Horoscope Today : ఈ రోజు రాశి ఫలం(డిసెంబరు 21) గురించి శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?
ఈ రోజు రాశి ఫలాలు
By
Published : Dec 21, 2022, 6:30 AM IST
Horoscope Today : ఈ రోజు రాశి ఫలం(డిసెంబరు 21) గురించి శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?
మీ మీ రంగాల్లో ముందు చూపుతో వ్యవహరించాలి. తోటివారి సూచనలు ఉపకరిస్తాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. ముఖ్య విషయాల్లో కుటుంబ సభ్యుల సహకారం తీసుకోవడం మంచిది. శివ ఆరాధన శుభప్రదం.
ఒక సంఘటన మానసిక శక్తిని పెంచుతుంది. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన మేలైన ఫలితాలను ఇస్తుంది.
సౌభాగ్యసిద్ధి ఉంది. ఒక ముఖ్యమైన సమస్య పరిష్కారం అవుతుంది. సమయానికి సహాయం చేసేవారు ఉన్నారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. హనుమాన్ చాలీసా చదివితే మంచిది.
అధికారులను ప్రసన్నం చేసుకునేలా ముందుకు సాగండి. సమస్యలు క్రమంగా తగ్గుముఖం పడతాయి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయ సందర్శనం శుభప్రదం.
మిశ్రమ కాలం. ముఖ్యమైన పనులను కొన్నాళ్లపాటు వాయిదా వేసుకోవడమే మంచిది. కొన్ని సంఘటనలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగంలో ఆచితూచి వ్యవహరించాలి. దుర్గాదేవిని, శ్రీవేంకటేశ్వరుడిని పూజిస్తే శుభఫలితాలు కలుగుతాయి.
మంచి కాలం. మీ పనితీరుతో పై అధికారుల మనసులను గెలుస్తారు. గౌరవ సన్మానాలు అందుకుంటారు. బంధువులతో విబేధాలు వచ్చే సూచనలు ఉన్నాయి. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. విష్ణు నామస్మరణ శుభకరం.
ఉద్యోగంలో శ్రద్ధగా పనిచేయాలి. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైన పనులను పూర్తిచేయగలుగుతారు. కొన్ని చర్చలు మీకు లాభిస్తాయి. లక్ష్మీ అష్టకాన్ని చదవాలి.
ఉత్తమ కాలం. కాలాన్ని అభివృద్ధి కోసం వినియోగించండి. బుద్ధిబలంతో కీలక వ్యవహారాల నుంచి బయటపడగలుగుతారు.ఇంట్లో శుభకార్య ప్రసక్తి వస్తుంది. కుటుంబ సౌఖ్యం కలదు. శని ధ్యాన శ్లోకం చదవడం మంచిది.
ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. కుటుంబ వాతావరణం అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. కొన్ని సంఘటనలు కాస్త మనస్తాపాన్ని కలిగిస్తాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. దైవారాధన మానవద్దు.
చేపట్టిన పనులలో విజయావకాశాలు ఉన్నాయి. ఆశించిన ఫలితాలు వస్తాయి. ఒక వ్యవహారంలో సహాయం అందుతుంది. ఒక శుభవార్త మీ మనోవిశ్వాసాన్ని పెంచుతుంది. దైవబలం ఉంది. ఇష్టదైవారాధన శుభప్రదం.
ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనా తోటి వారి సహాయంతో వాటిని అధిగమిస్తారు. ఒక వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. బంధుమిత్రులతో కలిసి శుభకార్యక్రమంలో పాల్గొంటారు. ఒక వార్త మిమ్మల్ని ఉత్సాహపరుస్తుంది. ఇష్టదైవారాధన శుభప్రదం.
అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. చేపట్టే పనుల్లో అలసట పెరగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. అభిప్రాయబేధాలు రాకుండా చూసుకోవాలి. మొహమాటంతో డబ్బులు ఖర్చు చేయకండి. బంధుమిత్రులతో మాట పట్టింపులకు పోవద్దు. చెడు సావాసాలు చేయరాదు. విష్ణు సహస్రనామాలను జపించాలి.