Horoscope Today: ఈ రోజు మీ రాశి ఫలం ఎలా ఉందంటే? - రాశులవారీగా దినఫలాలు
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం(డిసెంబరు 17) గురించి శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?
రాశి ఫలాలు
By
Published : Dec 17, 2022, 6:29 AM IST
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం(డిసెంబరు 17) గురించి శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?
ప్రారంభించబోయే పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. శ్రమ పెరగకుండా చూసుకోవాలి. మానసికంగా దృఢంగా ఉంటారు. సంకటహర గణపతి స్తోత్రం చదవడం మంచిది.
ప్రారంభించిన పనులలో ఇబ్బందులను అధిగమిస్తారు. నిర్ణీత సమయంలో లక్ష్యాలను చేరుకోడానికి ఎక్కువగా కష్టపడాలి. భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆంజనేయ స్వామి సందర్శనం శుభప్రదం.
చేపట్టే పనుల్లో అలసట చెందకుండా చూసుకోవాలి. కొన్ని సంఘటనలు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. కీలక వ్యవహారాలలో ముందడుగు పడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలు ఫలిస్తాయి. ఇష్టదైవ ప్రార్ధన శుభప్రదం.
ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ఆర్ధికస్థితి మెరుగుపడుతుంది. సంతోషకరంగా కాలాన్ని గడుపుతారు. అవసరానికి తగిన సహాయం చేసేవారున్నారు. శివనామస్మరణ ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.
చేపట్టిన పనులలో కొన్ని ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఆశించిన ఫలితాలు రావడానికి కాస్త ఎక్కువ శ్రమించాల్సి వస్తుంది. కీలక నిర్ణయాలు తీసుకోవడంలో తడబడతారు. అనవసరమైన ఖర్చులు చేయాల్సిన పరిస్థితులు వస్తాయి. గణపతి స్తోత్రం చదవండి మంచి జరుగుతుంది.
శరీరసౌఖ్యం ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. బంధుమిత్రులతో కలిసి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఇష్టదేవతా శ్లోకాలు చదివితే మంచిది.
మీ స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. ఒక సమస్య మానసిక ప్రశాంతతను తగ్గిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. ఒక వార్త బాధ కలిగిస్తుంది. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదవడం మంచిది.
శుభకాలం.మీ మీ రంగాల్లో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. ముఖ్యమైన పనులను ప్రారంభించడానికి ఇది సరైన సమయం. మానసిక సంతృప్తిని కలిగించే సంఘటనలు చోటుచేసుకుంటాయి. లక్ష్మీదేవి సందర్శనం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.
అనుకూల వాతావరణం ఉంటుంది. బాధ్యతలు పెరుగుతాయి. ఇబ్బంది పెట్టాలని చూసేవారి ప్రయత్నాలు వృథా ప్రయాసలే అవుతాయి. వ్యాపారంలో ఆర్ధికంగా ఎదుగుతారు. ఈశ్వర శ్లోకాలు చదవాలి.
మిశ్రమకాలం. శ్రమకు తగ్గ ఫలితాలు ఉంటాయి. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. పనులను విషయాలను సాగదీయకండి, త్వరగా పూర్తయ్యేలా ప్రణాళికను సిద్ధం చేయండి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఆదిత్య హృదయం చదవడం మంచిది.
చేపట్టిన పనులను కుటుంబసభ్యుల సహకారంతో పూర్తిచేయగలుగుతారు. కుటుంబ వ్యవహారాలలో అప్రమత్తంగా ఉండాలి. తప్పుదారి పట్టించే వారున్నారు జాగ్రత్త. సాయి నామాన్ని జపించాలి.
కీలక వ్యవహారాలలో అధికారుల ప్రశంసలు లభిస్తాయి. మీ కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. బంధుమిత్రుల వల్ల మేలు జరుగుతుంది. సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామావళి చదివితే బాగుంటుంది.