Horoscope Today : ఈ రోజు మీ రాశి ఫలం ఎలా ఉందంటే? - డిసెంబర్ 24 రాశిఫలాలు
Horoscope Today : ఈ రోజు రాశి ఫలం(డిసెంబరు 24) గురించి శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?
ఈ రోజు రాశి ఫలాలు
By
Published : Dec 24, 2022, 6:37 AM IST
Horoscope Today : ఈ రోజు రాశి ఫలం(డిసెంబరు 24) గురించి శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?
చిత్తశుద్ధితో పనులను పూర్తిచేస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. మనోధైర్యాన్ని కోల్పోరాదు. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు పాటించడం అవసరం. మాట విలువను కాపాడుకోవాలి. అనవసర కలహాలతో సమయం వృథా కానీయకండి. ఆదిత్య హృదయం చూసుకోవాలి.
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఆచితూచి అడుగేయాలి. చేపట్టే పనులలో కొన్ని ఇబ్బందులు పెరగకుండా చూసుకోవాలి. బంధుమిత్రులతో జాగ్రత్తగా మాట్లాడాలి. దుర్గాదేవిని పూజిస్తే శుభఫలితాలు కలుగుతాయి.
బుద్ధిబలం బాగుంటుంది. కొన్ని సంఘటనలు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. కీలక వ్యవహారాలలో ముందడుగు పడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. సుబ్రహ్మణ్యభుజంగ స్తోత్రం పారాయణం చేయడం మంచిది.
సకాలంలో పనులు పూర్తి అవుతాయి. మీ మీ రంగాల్లో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. ఆర్థికంగా శుభఫలితాలున్నాయి. మీ కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. బంధుమిత్రులతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుని భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. రామ నామ జపం శ్రేయోదాయకం.
మీలోని శ్రద్ధాభక్తులు మిమ్మల్ని గొప్పవారిని చేస్తాయి. మానసిక ఆనందం కలిగి ఉంటారు. ఉత్సాహంగా పనిచేస్తారు. అతిగా ఎవ్వరినీ విశ్వసించకండి. శ్రీరామనామాన్ని జపించడం ఉత్తమం.
మీ మీ రంగాల్లో బాగా శ్రద్దగా పనిచేయాలి. కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలు సాధిస్తారు. శారీరక శ్రమ పెరుగుతుంది. వివాదాలకు దూరంగా ఉండాలి. ఇష్టదైవ నామస్మరణా శుభాన్నిస్తుంది.
మంచి మనస్సుతో చేసే ప్రయత్నాలు సత్ఫలాన్నిస్తాయి. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. సుఖసంతోషాలతో గడుపుతారు. ఆర్థికంగా ప్రయోజనాలుంటాయి. గణపతి ఆరాధన మేలు చేస్తుంది.
తలపెట్టిన పనుల్లో విఘ్నాలు పెరగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. ముఖ్య విషయాల్లో అనుకూలమైన నిర్ణయాలు వెలువడతాయి. అధికారులకు అణిగిమణిగి ప్రవర్తించవలసి ఉంటుంది. శివ స్తోత్రం పఠించడం మంచిది.
ధర్మ సిద్ధి ఉంది. కొన్ని కీలక వ్యవహారాలను వారితో చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైన పనులను పూర్తిచేయగలుగుతారు. కొన్ని చర్చలు మీకు లాభిస్తాయి. ప్రసన్నాంజనేయ సోత్రం పారాయణ చేయాలి.
తలపెట్టిన కార్యాల్లో శ్రమపెరగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. మీరంటే గిట్టని వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. కలహాలకు తావివ్వకండి. శ్రీవేంకటేశ్వరస్వామి సందర్శనం మేలు చేస్తుంది.
ముఖ్య వ్యవహారాలలో అనుకున్నది దక్కుతుంది. నచ్చినవారితో ఆనందాన్ని పంచుకుంటారు. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. అవసరానికి సహాయసహకారాలు అందుతాయి. ప్రయాణాల్లో జాగ్రత్త. దుర్గ స్తోత్రం పఠించాలి.
సంతోషకరమైన వార్త వింటారు. ఆత్మీయులు ప్రేమాభిమానాలు కురిపిస్తారు. సానుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ధనలాభం సూచితం. వివాదాల్లో తలదూర్చకండి. సుబ్రహ్మణ్యేశ్వరస్వామి సందర్శనం శ్రేయోదాయకం.