Horoscope Today: ఈ రోజు(జవవరి 27) రాశి ఫలాల గురించి డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?..
మనోబలం తగ్గకుండా చూసుకోవాలి.ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. శత్రువులపై విజయం సాధిస్తారు. కుటుంబంలో చిన్నపాటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. దుర్గాదేవిని ఆరాధన శుభప్రదం.
తలచిన కార్యక్రమాలు నెరవేరుతాయి. తోటివారితో సంతోషాన్ని పంచుకుంటారు. సమాజంలో కీర్తిప్రతిష్టలు సంపాదిస్తారు. ధన, వస్త్రలాభాలు కలవు. సూర్య నమస్కారం వల్ల మంచి జరుగుతుంది.
పట్టుదలే ఆయుధంగా ముందుకు సాగండి. మీ అధికార పరిధి పెరుగుతుంది. వృత్తి,ఉద్యోగ,వ్యాపారాది రంగాలలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి.
ప్రారంభించిన కార్యక్రమాలు పూర్తవుతాయి. విందు,వినోద సుఖాలు కలుగుతాయి. ఆర్థిక విషయాలలో ఆచితూచి వ్యవహరించండి. శాంతంగా వ్యవహరించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సందర్శనం మేలు చేస్తుంది.
బంధువులతో ఆచితూచి వ్యవహరించాలి. మీ మీ రంగాల్లో ఒత్తిడిని దరిచేరనీయకండి. ముఖ్య వ్యవహారాలలో ఓర్పు చాలా అవసరం. ఖర్చులు పెరగకుండా జాగ్రత్తపడాలి. నవగ్రహ శ్లోకాలు చదివితే మంచిది.
కార్యసిద్ధి ఉంది. మంచి పనులను ప్రారంభిస్తారు. కొన్ని సంఘటనల ద్వారా మానసిక ఆనందాన్ని పొందుతారు. లక్ష్యసాధనలో ఆత్మీయుల సహకారం ఉంటుంది. గురు ధ్యానం మంచిది.