Horoscope Today : ఈ రోజు (జనవరి 14) రాశి ఫలాల గురించి శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?
horoscope today in telugu
By
Published : Jan 14, 2023, 6:16 AM IST
Horoscope Today : ఈ రోజు (జనవరి 14) రాశి ఫలాల గురించి శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?
మీ మీ రంగాల్లో మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యుల సహకారం అవసరం. కొన్ని సంఘటనలు మీకు మనోవిచారాన్ని కలిగిస్తాయి. అనవసరమైన ఖర్చులు చేయాల్సిన పరిస్థితులు వస్తాయి.గణపతి స్తోత్రం చదవండి,మంచి జరుగుతుంది.
ఆత్మశుద్ధితో పనిచేసి విజయాలను సొంతం చేసుకుంటారు. తరచూ నిర్ణయాలు మార్చడం ద్వారా ఇబ్బందులు ఎదురవుతాయి. బంధువులతో ప్రేమగా వ్యవహరించాలి. ఆంజనేయ ఆరాధన శుభప్రదం.
శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు.కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కొన్ని కీలక నిర్ణయాలలో మీకు కుటుంబసభ్యుల సహకారం లభిస్తుంది. శ్రీవేంకటేశ్వరుని పూజిస్తే మంచిది.
ధర్మసిద్ధి ఉంది. కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలు సాధిస్తారు.శారీరక శ్రమ పెరుగుతుంది. వివాదాలకు దూరంగా ఉండాలి. ఆదిత్య హృదయం చదవాలి.
మనోధైర్యంతో ముందడుగు వేసి సత్ఫలితాలు సాధిస్తారు. బంధు,మిత్రులతో సంతోషంగా గడుపుతారు. అయితే, వారివల్ల అనవసర ఖర్చులు జరిగే సూచనలు ఉన్నాయి. తోటి వారి సహకారంతో మేలు జరుగుతుంది. కనకధారాస్తోత్రం చదవడం శుభకరం.
ఆత్మవిశ్వాసంతో పనిచేసి మంచి ఫలితాలు సాధిస్తారు. ఆత్మీయుల సలహాలు ప్రశాంతతను చేకూరుస్తాయి. కుటుంబసభ్యులతో సఖ్యతగా మెలగాలి.ఎవరితోనూ వాదోపవాదాలు చేయకండి. గణపతి ఆరాధన శ్రేయోదాయకం
వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలలో ఆచితూచి అడుగేయాలి. చేపట్టే పనులలో ఇబ్బందులు పెరగకుండా చూసుకోవాలి. బంధు,మిత్రులతో జాగ్రత్తగా మాట్లాడాలి. దుర్గాదేవిని పూజిస్తే శుభఫలితాలు కలుగుతాయి.
ప్రయత్నకార్యసిద్ధి ఉంది. ఒక ముఖ్య వ్యవహారంలో ఆర్థికసాయం అందుతుంది.అనుకున్న పనులను అనుకున్నట్టు చేయగలుగుతారు. కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. బిల్వాష్టకం చదివితే బాగుంటుంది.
శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల నుంచి ఒక ముఖ్యవ్యవహారంలో సంపూర్ణ సహకారం లభిస్తుంది. అవసరానికి తగిన సహకారం లభిస్తుంది. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. సూర్యాష్టకం చదివితే బాగుంటుంది.
ఉత్సాహంగా ముందుకు సాగితే మంచి జరుగుతుంది. అష్టమ చంద్రదోషం ఉంది.ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. మనోబలం కోసం దుర్గా అష్టోత్తర శతనామావళి చదవండి.
ఉద్యోగంలో శ్రమకు తగ్గ ఫలితాలు ఉంటాయి.అనవసర కలహం సూచితం. అనవసర ఖర్చులు వస్తాయి.నిర్ణయాలలో స్థిరత్వం ఉండదు.కలహాలకు దూరంగా ఉండాలి. శనిశ్లోకం చదివితే శుభఫలితాలు కలుగుతాయి.
బంధు,మిత్రులతో సంతోషంగా గడుపుతారు. కొన్ని వ్యవహారాలలో ఆర్ధికలాభం పొందుతారు.మీ కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. ధర్మసిద్ధి ఉంది.ఉద్యోగంలో స్వస్థాన ప్రాప్తి కలదు. సంకటహర గణపతి స్తోత్రం చదివితే బాగుంటుంది.