తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Horoscope Today : ఈ రోజు మీ రాశి ఫలం ఎలా ఉందంటే? - మంగళవారం రాశి ఫలాలు

Horoscope Today : ఈ రోజు రాశి ఫలం(డిసెంబరు 20) గురించి శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?

horoscope today
ఈ రోజు రాశి ఫలాలు

By

Published : Dec 20, 2022, 6:31 AM IST

Horoscope Today: ఈ రోజు రాశి ఫలం(డిసెంబరు 20) గురించి శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?

ప్రారంభించిన పనులు విజయవంతం అవుతాయి. బాధ్యతలను సమర్ధంగా నిర్వర్తిస్తారు. అర్థలాభం ఉంది. వ్యాపారంలో ఆర్ధికంగా ఎదుగుతారు. లింగాష్టకం చదవాలి.

సమయానుకూలంగా ముందుకు సాగండి. పనులకు ఆటంకం కలుగకుండా చూసుకోవాలి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ధనలాభం సూచితం. మానసిక ప్రశాంతత కోసం లక్ష్మీ సందర్శనం ఉత్తమం.

దైవబలంతో పనులను పూర్తిచేస్తారు. సుఖ సౌఖ్యాలు ఉన్నాయి. ఒక ముఖ్య విషయమై పెద్దలను కలుస్తారు. ఫలితం అనుకూలంగా వస్తుంది. మిత్రుల సహకారం ఉంటుంది.శని ధ్యానం శుభప్రదం.

మానసికంగా దృఢంగా ఉంటారు. అవసరానికి తగిన సాయం అందుతుంది. విరోధులను తక్కువగా అంచనా వేయవద్దు. హనుమాన్ చాలీసా చదవాలి.

చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. స్థిరాస్తి కొనుగోలు విషయాలు లాభిస్తాయి. మీ స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. సూర్యాష్టకం చదవడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

కీలక వ్యవహారాల్లో జాగ్రత్తగా అడుగేయాలి. అధికారులు మీ తీరుతో సంతృప్తిపడక పోవచ్చు. అస్థిరనిర్ణయాలతో సతమతం అవుతారు. కలహాలకు దూరంగా ఉండాలి. నవగ్రహ శ్లోకాలు చదవాలి.

మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ముఖ్యమైన విషయాలకు సంబంధించి పెద్దల సలహాలు మేలు చేస్తాయి. మీరు ఎప్పటినుంచో చేయాలనుకుంటున్న ఒక ముఖ్యమైన పనిని విజయవంతంగా పూర్తిచేస్తారు. మహాలక్ష్మి అష్టోత్తరం చదివితే మంచిది.

ఒక వ్యవహారంలో మీకు పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. ఒక వ్యవహారంలో మీ పనితీరును అధికారులు మెచ్చుకుంటారు. బంధువులతో అనుకూలత ఉంది. ద్వాదశ చంద్ర స్థితి అనుకూలంగా లేదు. చంద్రధ్యానం చదవడం వల్ల మంచి ఫలితాలు పొందగలుగుతారు.

ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. సొంతింటి వ్యవహారంలో ముందడుగు పడుతుంది. బంధుమిత్రులను కలుస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ఆదిత్య హృదయ స్తోత్రం చదవడం మంచిది.

స్థిర సంకల్పాలు నెరవేరుతాయి. వృత్తి,ఉద్యోగాల్లో ఆటంకాలు ఎదురవకుండా చూసుకోవాలి. ఉత్సాహంగా పనిచేయాలి. ఒత్తిడి పెరుగుతుంది.అనవసర ఖర్చులు చేస్తారు. దుర్గాధ్యానం వల్ల మేలు జరుగుతుంది.

ఏ పనిని ప్రారంభించినా సులువుగా పూర్తవుతుంది. అధికారుల సహాయంతో ఒక పనిని పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషాన్ని పంచుకుంటారు. సూర్య ఆరాధన శుభదాయకం.

ప్రారంభించబోయే పనుల్లో శ్రమ పెరుగుతుంది. ఆత్మీయుల సహాయసహకారాలు మేలుచేస్తాయి. శత్రువులు మిత్రులు అవుతారు. ముఖ్యమైన కొనుగోళ్లు చేస్తారు. శ్రీవేంకటేశ్వరస్వామి సందర్శనం శక్తిని ఇస్తుంది.

ABOUT THE AUTHOR

...view details