Horoscope Today: ఈరోజు మీ రాశి ఫలం ఎలా ఉందో చూసుకున్నారా? - ఈనాడు రాశి ఫలాలు ఈ రోజు
Horoscope Today : ఈ రోజు (జనవరి 3) రాశి ఫలాల గురించి శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?
HOROSCOPE
By
Published : Jan 3, 2023, 6:20 AM IST
Horoscope Today : ఈ రోజు (జనవరి 3) రాశి ఫలాల గురించి శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?
మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది.అధికారులు మీకు అనుకూలమైన ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు. కొన్ని కీలక పనులను పూర్తిచేయగలుగుతారు. కీలక నిర్ణయాలు ఫలిస్తాయి.శివాష్టకం చదివితే మంచిది.
కీలక విషయాల్లో సొంత నిర్ణయాలు పనిచేయవు.తోటివారి సలహాలు తప్పనిసరి. కొందరి ప్రవర్తన మీకు ఇబ్బంది కలిగిస్తుంది. సమయాన్ని వృథా చేయకండి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. నవగ్రహ ఆరాధన శుభప్రదం.
ఉత్సాహంగా పనిచేస్తారు. బంధువుల సహకారం లభిస్తుంది. ప్రతి విషయాన్ని కుటుంబంతో చర్చించి ప్రారంభించాలి. లక్ష్మీ సహస్రనామం చదివితే మంచి జరుగుతుంది.
తోటివారి సహకారం ఉంటుంది.మీ ప్రతిభకు పెద్దల ప్రశంసలు లభిస్తాయి.శరీరసౌఖ్యం ఉంది.బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఆంజనేయ స్తోత్రం చదివితే బాగుంటుంది.
మీ కృషే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించాలి. అనారోగ్య సమస్యలు పెరగకుండా చూసుకోవాలి.అనవసర ఖర్చులు పెరగకుండా జాగ్రత్తపడాలి. శివారాధన వల్ల శుభఫలితాలను అందుకుంటారు.
ఆత్మవిశ్వాసంతో పనిచేసి మంచి ఫలితాలు సాధిస్తారు. ఆత్మీయుల సలహాలు ప్రశాంతతను కలిగిస్తాయి. కుటుంబసభ్యులతో సఖ్యతగా మెలగాలి. ఎవరితోనూ వాదోపవాదాలు చేయకండి. గణపతి ఆరాధన శ్రేయోదాయకం.
ప్రారంభించిన పనులను సకాలంలో పూర్తిచేస్తారు.మనఃస్సౌఖ్యం ఉంది.బంధుమిత్రుల సహాయ సహకారాలు ఉంటాయి.సాహసోపేతమైన నిర్ణయాలతో గొప్ప విజయాలు ఉన్నాయి. శ్రీవేంకటేశ్వర స్వామి సందర్శనం శుభప్రదం.
ప్రారంభించిన కార్యక్రమాల్లో ఉత్సాహంతో పనిచేసి విజయం సాధిస్తారు.ఆర్థికంగా శుభఫలితాలు ఉన్నాయి. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు.ఇష్టదైవారాధన శుభప్రదం.
మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఆలోచనలలో మార్పులు కలుగకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యుల సహకారం అవసరం. కొన్ని సంఘటనలు మీకు జ్ఞానోదయం కలిగిస్తాయి.లింగాష్టకం చదవండి,మంచి జరుగుతుంది.
ముఖ్యమైన వ్యవహారాల్లో శోధన చాలా అవసరం. వ్యాపారంలో మీరు చేసే ఆలోచనల్ని ఎదుటివారితో పంచుకోవడం ద్వారా సాధ్యాసాధ్యాలను అంచనా వేయవచ్చు. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించండి. అనవసరంగా భయాందోళనలకు గురవుతారు.శని ధ్యానం శుభప్రదం.
ప్రారంభించిన కార్యక్రమాలను దైవబలంతో పూర్తి చేస్తారు. భవిష్యత్ ప్రణాళికలు రచించడానికి ఇది సరైన సమయం. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.ఆర్థికంగా పుంజుకుంటారు. ఆంజనేయ ఆరాధన శుభప్రదం.
పట్టుదలతో విజయాన్ని సాధిస్తారు. అధికారులతో సత్సంబంధాలు ఏర్పడుతాయి. కార్యసిద్ధి విశేషంగా ఉంది. తోటి వారి సహకారంతో అనుకున్న ఫలితాలు సిద్ధిస్తాయి. శ్రీరామనామాన్ని జపించడం ఉత్తమం.