తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Horoscope Today: ఈ రోజు మీ రాశి ఫలం ఎలా ఉందంటే? - ఈ రోజు రాశి ఫలాలపై శంకరమంచి శివసాయి శ్రీనివాస్

Horoscope Today: ఈ రోజు(జనవరి 25) రాశి ఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?

Horoscope Today
ఈ రోజు రాశి ఫలం

By

Published : Jan 25, 2023, 6:38 AM IST

Horoscope Today: ఈ రోజు(జనవరి 25) రాశి ఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?

భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు. మొదలుపెట్టిన పనులలో శుభఫలితాలను సాధిస్తారు. మీ ప్రతిభకు, పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. గోవింద నామాలు పఠిస్తే బాగుంటుంది.

శుభ ఫలితాలు అందుకుంటారు. ఒక వ్యవహారంలో తోటివారి సాయం అందుతుంది. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. అంతటా విజయం ఉంది. శనిధ్యానం పఠించాలి.

శ్రద్ధగా పనిచేసి మంచి ఫలితాను అందుకుంటారు. ఆధ్యాత్మికంగా ఎదుగుతారు. దగ్గరివారితో విబేధాలు రాకుండా చూసుకోవాలి. శారీరక శ్రమ పెరుగుతుంది. నవగ్రహ శ్లోకం చదవాలి.

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మీరు ఆశించే నిర్ణయాలు వస్తాయి. చేపట్టే పనుల్లో ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. కీలక విషయాల్లో ద్వంద్వ వైఖరిని విడనాడాలి. లక్ష్మీఅష్టోత్తర శతనామావళి పఠిస్తే బాగుంటుంది.

శుభకాలం. కొన్ని కీలక నిర్ణయాలలో వారి సహకారం మీకు లబిస్తుంది. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక ముఖ్యమైన పనిని ఎట్టకేలకు పూర్తిచేయగలుగుతారు. ఇష్ట దైవాన్ని స్మరించండి.

తలపెట్టిన పనులు త్వరగా పూర్తవుతాయి. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీ ప్రతిభను పెద్దలు పెంచుకుంటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆదిత్య హృదయ పారాయణ చేయడం మంచిది.

చేపట్టే పనిలో బద్ధకాన్ని వీడాలి. ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అదిగించే ప్రయత్నం చేస్తారు. బందుమిత్రులతో విబేదాలు రావచ్చు. నవగ్రహ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది.

చేపట్టిన పనులలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడినా పట్టుదలతో వాటిని అధిగమిస్తారు. కుటుంబ సభ్యుల మాటకు విలువనివ్వడం మంచిది. మనస్సౌఖ్యం ఉంది. నవగ్రహ ధ్యానం శుభప్రదం.

శుభకాలం. మొదలు పెట్టిన పనులను సులువుగా పూర్తిచేస్తారు. వృత్తి ఉద్యోగాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. ఒత్తిడిని దరిచేరనీయకండి. ఆదిత్య హృదయం చదువుకుంటే మంచిది.

అవసరానికి ఆర్థిక సహకారం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మీ అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. వ్యాపార లాభాలున్నాయి. సమయపాలనతో పనులను పూర్తిచేస్తారు. లక్ష్మీదేవి ఆలయ సందర్శనం శుభప్రదం.

మంచి పనులు చేపడతారు. గొప్ప వారితో సత్సాంగత్యం ఏర్పడుతుంది. కీలక విషయాల్లో పురోగతి ఉంటుంది. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ఆంజనేయ ఆరాధన శుభప్రదం.

ముఖ్య విషయాల్లో మంచి ఫలితాలున్నాయి. సాహసోపేతమైన నిర్ణయాలు అనుకూలిస్తాయి. అనవసర విషయాలపట్ల కాలాన్ని వృథాచేయకండి. మనశ్శాంతి లోపించకుండా జాగ్రత్తపడండి. వేంకటేశ్వర స్వామి దర్శనం శుభప్రదం.

ABOUT THE AUTHOR

...view details