తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Horoscope Today : ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? - తెలుగు రాశి ఫలాలు

Horoscope Today : ఈ రోజు (జనవరి 24) రాశి ఫలాల గురించి శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?

horoscope today in telugu january 24 tuesday
ఈ రోజు రాశి ఫలాలు

By

Published : Jan 24, 2023, 6:34 AM IST

Horoscope Today : ఈ రోజు (జనవరి 24) రాశి ఫలాల గురించి శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?

శుభకాలం. మంచి పనులు చేపడతారు.ఉద్యోగంలో మంచి ఫలితాలు ఉన్నాయి. మీ బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు. శ్రీమహాగణపతి ఆరాధన శుభకరం.

ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. పక్కనే ఉండి ఇబ్బంది పెట్టేవారు ఉన్నారు. విజ్ఞానపరంగా ఎదుగుతారు. ముఖ్యమైన విషయాల్లో ఓర్పు అవసరం. శివనామస్మరణ చేయడం ఉత్తమం.

కాలానుగుణంగా ముందుకు సాగితే సత్ఫలితాలు వస్తాయి.ఆర్థికంగా ఫర్వాలేదనిపిస్తుంది. కీలక పనుల్లో కాస్త జాప్యం జరిగే సూచనలు ఉన్నాయి. హనుమాన్ చాలీసా చదవడం శుభదాయకం.

ఏకాగ్రతతో పనిచేస్తే అనుకున్నది దక్కుతుంది. ఆధ్యాత్మికంగా ఎదుగుతారు. శారీరక శ్రమ పెరుగుతుంది. అష్టమంలో చంద్ర సంచారం అనుకూలించట్లేదు. దగ్గరివారితో విబేధాలు రాకుండా చూసుకోవాలి. ఆహారనియమాలను పాటించాలి.చంద్రశ్లోకం చదవాలి.

శరీరసౌఖ్యం ఉంది. ఇష్టమైన కార్యక్రమాలు నెరవేరుతాయి. యశస్సు వృద్ధి చెందుతుంది. ముఖ్యవిషయాల్లో కుటుంబ సహకారం ఉంటుంది. ప్రయాణాలు ఫలిస్తాయి. ఇష్టదైవ ప్రార్థన మేలు చేస్తుంది.

ప్రారంభించిన పనిలో ముందుచూపుతో వ్యవహరించాలి. అనుకున్నది దక్కుతుంది. చక్కటి ఆలోచనా విధానంతో ముందుకు సాగి మంచిపేరు సంపాదిస్తారు. శివనామస్మరణ ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.

మధ్యమ ఫలితాలు ఉన్నాయి. మీ మీ రంగాల్లో శ్రద్ధగా పనిచేయాలి. అందరినీ కలుపుకొనిపోవడం వల్ల సమస్యలు తగ్గుతాయి. శ్రమ అధికం అవుతుంది. సమాచారలోపం లేకుండా చూసుకోవాలి. ఆవేశాలకు పోకూడదు. గోవిందనామాలు చదివితే మంచి జరుగుతుంది.

ప్రారంభించిన పనులు కొద్దిగా ఆలస్యం అవుతాయి. ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ముందుకు సాగాలి. శ్రమ అధికం అవుతుంది. శివనామాన్ని జపించాలి.

గొప్ప ఫలితాలను సాధిస్తారు. సుఖసౌఖ్యాలు కలవు. ఒక వార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. సుఖసంతోషాలతో గడుపుతారు. చక్కటి ప్రణాళికలతో వ్యాపారంలో లాభాలను పొందుతారు. శ్రీవేంకటేశ్వరస్వామి ఆరాధన శ్రేయోదాయకం.

వృత్తి,ఉద్యోగ,వ్యాపారాది రంగాలలో మీకు ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. పట్టుదల వదలకండి. కలహ సూచన. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి.దక్షిణామూర్తి స్తోత్రం చదివితే మంచిది.

అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఆర్ధికంగా జాగ్రత్తలు అవసరం. నూతన వస్తువులను కొంటారు. మీ అధికార పరిధి పెరుగుతుంది. లక్ష్మీగణపతి ఆరాధన శుభప్రదం.

ఉద్యోగంలో మిశ్రమ వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారంతో ప్రారంభించబోయే పనుల్లో మంచి ఫలితాలను సాధిస్తారు. శుభవార్తలు వింటారు. బుద్ధిబలం బాగుంటుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. ఇష్ట దైవసందర్శనం శుభప్రదం.

ABOUT THE AUTHOR

...view details