Horoscope Today : ఈ రోజు మీ రాశి ఫలం ఎలా ఉందో తెలుసా? - జనవరి 21 రాశి ఫలాలు
Horoscope Today : ఈ రోజు (జనవరి 21) రాశి ఫలాల గురించి శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?
horocope today
By
Published : Jan 21, 2023, 6:31 AM IST
Horoscope Today : ఈ రోజు (జనవరి 21) రాశి ఫలాల గురించి శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?
కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి.గతంలో నిర్లక్ష్యం చేసిన కొన్ని అంశాలు ఇబ్బందిపెడతాయి. కలహ సూచన ఉంది. గోసేవ చేయడం వలన మంచి ఫలితాలను పొందుతారు.
ముందుచూపుతో వ్యవహరిస్తే ఆటంకాలు దూరం అవుతాయి. కీలక పనులను ప్రారంభించే ముందు సాధకబాధకాలను అంచనా వేసి ముందుకు సాగాలి. కుటుంబసభ్యుల వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. శివారాధన శుభప్రదం.
ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు.బంధుప్రీతి ఉంది. వస్త్ర,ధాన్య లాభాలు ఉన్నాయి. దుర్గాస్తుతి చదివితే బాగుంటుంది.
కీలకమైన పనులను ప్రారంభిస్తారు. మీ ధర్మం మిమ్మల్ని ఉన్నతుల్ని చేస్తుంది. మొహమాటం వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఆహార నియమాలను పాటించాలి. శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శనం శుభప్రదం.
ప్రారంభించిన పనులలో ఆటంకాలను అధిగమిస్తారు. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో ఒక శుభవార్తను పంచుకుంటారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. శ్రీవారి సందర్శనం శుభప్రదం.
అధికారులతో ఆచితూచి వ్యవహరించాలి. కీలకమైన విషయాల్లో జాగ్రత్త అవసరం. అనవసర ఖర్చులు జరిగే అవకాశాలు ఉన్నాయి. వైరాగ్యాన్ని దరిచేరనీయకండి. ఈశ్వర నామాన్ని జపించడం ఉత్తమం.
కుటుంబసభ్యుల సలహాలతో విజయాలు సాధిస్తారు. స్వల్ప ధనలాభం, మనఃసంతోషం కలుగుతాయి. అదృష్ట యోగం ఉంది. వ్యాపారంలో కలిసి వస్తుంది. అష్టలక్ష్మీ స్తుతి శుభకరం.
కీలక వ్యవహారాల్లో శ్రద్ధగా ముందుకు సాగాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ముఖ్య వ్యవహారాల్లో పెద్దల సలహాలు అవసరం అవుతాయి. నవగ్రహ స్తోత్రం చదవడం మంచిది.
అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. తోటివారి సహకారంతో పనులు పూర్తవుతాయి. అవసరానికి తగిన సహాయం అందుతుంది. ప్రారంభించిన పనులలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. శనిశ్లోకం చదవాలి.
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో సందర్భానుసారంగా ముందుకు సాగితే శుభఫలితాలు అందుకుంటారు. మీ పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఆర్థికంగా మిశ్రమకాలం. లక్ష్మీధ్యానం వల్ల అంతా మంచి జరుగుతుంది.
ప్రారంభించిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. స్థిరాస్తి కొనుగోలు విషయాలలో లాభం చేకూరుతుంది. మీ స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. సూర్యాష్టం చదివితే శుభఫలితాలు కలుగుతాయి.
ఒక ముఖ్యమైన పనిని విజయవంతంగా పూర్తిచేయగలుగుతారు. బాధ్యతలు పెరుగుతాయి. ఇబ్బంది పెట్టాలని చూసేవారి ప్రయత్నాలు వృథా ప్రయాసలే అవుతాయి. వ్యాపారంలో ఎదుగుతారు. లింగాష్టకం చదవాలి.