Horoscope Today January 18th 2024 : జనవరి 18న (గురువారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?
మేషం (Aries) :ఈ రోజు మేష రాశివారికి సుఖంగా గడుస్తుంది. శారీరక, మానసిక ఆరోగ్యాలు బాగుంటాయి. పనులన్నీ సక్రమంగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు. మాతృ సంబంధమైన లబ్ధి చేకూరుతుంది. వ్యాపార, వ్యవహారాల్లో లాభాలు వస్తాయి.
వృషభం (Taurus) :ఈ రోజు వృషభ రాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి. నిగ్రహం పాటించాలి. సమస్యలను చాలా తెలివిగా పరిష్కరించుకోవాలి. ముఖ్యంగా మీరే చేసే వ్యవహారాల పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి.
మిథునం (Gemini) :ఈ రోజు మిథున రాశివారికి వ్యాపార, వ్యవహారాల్లో మంచి లాభాలు వస్తాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. మీ పెట్టుబడులు మంచి రాబడిని అందిస్తాయి. స్నేహితులు మీకు పూర్తి సహకారం అందిస్తారు. సంబంధ, బాంధవ్యాలు పెరుగుతాయి.
కర్కాటకం (Cancer) :ఈ రోజు కర్కాటక రాశివారి నక్షత్ర బలం చాలా బాగుంది. కాబట్టి అదృష్టం కలిసి వస్తుంది. వ్యాపార లావాదేవీల్లో మంచి లాభాలు వస్తాయి. అరుదైన కానుకలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
సింహం (Leo) : ఈ రోజు సింహ రాశివారికి సాధారణంగానే గడుస్తుంది. అనుకున్న పనులన్నీ పూర్తి చేయగలుగుతారు. లక్ష్యం దిశగా అడుగులు వేస్తారు. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. తీర్థయాత్రకు వెళ్లాలనే ఆలోచన చేస్తారు. అయితే మానసిక శాంతి కొరవడుతుంది. వ్యాపారంలో చిన్నపాటి అవరోధాలు ఏర్పడవచ్చు.
కన్య (Virgo) :ఈ రోజు కన్య రాశివారికి ఊహించని పరిణామాలు ఎదురవుతాయి. విప్లవాత్మకమైన ఆలోచనలు చేస్తారు. అసంబద్ధమైన పనులకు దూరంగా ఉండాలి. పనులు ఏవీ అనుకున్నంత సులువుగా జరగవు. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి.
తుల (Libra) :ఈ రోజు తుల రాశివారు పూర్తి ఆనందంగా ఉంటారు. మంచి ఆహారపానీయాలను రుచి చూస్తారు. వివిధ సంస్కృతుల సంభాషణలు ఆధిపత్యం చెలాయిస్తాయి. విభిన్న నేపథ్యాల నుంచి ఆసక్తికరమైన వ్యక్తులు, మీ పాత స్నేహితుల సాన్నిహిత్యం మీకు ఉత్తేజం, చైతన్యపరిచే విధంగా, ఆనందకరంగా ఉంటుంది.
వృశ్చికం (Scorpio) :ఈరోజు మీతారా బలం చాలా బాగుంది. చెడ్డ ప్రభావం తొలగింది. ఇంట్లో, ఆఫీస్‌లోనూ శాంతియుత వాతావరణం ఉంటుంది. చాలా ఉత్సాహంగా ఉంటారు. ఆరోగ్య సంబంధమైన సమస్యల నుంచి కోలుకుంటారు. మానసికశాంతి చాలా విలువైనది. మీరు ముఖ్యమైన విషయాలకే ఖర్చు చేస్తారు. మీరు మీ తోటివారి, ఉన్నతాధికారుల సాయం అందుకుంటారు. మీరు ఇంకా పూర్తి చేయని పనులు పూర్తి చేస్తారు. నిప్పుతో సమానమైన ఆడవారికి దూరం ఉండాలి. తల్లిదండ్రుల వద్ద నుంచి సమాచారం అందుతుంది.
ధనుస్సు (Sagittarius) :ఈ రోజు ధనుస్సు రాశివారికి కొంత ఇబ్బందిగానే ఉంటుంది. సాయంత్రం నుంచి నక్షత్రాలు మెరుగ్గా కనిపిస్తున్నాయి. అప్పటివరకు తట్టుకోని నిలబడండి! ఏవైనా ప్రయాణాలు ఉంటే మానుకోండి. మీ పిల్లల అనారోగ్యం మీ ఆందోళనకు కారణం కావచ్చు.
మకరం (Capricorn) :ఈ రోజు మీరు మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండరని ఫలితాలు చెబుతున్నాయి. కల్లోలంగా ఉన్న కుటుంబ వాతావరణంతో మీరు మరింత దిగులు చెందవచ్చు. శక్తి, ఉత్సాహం కోల్పోయిన అనుభూతి మిమ్మల్ని వెంటాడుతుంది. ప్రియమైన వారితో మీరు గొడవ పడే ఛాన్స్ ఉంది. ఛాతీ నొప్పి కంగారు పెట్టవచ్చు. మీరు ఈ రోజు బాగానే నిద్ర పోతారు. అవమానకరమైన పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది తప్పించుకోండి. సహోద్యోగులతో వ్యవహరించవలసి వచ్చినపుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. జలాలకి దూరంగా ఉండండి. మీకున్న మొండితనం, నిర్లక్ష్య వైఖరీ కారణంగా ఈ రోజు మీరు చాలా ఆందోళనలోనే గడుపుతారు.
కుంభం (Aquarius) :ఈ రోజు ప్రతికూల ఆలోచనలు తొలగి మంచి వాతావరణం నెలకొంటుంది. గత పక్షం రోజుల్లో మీరు అనుభవించిన అత్యుత్తమమైన రోజుగా ఉంటుంది. మీరు సంతోషంగా, ఉప్పొంగిన అనుభూతి చెందుతారు, సామాజికంగా కలవడానికి ఇష్టపడతారు. ఈరోజు మీకు సానుకూల అదృష్టకరమైన నక్షత్రాలు ఉన్నాయి. మీరు ప్రయాణ ప్రణాళికలు చేయడానికి లేదా ఒక చిన్న కుటుంబ పర్యటన చేసే అవకాశం ఉంది.
మీనం (Pisces) :ఈ రోజు కోపాన్ని ప్రదర్శించకుండా జాగ్రత్త పడండి. లేకపోతే మీ చుట్టు ప్రక్కల వాతావరణం అంతా మీకు విరోధం అవుతుంది. మీరు మీ ఖర్చుని కాస్త అదుపులో పెట్టుకోండి. ఆర్థిక సంబంధమైన విషయాలలో తగు జాగ్రత్త వహించండి. మీరు బాగా అలసి పోవచ్చు. అవాంఛనీయమైన సంఘటనలు చెలరేగి మీకూ, మీ బంధువులకూ మధ్య అభిప్రాయ భేదములు నెలకొనే అవకాశం ఉంది.