తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Horoscope Today: ఈరోజు మీ రాశి ఫలం ఎలా ఉందంటే? - రాశి ఫలాలు టుడే

Horoscope Today: ఈ రోజు(డిసెంబర్ 07) రాశి ఫలం గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?

horoscope-today-in-telugu-december-7
12 రాశులవారి రాశి ఫలం వివరాలు

By

Published : Dec 7, 2022, 6:32 AM IST

Horoscope Today: ఈ రోజు(డిసెంబర్ 07) రాశి ఫలం గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?

మంచి కాలం. మీ పనితీరుతో పై అధికారుల మనసులను గెలుస్తారు. గౌరవ సన్మానాలు అందుకుంటారు. తోటివారి సహకారం ఉంటుంది. విష్ణు నామస్మరణ శుభప్రదం.

శ్రమ పెరుగుతుంది. ఉత్సాహం తగ్గకుండా చూసుకోవాలి. బంధువులతో ఆచి తూచి వ్యవహరించాలి. ఆంజనేయ స్వామిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.

వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలలో అంచనాలను అందుకుంటారు. విందు వినోద,ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక శుభవార్త మీ ఇంట ఆనందాన్ని నింపుతుంది. చంద్రధ్యానం శుభప్రదం.

.

గ్రహబలం విశేషంగా యోగిస్తోంది.నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. బంధుమిత్రుల వల్ల మేలు జరుగుతుంది. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. ఇష్టదేవతారాధన శుభప్రదం.

రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాల్సిన సమయమిది.బంధుమిత్రుల సహకారం లేకపోయినా కొన్ని పనులను ప్రారంభించి పూర్తిచేసే ప్రయత్నం చేస్తారు. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. ప్రయాణాలు తప్పకపోవచ్చు. గోసేవ చేయాలి.

శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలు, విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోరు. దైవారాధన మానవద్దు.

ప్రారంభించబోయే పనిలో శ్రమ పెరగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. మితభాషణం శ్రేయస్కరం. కీలక వ్యవహారాల్లో అనుభవజ్ఞుల సూచనలు తీసుకోవడం మంచిది. హనుమాన్‌ చాలీసా చదవడం వల్ల మనోబలం పెరుగుతుంది. మంచి ఫలితాలు పొందగలుగుతారు.

మంచి కాలం. ప్రయత్నాలు ఫలిస్తాయి. అవసరానికి తగిన సహాయం అందుతుంది.ధనధాన్యవృద్ధి ఉంది.శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. ఒకవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. శివనామస్మరణ శుభకరం.

మనోధైర్యంతో ముందుకు సాగి పనులను పూర్తిచేస్తారు. ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు.శత్రువుల మీద విజయం సాధిస్తారు. ప్రయాణాల్లో అజాగ్రత్త వద్దు. శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం ఉత్తమం.

ఆశించిన ఫలితాలు ఉన్నాయి. ఒక వ్యవహారంలో సహాయం అందుతుంది. ఒక శుభవార్త మీ మనోవిశ్వాసాన్ని పెంచుతుంది. దైవబలం ఉంది. ఇష్టదైవారాధన శుభప్రదం.

పట్టుదలతో పనులను పూర్తిచేస్తారు. భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. కొన్ని సమయాల్లో అస్థిరబుద్ధితో వ్యవహరిస్తారు. గోవింద నామాలు చదవడం వల్ల ఆపదలు తొలగుతాయి.

మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ముఖ్యమైన విషయాలకు సంబంధించి పెద్దలను కలుస్తారు. మీరు ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్న ఒక ముఖ్యమైన పని దాదాపుగా పూర్తి కావొస్తుంది. మహాలక్ష్మి అష్టోత్తరం చదివితే మంచిది.

ABOUT THE AUTHOR

...view details