Horoscope Today: ఈ రోజు మీ రాశి ఫలం ఎలా ఉందంటే? - దిన ఫలాలు
Horoscope Today: ఈ రోజు(జవవరి 30) రాశి ఫలాల గురించి డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?
రాశిఫలాలు
By
Published : Jan 30, 2023, 6:38 AM IST
Horoscope Today: ఈ రోజు(జవవరి 30) రాశి ఫలాల గురించి డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?
అర్థలాభం ఉంటుంది. ధర్మసిద్ధి కలదు. బంధువులతో ఆనందాన్ని పంచుకుంటారు. మనఃసౌఖ్యం కలదు. ఇష్ట దైవారాధన శుభప్రదం.
తలపెట్టిన కార్యాల్లో విఘ్నాలు ఎదురవకుండా చూసుకోవాలి. మనోధైర్యంతో చేసే పనులు సిద్ధిస్తాయి. కొన్ని సంఘటనలు మిమ్మల్ని కాస్త నిరుత్సాహపరుస్తాయి. అనవసర ఖర్చులు పెరిగే సూచనలున్నాయి. లక్ష్మీదేవిని ఆరాధించాలి. కనకధారాస్తవం పఠించాలి.
శుభకార్యాల్లో పాల్గొంటారు. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి పనులను పూర్తి చేస్తారు. శత్రువులపై మీరే విజయం సాధిస్తారు. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి.
ఆశించిన ఫలితాలు వస్తాయి. బంధువుల సహకారం లభిస్తుంది. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. కొన్ని ముఖ్యమైన పనుల్లో పురోగతి ఉంటుంది. దైవారాధన మానవద్దు.
భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. శ్రమ పెరగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. శివారాధన శుభప్రదం.
మధ్యమ ఫలాలున్నాయి. మానసికంగా దృఢంగా ఉంటారు. అవసరానికి తగిన సాయం చేయడానికి కొందరు ముందుకు వస్తారు. విరోధులను తక్కువగా అంచనా వేయవద్దు. హనుమాన్ చాలీసా పఠించాలి.
ఒక వార్త ఆనందాన్నిస్తుంది. బంధుమిత్రులతో కలిసి చేసే పనులు సత్ఫలితాన్నిస్తాయి. ఒక ముఖ్యమైన వ్యవహారంలో మీరు ఆశించిన పురోగతి ఉంటుంది. ఆదిత్య హృదయం పఠించాలి.
ఉత్సాహంగా పనిచేస్తారు. బంధువుల సహకారం లభిస్తుంది. ప్రతి విషయాన్ని కుటుంబ సభ్యులతో చర్చించి మొదలుపెట్టాలి. లక్ష్మీ సహస్రనామం చదివితే శుభం జరుగుతుంది.
కీలక వ్యవహారాల్లో సమాచార లోపం లేకుండా చూసుకోవాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ఎన్ని ఆటంకాలు ఎదురైనా మనోబలంతో ముందుకు సాగండి. అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. శ్రమ పెరుగుతుంది. ఎవరితోనూ వాదోపవాదాలు చేయరాదు. ఇష్టదైవారాధన శుభదాయకం.
ధర్మచింతనతో వ్యవహరిస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. గొప్పవారితో పరిచయం ఏర్పడుతుంది. సమాజంలో మంచి పేరు దక్కుతుంది. దైవబలం సంపూర్ణంగా రక్షిస్తుంది. సూర్యనారాయణ మూర్తి ఆరాధన శుభప్రదం.
అనుకూల సమయం. తోటివారి సహకారం లభిస్తుంది. మీ బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరించి అందరి మన్ననలను పొందుతారు. ప్రయాణాలు ఫలిస్తాయి. గణపతి ఆరాధన చేస్తే మంచిది.
వృత్తి, ఉద్యోగాల్లో శ్రమతో కూడిన ఫలితాలున్నాయి. తోటివారి సహకారంతో అనుకున్న ఫలితాలు సిద్ధిస్తాయి. అనవసర విషయాలతో సమయాన్ని వృథా చేయవద్దు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . శ్రీరామనామాన్ని జపిస్తే శుభం కలుగుతుంది.