తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Horoscope Today: ఈ రోజు మీ రాశి ఫలం ఎలా ఉందంటే? - horoscope telugu

Horoscope Today: ఈ రోజు(డిసెంబర్ 11) రాశి ఫలం గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?

horoscope-today-in-telugu
horoscope-today-in-telugu

By

Published : Dec 11, 2022, 6:09 AM IST

Horoscope Today: ఈ రోజు(డిసెంబర్ 11) రాశి ఫలం గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?

పనులకు ఆటంకం కలుగకుండా చూసుకోవాలి. అధికారులు మీకు అనుకూలమైన ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు.కొన్ని కీలకపనులను పూర్తిచేయగలుగుతారు. బద్ధకాన్ని దరిచేరనీయకండి. శివాష్టోత్తరాన్ని చదివితే మంచిది.

సమాజంలో కీర్తి పెరుగుతుంది. సంతోషకరమైన కాలాన్ని గడుపుతారు. కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు వస్తాయి. విష్ణు సహస్రనామ పారాయణ శుభకరం.

అభివృద్ధికి సంబంధించిన అంశాల్లో ముందడుగు వేస్తారు. ధనయోగం ఉంది. ఖర్చు పెట్టే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. ముఖ్య వ్యవహారాల్లో అనుభవజ్ఞుల సలహాలు మేలు చేస్తాయి. ఇష్ట దేవతారాధన శుభప్రదం.

బుద్ధిబలం బాగుంటుంది. కొన్నిసంఘటనలు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. కీలక వ్యవహారాలలో ముందడుగు పడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలలో అప్రమ్తతంగా ఉండాలి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం పారాయణ చేయడం మంచిది.

మీ పట్టుదలే మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది. మానసిక ఆనందంతో ఉత్సాహంగా పనిచేస్తారు.ఎవరినీ అతిగా విశ్వసించకండి. శ్రీరామనామాన్ని జపించడం ఉత్తమం.

మీ మీ రంగాల్లో మనోధైర్యంతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. సూర్యభగవానుని సందర్శనం ఉత్తమం.

మిశ్రమ వాతావరణం ఉంటుంది. అధికారులతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బందిపడతారు. అనవసర ఖర్చులు జరిగే సూచనలు ఉన్నాయి. శ్రీవేంకటేశ్వరుడిని ఆరాధించడం వల్ల శుభ ఫలితాలను పొందగలుగుతారు.

అనుకూలఫలితాలు ఉన్నాయి. విందువినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. ఆదాయానికి తగ్గ వ్యయం ఉంది. హనుమంతుడిని ఆరాధించాలి.

ప్రయత్నకార్యసిద్ధి ఉంది. ఇబ్బందికర పరిస్థితులకు దూరంగా ఉండండి. ఇంట్లో శుభకార్యక్రమాలు జరుగుతాయి. సంతోషకరమైన కాలాన్ని గడుపుతారు. ప్రయాణాలు ఫలిస్తాయి.ఈశ్వరారాధన శుభప్రదం.

ప్రారంభించే పనిలో ఆటంకాలు అధికం అవుతాయి. కొన్ని సంఘటనలు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. అనవసర ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. కనకధారాస్తవం చదవాలి.

వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు.బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు.ఆంజనేయ దర్శనం శుభకరం.

ధనధాన్య లాభాలు ఉన్నాయి. ప్రయత్నాలు ఫలిస్తాయి. వాణిజ్యరంగంలోని వారికి కీలక వ్యవహారాలు కలిసి వస్తాయి. విందువినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక విషయాలలో కాస్త్ర అప్రమత్తంగా ఉంటే మంచిది. శ్రీహయగ్రీవ స్తోత్రం చదివితే మంచిది.

ABOUT THE AUTHOR

...view details