తెలంగాణ

telangana

By ETV Bharat Telugu Team

Published : Jan 10, 2024, 5:00 AM IST

ETV Bharat / bharat

ఇవాళ ఆ రాశివారు కోర్టు వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి!

Horoscope Today January 10th 2024 : జనవరి 10 (బుధవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Horoscope Today 10 January 2024
Horoscope Today January 10th 2024

Horoscope Today January 10th 2024 : జనవరి 10 (బుధవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

మేషం (Aries) :ఈ రోజు మేష రాశివారికి అంత అనుకూలంగా ఉండదు. పనులు సకాలంలో పూర్తి కావు. మానసిక ఆవేదనకు గురువుతారు. ఆరోగ్యం ఇబ్బంది పెడుతుంది. కుటుంబ సభ్యులతో, తోటి ఉద్యోగులతో మనస్పర్థలు రావచ్చు. పెంకితనంతో ప్రవర్తించకూడదు.

వృషభం (Taurus) :ఈ రోజు వృషభ రాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొత్త పనులు ప్రారంభించవద్దు. మానసిక ఆందోళనకు గురువుతారు. కానీ ఆరోగ్యం బాగానే ఉంటుంది. ప్రయాణాలు ఫలవంతం అవుతాయి. ఆధ్యాత్మిక అంశాలపై దృష్టి సారించడం మంచిది.

మిథునం (Gemini) :ఈ రోజు మిథున రాశివారికి చాలా బాగుంటుంది. భౌతిక సుఖాలు అనుభవిస్తారు. స్నేహితులతో, కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు. కొత్త దుస్తులు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. సమాజంలో మీ గౌరవ, ప్రతిష్టలు పెరుగుతాయి.

కర్కాటకం (Cancer) :ఈ రోజు కర్కాటక రాశివారికి అనుకూల ఫలితాలు లభిస్తాయి. కుటుంబ వాతావరణం బాగుంటుంది. ఉద్యోగులకు ఇది చాలా మంచి రోజు. సహచరులు మీకు అన్ని విధాల సహకరిస్తారు. మీ ప్రత్యర్థులపై పైచేయి సాధిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది.

సింహం (Leo) :ఈ రోజు సింహ రాశివారు చాలా సంతోషంగా గడుపుతారు. మీలోని కల్పనా శక్తిని కవితల రూపంలో పొందుపరుస్తారు. ప్రియమైన వారిని కలుసుకుంటారు. విద్యార్థులు బాగా రాణిస్తారు. స్నేహితుల వల్ల మంచి లబ్ధి పొందుతారు. దానధర్మాలు చేస్తారు.

కన్య (Virgo) :ఈ రోజు కన్య రాశివారి నక్షత్ర బలం ఏమీ బాగాలేదు. అనుకోని సమస్యలు ఎదురవుతాయి. మానసిక, శారీర ఒత్తిడిలకు గురవుతారు. కుటుంబ సభ్యులతో వివాదాలు వస్తాయి. తల్లిగారి అనారోగ్యం మిమ్మల్ని బాధిస్తుంది. దైవారాధన చేయడం మంచిది.

తుల (Libra) :ఈ రోజు తుల రాశివారు ఆనందంగా గడుపుతారు. దేవుడిని దర్శించుకుంటారు. కుటుంబ వ్యవహారాలను చక్కగా నెరవేరుస్తారు. శత్రువుల మీద విజయం సాధిస్తారు. ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది.

వృశ్చికం (Scorpio) :ఈ రోజు వృశ్చిక రాశివారికి అద్భుతంగా ఉంటుంది. అనుకున్న పనులు అన్నీ విజయవంతం అవుతాయి. ఉన్నతాధికారులు మీ పనికి ప్రశంసలు కురిపిస్తారు. అయితే న్యాయ పరమైన చిక్కుల్లో పడకుండా జాగ్రత్త పడాలి.

ధనుస్సు (Sagittarius) : ఈ రోజు మీరు పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు. పనులు అన్నీ చక్కగా పూర్తి చేస్తారు. ఇంట్లో ఓ శుభకార్యం జరిగే అవకాశం ఉంది. ప్రేమించే వ్యక్తిని కలుసుకుంటారు. మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ఆరోగ్యం బాగుంటుంది.

మకరం (Capricorn) : ఈ రోజు మకర రాశివారు ఆధ్యాత్మిక అంశాలపై దృష్టి సారిస్తారు. కోర్టుకు సంబంధించిన వ్యవహారాల్లో శ్రద్ధ తీసుకోవాలి. ప్రమాదం జరిగే అవకాశం ఉంది. జాగ్రత్త వహించాలి. అధికంగా డబ్బులు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి.

కుంభం (Aquarius) :ఈ రోజు కుంభ రాశివారు కొత్త పనులు ప్రారంభించడానికి చాలా మంచి రోజు. వృత్తిపరంగా మీకు మంచి లాభాలు కూడా వస్తాయి. స్నేహితుల ద్వారా మీకు మంచి అసైన్​మెంట్లు లభిస్తాయి. సమాజంలో మీ కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి. పెళ్లికాని వారికి వివాహయోగం కనిపిస్తోంది. త్వరలోనే మంచి వార్త వింటారు.

మీనం (Pisces) :ఈ రోజు మీన రాశివారికి ఏమాత్రం ఆశాజనకంగా లేదు. చిన్న విషయాలకే బాధపడవలసి వస్తుంది. అయితే నిరాశ, నిస్పృహలకు లోను కాకూడదు. ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే విజయం సాధించవచ్చు. సంకల్ప బలంతో మీరు దేన్నైనా సాధించగలరు.

ABOUT THE AUTHOR

...view details