Horoscope Today : ఈ రోజు మీ రాశి ఫలం ఎలా ఉందంటే? - డిసెంబర్25 రాశి ఫలాలు
Horoscope Today : ఈ రోజు రాశి ఫలం(డిసెంబరు 25) గురించి శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?
ఈ రోజు రాశి ఫలాలు
By
Published : Dec 25, 2022, 6:51 AM IST
|
Updated : Dec 25, 2022, 7:04 AM IST
Horoscope Today : ఈ రోజు రాశి ఫలం(డిసెంబరు 25) గురించి శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?
సంతోషకరమైన వార్తలు వింటారు. శరీర సౌఖ్యం ఉంది. బంధువులతో ప్రేమగా వ్యవహరించాలి. భోజనసౌఖ్యం ఉంది. ఆంజనేయ ఆరాధన శుభప్రదం.
ఓర్పుతో ముందుకు సాగాలి. మాట పట్టింపులకు పోకండి. మొహమాటం వల్ల లేనిపోని సమస్యలను కొని తెచ్చుకోకండి. ఎవరినీ అతిగా నమ్మకండి. సుబ్రహ్మణ్యస్వామి స్తోత్రం చదివితే మంచిది.
మధ్యమ ఫలితాలు ఉన్నాయి. మీ మీ రంగాల్లో ఓర్పు, సహనం, పట్టుదల అవసరం. ఆర్ధికంగా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. అనవసరమైన ఆలోచనలతో కాలాన్ని వృథా చేయకండి. ఇష్టదేవతా ఆరాధన శక్తిని ఇస్తుంది.
చిత్తశుద్ధితో చేసే పనులు ఫలిస్తాయి. మీ స్వధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది. ప్రారంభించబోయే పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఆంజనేయస్వామి సందర్శనం శుభప్రదం.
ఉత్సాహపరిచే సంఘటనలు చోటుచేసుకుంటాయి. ఉద్యోగులకు అనుకూల కాలం. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ బుద్ధిబలంతో కీలకవ్యవహారాలలో సమయస్ఫూర్తితో వ్యవహరించి అందరి ప్రశంసలను అందుకుంటారు. ఇష్టదేవతారాధన శుభప్రదం.
తోటివారి సహకారంతో ముందుకు సాగండి. మంచి జరుగుతుంది. సంపూర్ణ అవగాహనతో ముందుకు సాగి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. తోటివారి సూచనలు ఉపకరిస్తాయి.ఇష్టదైవ ప్రార్థన మంచి ఫలితాలను ఇస్తుంది.
బాధ్యతలు పెరుగుతాయి. అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. స్థానచలన సూచనలు ఉన్నాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. దుర్గాదేవి ఆరాధన శక్తిని ఇస్తుంది
ఉత్సాహవంతమైన కాలాన్ని గడుపుతారు. గతంలో పూర్తికాని ఒక పని ఇప్పుడు పూర్తవుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఇష్టదైవ నామాన్ని జపిస్తే మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయి.
ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఒక వ్యవహారంలో మీకు డబ్బు అందుతుంది. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్నిపెంచుతుంది. ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాలి. శివారాధన శుభకరం.
మీ మీ రంగాల్లో అనుకూల ఫలితాలు ఉన్నాయి. చేసేపనిలో స్పష్టత పెరుగుతుంది. కీలక విషయాల్లో తోటివారి సలహాలు తప్పనిసరి. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇష్టదేవతా ఆరాధన శుభప్రదం.
చిత్తశుద్ధితో చేసే పనుల వల్ల మంచి జరుగుతుంది. చంచల నిర్ణయాలు ఇబ్బంది పెడతాయి. మనోధైర్యాన్ని కోల్పోవద్దు. మాట విలువను కాపాడుకోవాలి. అనవసర విషయాలతో సమయాన్ని వృథా కానీయకండి. నవగ్రహ ధ్యానం శుభకరం.
బుద్ధిబలం బాగుంటుంది. బంధు,మిత్రులతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది.మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. శ్రీలక్ష్మీ ధ్యానం శుభప్రదం.