Horoscope Today : ఈ రోజు రాశి ఫలం(డిసెంబరు 31) గురించి శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?
ప్రారంభించబోయే పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. కీలకమైన పనులను కొన్నాళ్ల పాటు వాయిదా వేయడమే మంచిది. కొన్ని పరిస్థితులు బాధ కలిగిస్తాయి. దుర్గా ఆరాధన శుభప్రదం.
విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక వ్యవహారంలో ధనం చేతికి అందుతుంది. భవిష్యత్తు ప్రణాళికలలో కొన్నింటిని అమలు చేయగలుగుతారు. సొంతింటి పనుల్లో ముందంజ వేయగలుగుతారు. బంధు,మిత్రులతో సంతోషంగా గడుపుతారు. దుర్గాధ్యానం శుభకరం.
మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ముఖ్యమైన విషయాలకు సంబంధించి పెద్దలను కలుస్తారు. మీరు ఎప్పటినుంచో చేయాలనుకుంటున్న ఒక ముఖ్యమైన పని దాదాపుగా పూర్తి కావొస్తుంది. శ్రీమహాలక్ష్మి అష్టోత్తరం చదివితే మంచిది.
ప్రారంభించిన పనుల్లో విఘ్నాలు పెరగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. ముఖ్య విషయాల్లో అనుకూల నిర్ణయాలు వెలువడతాయి. అధికారుల సహకారం ఉంటుంది. శివస్తోత్రం చదవడం మంచిది.
ప్రారంభించబోయే పనుల్లో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. ఆర్థిక విషయాల్లో పొదుపు సూత్రాన్ని పాటించాలి. కీలక సమస్యను పరిష్కరించి శత్రువులపై విజయం సాధించగలుగుతారు. శ్రీవేంకటేశ్వరుని ఆరాధన వల్ల ఆపద తొలగుతాయి.
శుభకాలం. మీ ప్రతిభ,పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ బుద్ధిబలంతో కీలక వ్యవహారాలలో సమయస్ఫూర్తితో వ్యవహరించి అందరి ప్రశంసలను అందుకుంటారు. ఇష్టదైవారాధన మంచిది.