ్యానం శుభప్రదం.
ప్రారంభించిన పనుల్లో విఘ్నాలు పెరగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. ముఖ్య విషయాల్లో అనుకూలమైన నిర్ణయాలు వెలువడతాయి.అధికారుల సహకారం ఉంటుంది. శివస్తోత్రం చదవడం మంచిది.
మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి.ముఖ్యమైన విషయాలకు సంబంధించి పెద్దలను కలుస్తారు. ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్న ఒక ముఖ్యమైన పని దాదాపు పూర్తి కావొస్తుంది. మహాలక్ష్మి అష్టోత్తరం చదివితే అంతా మంచే జరుగుతుంది.
ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది.విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు.మీ బుద్ధిబలంతో కీలక వ్యవహారాలలో సమయస్ఫూర్తితో వ్యవహరించి అందరి ప్రశంసలను అందుకుంటారు. ఇష్టదైవారాధన శ్రేయోదాయకం.
ప్రారంభించబోయే పనుల్లో శ్రమ పెరగకుండా చూసుకోవాలి.ఆర్ధిక విషయాల్లో పొదుపు సూత్రాన్ని పాటించాలి. కీలక సమస్యను పరిష్కరించి శత్రువులపై విజయం సాధించగలుగుతారు. ఆపదలు తొలగాలంటే శ్రీవేంకటేశ్వరుని పూజించాలి.
వృత్తి,ఉద్యోగ, వ్యాపారాలలో శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. ఎలాంటి పరిస్థితులలోనూ మనోధైర్యాన్ని కోల్పోరు. దైవారాధన మానవద్దు.
మనోధైర్యంతో ముందుకు సాగి పనులను పూర్తిచేస్తారు. ఇష్టమైన కాలాన్ని గడుపుతారు. శత్రువులపై విజయం సాధిస్తారు. ప్రయాణాల్లో అజాగ్రత్త వద్దు. శ్రీవేంకటేశ్వరస్వామి సందర్శనం ఉత్తమం.
చేపట్టే పనిలో అనుకూల ఫలితాలు ఉన్నాయి. బంధువుల సహకారం ఉంటుంది. కీలక వ్యవహారాల్లో ముందుచూపు అవసరం. హనుమాన్ చాలీసా చదవడం వల్ల మంచి ఫలితాలను పొందగలుగుతారు.
మీ మీ రంగాల్లో ఓర్పు,పట్టుదల చాలా అవసరం. బంధువులతో వాదనలకు దిగడం వల్ల విభేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి. అవసరానికి మించిన ఖర్చులు ఉంటాయి. నవగ్రహ ఆలయ సందర్శనం శుభప్రదం.
పనులకు ఆటంకం కలుగకుండా చూసుకోవాలి. కొన్ని సమయాల్లో అస్థిరబుద్ధితో వ్యవహరిస్తారు. ధర్మకార్యాచరణతో మేలు చేకూరుతుంది. గోవిందనామాలు చదివితే బాగుంటుంది.
స్థిరమైన ఆలోచనలతో మంచి జరుగుతుంది. ఒక వ్యవహారంలో సహాయం అందుతుంది. ఒక శుభవార్త మీ మనోవిశ్వాసాన్ని పెంచుతుంది. దైవబలం ఉంది. ఇష్టదైవారాధన శుభప్రదం.