తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆ రాశివారు వాదనలు, ఘర్షణలకు దూరంగా ఉండాలి- లేకుంటే కష్టమే! - Horoscope Today

Horoscope Today January 17th 2024 : జనవరి 17న (బుధవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Horoscope Today 17 January 2024
Horoscope Today January 17th 2024

By ETV Bharat Telugu Team

Published : Jan 17, 2024, 5:03 AM IST

Horoscope Today January 17th 2024 : జనవరి 17న (బుధవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

మేషం (Aries) :ఈ రోజు మేష రాశివారికి అనుకూల ఫలితాలు లభిస్తాయి. పూర్తి ఉత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. స్నేహితులు, బంధువులతో కలిసి సంతోషంగా ఉంటారు. వ్యాపారంలో లాభాలు పొందుతారు. ఆరోగ్యం బాగుంటుంది.

వృషభం (Taurus) :ఈ రోజు వృషభ రాశి వారికి ఏమాత్రం అనుకూలంగా లేదు. కంటి సమస్యలు రావచ్చు. మొదలుపెట్టిన పనులు సకాలంలో పూర్తికావు. ఖర్చులు పెరుగుతాయి. మీ పొదుపునకు కూడా గండిపడుతుంది. కష్టపడి పనిచేస్తేనే విజయం లభిస్తుంది. వ్యాపార, వ్యవహారాల్లో నష్టాలు రావచ్చు. జాగ్రత్తగా ఉండండి.

మిథునం (Gemini) :ఈ రోజు మిథున రాశివారికి అనేక ప్రయోజనాలు లభిస్తాయి. యువతీ, యువకులకు వివాహ యోగం ఉంది. ఆర్థికంగానూ లాభపడతారు. స్నేహితులను కలుసుకుంటారు. అన్ని విషయాలూ మీకు కలిసి వస్తాయి. పిల్లల నుంచి మంచి శుభవార్త వింటారు.

కర్కాటకం (Cancer) :ఈ రోజు కర్కాటక రాశివారికి స్త్రీ మూలంగా అదృష్టం కలిసి వస్తుంది. తీర్థయాత్రలకు వెళ్లాలనే ఆలోచన చేస్తారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. శారీరక ఆరోగ్యం బాగుంటుంది. స్నేహితులతో సంతోషంగా గడుపుతారు. ఆర్థికంగా మీ స్థితి బాగానే ఉంటుంది.

సింహం (Leo) : ఈ రోజు సింహ రాశివారు ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కానీ కోపాన్ని అదుపులో ఉంచుకోవాల్సి ఉంటుంది. మీ పనులపై పూర్తి దృష్టి కేంద్రీకరించాలి. మానసికంగా కలత చెందే అవకాశం ఉంది. విదేశాల్లోని మీ ఆప్తుల నుంచి మంచి శుభవార్త వింటారు.

కన్య (Virgo) :ఈ రోజు కన్య రాశివారికి శుభప్రదంగా ఉంటుంది. సమాజంలో మీ పేరు, ప్రఖ్యాతులు పెరుగుతాయి. వ్యాపారులకు తమ భాగస్వాముల వల్ల లాభాలు చేకూరుతాయి. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. స్నేహితులతో సంతోషంగా గడుపుతారు.

తుల (Libra) :ఈ రోజు తుల రాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య సమస్యలు రావచ్చు. ఆహార నియమాలు పాటించాలి. వ్యాపార, వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. దైవ ప్రార్థనతో సమస్యలు చాలా వరకు తొలగే అవకాశం ఉంది.

వృశ్చికం (Scorpio) :ఈ రోజు వృశ్చిక రాశివారు ఘర్షణలకు దూరంగా ఉండడం మంచిది. మీ సంతానం విద్యావిషయాల్లో మీరు కాస్త ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంది. కానీ విదేశీ విద్య అభ్యసించాలని అనుకునేవారికి ఈ రోజు బాగుంటుంది.

ధనుస్సు (Sagittarius) :ఈ రోజు ధనుస్సు రాశివారికి అంత అనుకూలంగా లేదు. ఏ పనులు సక్రమంగా జరగవు. ఆస్తి, వారసత్వ తగాదాల విషయంలో అప్రమత్తంగా ఉండండి. చట్టపరమైన వ్యవహారాల్లో అజాగ్రత్త పనికి రాదు. ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే, కచ్చితంగా విజయం సాధిస్తారు.

మకరం (Capricorn) :ఈ రోజు మకర రాశివారికి అదృష్టం కలిసి వస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో మంచి లాభాలు వస్తాయి. విహార యాత్రల కోసం ప్రణాళికలు వేసుకుంటారు. ఉద్యోగులకు కూడా మంచి ప్రయోజనాలు అందుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

కుంభం (Aquarius) :ఈ రోజు కుంభ రాశివారు వాదనలకు దూరంగా ఉండాలి. లేకుంటే అభిప్రాయ బేధాలు, ఘర్షణలు తలెత్తే అవకాశం ఉంది. మాటలు అదుపు తప్పితే, చాలా ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. శాంతియుతంగా ఉండడం, దైవ ప్రార్థన చేయడం మంచిది.

మీనం (Pisces) :ఈ రోజు మీన రాశివారికి చాలా బాగుంటుంది. మీ ప్రయత్నాలు సఫలం అవుతాయి. మీ కోరికలు నెరవేరుతాయి. మీలోని సృజనాత్మకతను అందరూ గుర్తిస్తారు. సంగీత, నాట్యాల్లో రాణిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది.

ABOUT THE AUTHOR

...view details