తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Horoscope Today : ఈ రోజు మీ రాశి ఫలం ఎలా ఉందంటే? - horoscope news

Horoscope Today : ఈ రోజు రాశి ఫలం(జనవరి 1) గురించి శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?

horoscope-today-in-telugu
horoscope-today-in-telugu

By

Published : Jan 1, 2023, 6:11 AM IST

Updated : Jan 1, 2023, 6:34 AM IST

Horoscope Today : ఈ రోజు రాశి ఫలం(జనవరి 1) గురించి శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?

చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. శారీరక శ్రమ పెరుగుతుంది. నమ్మించి మోసం చేసే వారున్నారు జాగ్రత్త. ధర్మసిద్ధి ఉంది. వృథా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కొన్ని సంఘటనలు మనస్తాపాన్ని కలిగిస్తాయి. నవగ్రహ శ్లోకం చదవండి.

దైవబలంతో అనుకున్నది సాధిస్తారు. స్వకులాచారం ఉంది. నూతన కార్యక్రమాలు చేపడతారు. మీ కీర్తిప్రతిష్ఠలు పెరుగుతాయి. అనూహ్య ధనలాభమును పొందుతారు. లక్ష్మీదేవిని ఆరాధిస్తే మంచిది.

ఇష్ట కార్యసిద్ధి ఉంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనవసర ధనవ్యయం సూచితం. శారీరక శ్రమ కాస్త పెరుగుతుంది. బంధువులతో వాదనలకు దిగడం వలన విభేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఆంజనేయస్వామి స్తోత్ర పారాయణం చేయడం మంచిది.

చేపట్టిన పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. బంధు వైరం సూచితం. శారీరక శ్రమ ఎక్కువవుతుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల తరవాత ఇబ్బందులు పడతారు. సుబ్రహ్మణ్య ఆరాధన శుభప్రదం.

మిశ్రమ ఫలితాలున్నాయి. ఒత్తిడిని తగ్గించే మార్గాలను వెతకాలి. బంధుమిత్రులను సాయం చేస్తారు. కొన్ని సంఘటనలు ఉత్సాహాన్నిస్తాయి.పెద్దల ఆశీర్వచనాలున్నాయి. శివుడిని ఆరాధిస్తే మంచిది.

మొదలుపెట్టిన పనుల్లో విజయం సాధించగలుగుతారు. ఇష్టమైన వారితో కలిసి సంతోషంగా ఉల్లాసంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబంలో చిన్నపాటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. దశావతార స్తోత్రము పఠిస్తే ఇంకా బాగుంటుంది.

ఒక ముఖ్యమైన విషయంలో మంచి పురోగతి ఉంటుంది. మీ అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. మొదలుపెట్టిన పనుల్లో కొన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. సంకటహర గణపతి స్తోత్రము పఠించడం శుభప్రదం.

మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. కొందరి ప్రవర్తన బాధ కలిగిస్తుంది. కొన్ని సంఘటనలు నిరుత్సాహపరుస్తాయి. కొన్నాళ్లుగా పరిష్కారం కాని ఒక సమస్యలో కాస్త కదలిక వస్తుంది. దుర్గా అష్టోత్తర శతనామావళి చదవాలి.

కుటుంబం సభ్యులతో కలిసి కీలక నిర్ణయాలను తీసుకుంటారు. స్థిరమైన నిర్ణయాలతో గొప్ప ఫలితాలను అందుకుంటారు. ఆర్ధికంగా కలిసివచ్చే కాలం. అంతా శుభమే జరుగుతుంది. ఇష్టదైవారాధన శుభప్రదం.

మిశ్రమ ఫలితాలున్నాయి. ఎంత శ్రమిస్తే అంత ఫలితం ఉంటుంది. అలసట కాస్త ఎక్కువగా ఉంటుంది. పెద్దల నుంచి ప్రోత్సాహకాలను అందుకుంటారు. తోటివారి సహకారంతో పనులు త్వరగా పూర్తవుతాయి. వేంకటేశ్వరుడిని ఆరాధించడం మంచిది

అనుకున్నది సాధిస్తారు. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. వారి అనుగ్రహం పొందడానికి కష్టపడాల్సి వస్తుంది. కలహ సూచన ఉంది కాబట్టి నోటిని అదుపులో ఉంచుకోవాలి. శనిధ్యాన శ్లోకం చదవండి.

అందరినీ కలుపుతూ పోవడం వల్ల సమస్యలు తగ్గుతాయి. శ్రమ పెరగకుండా చూసుకోవాలి. ఆవేశాలకు వెళ్లొద్దు. ముఖ్య విషయాల్లో అశ్రద్ధ వద్దు. పనుల్లో విజయం సాధించాలంటే గోవిందనామాలు చదివితే మంచి జరుగుతుంది.

Last Updated : Jan 1, 2023, 6:34 AM IST

ABOUT THE AUTHOR

...view details