తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Horoscope Today: ఈ రోజు మీ రాశి ఫలం ఎలా ఉందంటే? - rasi phalalu today

Horoscope Today : ఈ రోజు రాశి ఫలం (డిసెంబరు 23) గురించి శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?

daily horoscope
ఈ రోజు రాశి ఫలం

By

Published : Dec 23, 2022, 6:37 AM IST

Updated : Dec 23, 2022, 6:56 AM IST

Horoscope Today : ఈ రోజు రాశి ఫలం(డిసెంబరు 23) గురించి శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?

కార్యవిఘ్నాలు లేకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. బంధువులతో ఆచి తూచి వ్యవహరించాలి. మనః పీడ పెరుగుతుంది. పంచముఖ ఆంజనేయుడిని ఆరాధించడం ద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి.

సౌభాగ్య సిద్ధి ఉంది. ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. ఇష్టదేవతా స్తుతి మంచిది.

విజయావకాశాలు మెరుగవుతాయి. శత్రువులపై మీదే పైచేయి అవుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఇష్టదైవ నామస్మరణ శుభదాయకం.

ప్రణాళికలను అమలు చేసే దిశగా ముందుకు సాగండి. బలమైన ఆహారాన్ని తీసుకోవాలి. శత్రువుల జోలికి పోరాదు. వృథా ప్రయాణాలతో నిరుత్సాహం కలుగుతుంది. దుర్గారాధన చేస్తే మేలు జరుగుతుంది.

కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. పొదుపు పాటించాలి. స్థానచలనం సూచితం. కీలక వ్యవహారాల్లో ఓర్పుగా వ్యవహరించండి. శివనామాన్ని జపించాలి.

ఉద్యోగంలో ఉన్నతాధికారులతో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు రాకుండా జాగ్రత్తపడాలి. మీ నిజాయితీ మిమ్మల్ని కాపాడుతుంది. శివనామాన్ని జపిస్తే మంచిది.

ముఖ్యమైన విషయాల్లో అనుకూల ఫలితాలు వస్తాయి. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించండి. అనవసరంగా భయాందోళనలకు గురవుతారు. వృథా ఖర్చులను అదుపు చేయండి. లక్ష్మీదేవి ధ్యానం శుభప్రదం.

మధ్యమ ఫలితాలున్నాయి. తోటివారిని కలుపుకుపోవడం ద్వారా ఇబ్బందులు తగ్గుతాయి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఈశ్వర ధ్యాన శ్లోకాలు చదివితే శుభం జరుగుతుంది.

అభివృద్ధికి సంబంధించిన వార్త వింటారు. తలపెట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. విందు, వినోద, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దైవారాదన మానవద్దు. శివారాధన శుభప్రదం.

శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. పెద్దల నుంచి ప్రోత్సాహకాలను అందుకుంటారు. తోటివారి సహకారంతో పనులు త్వరగా పూర్తవుతాయి. వేంకటేశ్వస్వామిని ఆరాధించడం ద్వారా శుభ ఫలితాలను పొందగలుగుతారు.

శరీర సౌఖ్యం ఉంది. ఇష్టకార్యాలు సిద్ధిస్తాయి. యశస్సు వృద్ధి చెందుతుంది. ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సహకారం ఉంటుంది. ప్రయాణాలు ఫలిస్తాయి. ఇష్టదైవారాధన మేలు చేస్తుంది.

ఒక శుభవార్త ఆనందాన్నిస్తుంది. పక్కనే ఉంటూ ఇబ్బంది పెట్టేవారున్నారు. విజ్ఞానపరంగా ఎదుగుతారు. ముఖ్యమైన విషయాల్లో ఓర్పు అవసరం. శివనామస్మరణ ఉత్తమం.

Last Updated : Dec 23, 2022, 6:56 AM IST

ABOUT THE AUTHOR

...view details