తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Horoscope Today : ఈ రోజు మీ రాశి ఫలం ఎలా ఉందో తెలుసా? - బుధవారం రాశి ఫలం

Horoscope Today : ఈ రోజు (జనవరి 18) రాశి ఫలాల గురించి శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?

horoscope today
horoscope today

By

Published : Jan 18, 2023, 6:30 AM IST

Horoscope Today : ఈ రోజు (జనవరి 18) రాశి ఫలాల గురించి శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?

ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనప్పటికీ అధిగమించే ప్రయత్నం చేస్తారు. ప్రయాణాలలో తగు జాగ్రత్తలు అవసరం. శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనం శుభప్రదం.

శుభకాలం. మానసిక ప్రశాంతత ఉంటుంది. ప్రారంభించిన పనిలో ఆత్మీయుల సహకారం అందుతుంది. బంధువుల వల్ల మేలు జరుగుతుంది. ఆధ్యాత్మిక విషయాల్లో చురుగ్గా పాల్గొంటారు. చంద్రశేఖరాష్టకం చదవడం శుభకరం.

మంచి కాలం. అనుకున్న పని నెరవేరుతుంది. ముఖ్య విషయాల్లో పురోగతి సాధిస్తారు. అందరినీ కలుపుకొనిపోవడం వల్ల త్వరగా లక్ష్యాన్ని చేరుకుంటారు. ఇష్టదైవ ధ్యానం వల్ల మేలు జరుగుతుంది.

ప్రారంభించిన పనులను పట్టుదలతో పూర్తిచేస్తారు. భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. కొన్ని సమయాల్లో అస్థిరబుద్ధితో వ్యవహరిస్తారు. ఈశ్వర ధ్యాన శ్లోకం చదివితే బాగుంటుంది.

కృషికి తగ్గ ఫలితాలు ఉన్నాయి. కీలక వ్యవహారాల్లో కుటుంబ సహకారం అందుతుంది. బంధుప్రీతి కలదు. ఈశ్వర సందర్శనం శుభప్రదం.

మంచికాలం. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఒక కీలక విషయంలో మీ ఆలోచనాధోరణికి ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యులకు శుభకాలం. దుర్గాదేవి సందర్శనం శుభప్రదం.

మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యుల సహకారం అవసరం. కొన్ని సంఘటనలు మనోవిచారాన్ని కలిగిస్తాయి. అనవసరమైన ఖర్చులు చేయాల్సిన పరిస్థితులు వస్తాయి. ప్రయాణాల్లో జాగ్రత్త. గణపతి స్తోత్రం చదవండి, మంచి జరుగుతుంది.

వృత్తి,ఉద్యోగ,వ్యాపారాది రంగాలలో మంచి ఫలితాలు ఉన్నాయి. కొత్త పనులను ప్రారంభించడానికి ఇది అనువైన సమయం. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. బంధు,మిత్రుల ఆదరణ ఉంటుంది. ఇష్టదైవారాధన శుభప్రదం.

ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. స్థిరమైన నిర్ణయాలతో గొప్ప ఫలితాలను అందుకుంటారు. శనిధ్యాన శ్లోకం చదవండి.

గతంలో పూర్తికాని పనుల్లో కదలిక వస్తుంది. ముఖ్య వ్యవహారాలలో అనుకూలఫలితాలు ఉన్నాయి. నచ్చినవారితో ఆనందాన్ని పంచుకుంటారు.శివుడిని ఆరాధించాలి.

బుద్ధిబలంతో వ్యవహరించి అనుకూల ఫలితాలు సాధిస్తారు. అనవసర ఆలోచనలతో కాలాన్ని వృథా చేయకండి. కొందరు మానసికంగా ఇబ్బంది పెట్టాలని చూస్తారు. వృథా ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. దుర్గా సందర్శనం శుభప్రదం.

శారీరక శ్రమ పెరుగుతుంది. కుటుంబ సభ్యులకు స్వల్ప అనారోగ్య సమస్యలు వస్తాయి. కొన్ని కీలకమైన వ్యవహారాలలో ఆలస్యం జరిగే సూచనలు ఉన్నాయి. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. శివ అష్టోత్తర శతనామావళి పారాయణ మంచిది.

ABOUT THE AUTHOR

...view details