Horoscope Today: ఈ రోజు మీ రాశి ఫలం ఎలా ఉందంటే? - రాశిఫలాలు జనవరి 2023
Horoscope Today : ఈ రోజు (జనవరి 13) రాశి ఫలాల గురించి శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?
horoscope todaty
By
Published : Jan 13, 2023, 6:21 AM IST
Horoscope Today : ఈ రోజు (జనవరి 13) రాశి ఫలాల గురించి శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?
శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు.ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి అనుకున్న పనులను పూర్తిచేస్తారు. శత్రువులపై విజయం సాధిస్తారు.సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి.
మధ్యమ ఫలితాలు ఉన్నాయి.భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం.ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించి అనుకున్నది సాధిస్తారు. అనవసర ఖర్చుల వైపు మనసు మళ్లుతుంది. శ్రీలక్ష్మిగణపతి ధ్యానం మంచిది.
పనులకు ఆటంకాలు కలుగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి.కీలక విషయాల్లో బాగా ఆలోచిం.చి నిర్ణయాలు తీసుకోండి.ఖర్చులు పెరుగుతాయి.శివ నామస్మరణ ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది.
ధర్మసిద్ధి ఉంది. దైవబలంతో పనులను పూర్తిచేస్తారు.ఉద్యోగులకు శుభకాలం.బుద్ధిబలం బాగుంటుంది.బంధుమిత్రులను కలిసి సంతోషంగా ఉల్లాసంగా గడుపుతారు. ఇష్టదైవాన్ని దర్శిస్తే మంచి ఫలితాలు సొంతం అవుతాయి.
శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. ద్వాదశ చంద్రసంచారం అనుకూలంగా లేదు. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. శ్రీవిష్ణు ఆరాధన చేయడం మం
మానసికంగా దృఢంగా ఉంటారు. అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి.నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.అధికారుల సహకారం ఉంది.కుటుంబ సభ్యుల ఆదరాభిమానాలు ఉంటాయి. ఇష్టదైవ ప్రార్ధన శుభప్రదం.
ఎంత కష్టపడితే అంత ఫలితం వస్తుంది. ప్రారంభించిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తిచేస్తారు. అనవసర ఖర్చులు పెరుగుతాయి. అనవసర వ్యవహారాల్లో తలదూర్చకుండా ఉండటం మేలు. నారాయణ మంత్రాన్ని జపించాలి.
మంచి కాలం. ఒక ముఖ్య వ్యవహారంలో కుటుంబ సభ్యుల సంపూర్ణ సహకారం లభిస్తుంది. అవసరానికి ఆర్థిక సహకారం లభిస్తుంది. సూర్యాష్టకం చదివితే బాగుంటుంది.
అవసరానికి తగిన సహాయం చేసేవారున్నారు. శ్రమ అధికం అవుతుంది.తోటివారి సహకారంతో ఆపదల నుంచి బయటపడతారు. మనోవిచారాన్ని కలిగించే సంఘటనలకు దూరంగా ఉండాలి. శివారాధన మంచిది.
అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తిచేయగలుగుతారు. శివ నామాన్ని జపించండి.
ఒక శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. ఒక ముఖ్య వ్యవహారంలో ఆర్థికసాయం అందుతుంది.అనుకున్న పనులను అనుకున్నట్టు చేయగలుగుతారు.నవగ్రహ స్తోత్రం చదివితే బాగుంటుంది.