Horoscope Today January 13th 2024 : జనవరి 13న (శనివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?
మేషం (Aries) :ఈ రోజు మేష రాశివారికి చాలా బాగుంటుంది. చర్చలు ఫలవంతమవుతాయి. ఆర్థికంగా లాభపడతారు. పనులు సక్రమంగా నెరవేరుస్తారు. పై అధికారుల ప్రశంసలు పొందుతారు. ప్రయాణాలు కూడా అనుకూల ఫలితాలను ఇస్తాయి. ఆరోగ్యం మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి.
వృషభం (Taurus) :ఈ రోజు వృషభ రాశివారి తారాబలం బాగుంది. దూర ప్రయాణాలు, తీర్థయాత్రలు చేయడానికి అనుకూలంగా ఉంటుంది. మంచి అవకాశాలు లభిస్తాయి. కొత్త వెంచర్లు, పెట్టుబడులు మీకు లాభాలను చేకూరుస్తాయి. కానీ స్వల్ప అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి. అప్రమత్తంగా ఉండాలి.
మిథునం (Gemini) :ఈ రోజు మిథున రాశివారికి కొన్ని సమస్యలు ఏర్పడతాయి. ఆరోగ్య రుగ్మతలు తలెత్తవచ్చు. దూకుడు స్వభావాన్ని తగ్గించుకోవాలి. లేకుంటే గాయాలపాలు అవుతారు. నిగ్రహాన్ని పాటించాలి. అజాగ్రత్త పరువు నష్టానికి దారితీయవచ్చు. జాగ్రత్త వహించాలి.
కర్కాటకం (Cancer) :ఈ రోజు కర్కాటక రాశివారు స్నేహితులు, ప్రియమైన వారితో కలిసి సంతోషంగా గడుపుతారు. వృత్తి, వ్యాపారాల్లో మంచి లాభాలు సంపాదిస్తారు. భాగస్వాముల మూలంగా ప్రయోజనం పొందుతారు. సమాజంలో మీ గౌరవ, మర్యాదలు పెరుగుతాయి.
సింహం (Leo) :ఈ రోజు సింహ రాశివారి నక్షత్రబలం ఏ మాత్రం బాగాలేదు. మీలో మానసిక ఆందోళనలు పెరుగుతాయి. పనిచేసే చోట అన్నీ అటంకాలే ఎదురవుతాయి. రోజువారీ పనులు పూర్తి చేయడం కష్టమవుతాయి. కానీ అధైర్య పడకూడదు. ఆత్మవిశ్వాసంతో పని చేస్తే, కచ్చితంగా విజయం సాధిస్తారు.
కన్య (Virgo) :ఈ రోజు కన్య రాశివారికి కఠినంగా గడుస్తుంది. పిల్లల గురించి ఆందోళన చెందుతారు. విద్యార్థులకు కూడా కఠినంగానే ఉంటుంది. పెట్టుబడుల్లో నష్టాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అనవసరమైన చర్చలకు దూరంగా ఉండాలి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి.
తుల (Libra) :ఈ రోజు తుల రాశివారు అప్రమత్తంగా ఉండాలి. మీ తల్లిగారి ఆరోగ్యం మిమ్మల్ని బాధిస్తుంది. ఆస్తికి సంబంధించిన వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీలైతే ప్రయాణాలు మానుకోవాలి. అవమానకర పరిస్థితులు ఎదురుకావచ్చు. పనుల్లో నిర్లక్ష్యం తగదు.
వృశ్చికం (Scorpio) :ఈ రోజు వృశ్చిక రాశివారి తారాబలం చాలా బాగుంది. కొత్త కార్యక్రమాలు ప్రారంభించడానికి ఇది చాలా మంచి రోజు. కోరుకున్న వారితో మీ సంబంధ, బాంధవ్యాలు మెరుగుపడతాయి. చర్చలు సఫలం అవుతాయి. ఆర్థిక విషయాల్లో మిమ్మల్ని విజయం వరిస్తుంది. అన్ని విధాలుగా అదృష్టం కలిసి వస్తుంది.
ధనుస్సు (Sagittarius) :ఈ రోజు ధనుస్సు రాశివారికి మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో మనస్పర్థలు ఏర్పడతాయి. పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. ఘర్షణలకు దూరంగా ఉండాలి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి. విదేశాల్లో ఉన్న మిత్రుల నుంచి శుభవార్త వింటారు. ఇది భవిష్యత్లో మీకు మంచి అదృష్టాన్ని అందిస్తుంది.
మకరం (Capricorn) : ఈ రోజు మకర రాశివారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగులకు, వ్యాపారులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మీ ప్రయత్నాలు అన్నీ సఫలం అవుతాయి. సమాజంలో మీ పరపతి పెరుగుతుంది. పదోన్నతి లభించే అవకాశం ఉంది. స్నేహితులు, బంధువులతో కలిసి సంతోషంగా గడుపుతారు. అయితే ప్రమాదం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. జాగ్రత్త వహించాలి.
కుంభం (Aquarius) :ఈ రోజు కుంభ రాశివారు తమ వాక్పటిమతో అందరి ప్రశంసలు అందుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో మంచి లాభాలు గడిస్తారు. విద్యార్థులు చదువుల్లో రాణిస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. దైవారాధన చేయడం వల్ల పనులు విజయవంతం అవుతాయి.
మీనం (Pisces) :ఈ రోజు మీన రాశివారికి అనుకోని లాభాలు చేకూరుతాయి. మీ పిల్లలకు సంబంధించిన శుభవార్తలు వింటారు. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. వీరి వల్ల భవిష్యత్లో మీరు ప్రయోజనం పొందుతారు. సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాల్లో లాభపడతారు.