తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Horoscope Today: ఈరోజు మీ రాశి ఫలం ఎలా ఉందంటే? - రాశిఫలాలు అప్డేట్స్

Horoscope Today: ఈ రోజు(డిసెంబర్ 06) రాశి ఫలం గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?

horoscope-today-in-telugu
horoscope

By

Published : Dec 6, 2022, 6:29 AM IST

Horoscope Today: ఈ రోజు(డిసెంబర్ 06) రాశి ఫలం గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?

తోటివారి సహకారంతో ముందుకు సాగండి, మంచి జరుగుతుంది. సంపూర్ణ అవగాహనతో ముందుకు సాగి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. తోటివారి సూచనలు ఉపకరిస్తాయి. ఇష్టదైవ ప్రార్ధన మంచి ఫలితాలను ఇస్తుంది.

మధ్యమ ఫలితాలు ఉన్నాయి. మీ మీ రంగాల్లో ఓర్పు,సహనం,పట్టుదల అవసరం. ఆర్ధికంగా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. అనవసరమైన ఆలోచనలతో కాలాన్ని వృథా చేయకండి. ఇష్టదేవతా ఆరాధన శక్తిని ఇస్తుంది.

చిత్తశుద్ధితో చేసే పనులు ఫలిస్తాయి. మీ స్వధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది. ప్రారంభించబోయే పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. శ్రీఆంజనేయ స్వామి సందర్శనం శుభప్రదం.

సంతోషకరమైన వార్తలను వింటారు. శరీర సౌఖ్యం ఉంది. బంధువులతో ప్రేమగా వ్యవహరించాలి. భోజనసౌఖ్యం ఉంది. ఆంజనేయ ఆరాధన శుభప్రదం.

అవరోధాలు ఉన్నాయి. ఓర్పుతో ముందుకు సాగాలి. మాట పట్టింపులకు పోకండి. మొహమాటంతో లేనిపోని సమస్యలను కొనితెచ్చుకోకండి. ఎవరినీ అతిగా నమ్మకండి. శ్రీసుబ్రహ్మణ్యస్వామి స్తోత్రం చదివితే మంచిది.

బాధ్యతలు పెరుగుతాయి. ధర్మసిద్ధి ఉంది.అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. స్థానచలన సూచనలు ఉన్నాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. దుర్గాదేవి ఆరాధన శక్తిని ఇస్తుంది.

అనుకూల ఫలితాలు ఉన్నాయి. చేసే పనిలో స్పష్టత పెరుగుతుంది. కీలక విషయాల్లో తోటివారి సలహాలు తప్పనిసరి. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇష్టదేవతా ఆరాధన శుభప్రదం.

ఆనందాన్నిచ్చే సంఘటనలు చోటుచేసుకుంటాయి. ఉద్యోగులకు అనుకూల కాలం. విందువినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ బుద్ధిబలంతో కీలక వ్యవహారాలలో సమయస్ఫూర్తితో వ్యవహరించి అందరి ప్రశంసలను అందుకుంటారు. ఇష్టదేవతారాధన శుభప్రదం.

ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఒక వ్యవహారంలో డబ్బు మీ చేతికి అందుతుంది. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాలి. శివుడిని ఆరాధిస్తే మంచిది.

చిత్తశుద్ధితో చేసే పనుల వల్ల మంచి జరుగుతుంది. చంచల నిర్ణయాలు ఇబ్బంది పెడతాయి. మనోధైర్యాన్ని కోల్పోవద్దు. మాట విలువను కాపాడుకోవాలి. అనవసర విషయాలతో సమయాన్ని వృథా కానీయకండి. నవగ్రహ ధ్యానం శుభప్రదం.

ఉత్సాహవంతమైన కాలాన్ని గడుపుతారు. గతంలో పూర్తికాని ఒక పని ఇప్పుడు పూర్తవుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఇష్టదైవ నామాన్ని జపిస్తే మరిన్ని శుభఫలితాలు కలుగుతాయి.

బుద్ధిబలం బాగుంటుంది. బంధుమిత్రులతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు.కు టుంబ వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. శ్రీలక్ష్మీధ్యానం శుభప్రదం.

ABOUT THE AUTHOR

...view details