Horoscope Today: ఈ రోజు(ఫిబ్రవరి 26) రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే?
horoscope today
By
Published : Feb 26, 2023, 7:08 AM IST
Horoscope Today: ఈ రోజు(ఫిబ్రవరి 26) రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే?
ఈ రోజు మీరు ఎంత కష్టపడి పనిచేసినా ఆశించిన ఫలితాలు వచ్చే సూచనలు లేవు. మధ్యాహ్నం సమయంలో ప్రయాణం చేసేందుకు మీరు అంత ఉత్సాహం చూపరు. సాయంత్రం వేళ ప్రశాంతంగా ఉంటారు. సన్నిహిత చర్చలకు అవకాశం ఉంది.
ఇది ఇంట్లో వేడుకల జరిగే సమయం. కుటుంబమంతా వేడుకల్లో ఉంటే మీరు మాత్రం మీ వ్యాపార పనుల్లో బిజీగా ఉంటారు. సాయంత్రం వేళ మీరు వృత్తిరీత్యా దూర ప్రయాణం చేసే అవకాశాలు ఉన్నాయి. వ్యక్తిగతంగా సాధించిన విజయాన్ని ఆనందించడం కంటే వృత్తిపరమైన విజయాన్ని అందుకునేందుకు మీరు సమయాన్ని కేటాయిస్తారు.
మీ స్నేహితుల ద్వారా ఈ రోజు లబ్ది పొందుతారు. భవిష్యత్‌లో మీకు సాయపడగలిగే వ్యక్తులతో మీరు స్నేహం చేస్తారు. ఆర్థికంగా ఊహించిన దానికన్నా ఎక్కువ లబ్ది పొందుతారు. ఈ రోజు ఏదైనా ప్రయాణం కూడా పెట్టుకుంటారు. ప్రభుత్వ సహాయం కూడా అందే అవకాశాలు ఉన్నాయి.
ఈ రోజు అంతా ఎమోషనల్ గా ఉండకండి. జీవిత దృక్పథం మార్చుకోవాలనే మీ ఆలోచన కారణంగా ఈ రోజు మీరు అన్ని రంగాల్లో రాణిస్తారు. మీ ఇంటిని మార్చడం లేదా తిరిగి అలంకరించే అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనా ఓ ఆశాజకనమైన రోజు ఇది.
మీకు లభించిన కొత్త పేరు మీ హృదయాన్ని గాయపరచవచ్చు. మీరు చేసిన పొదుపుకంటే మీ ఖర్చులు పెరుగుతాయి. మీ వైవాహిక జీవితం మధురంగా ఉంటుంది. సంతోషకరమైన జీవితం కోసం మీ భాగస్వామితో చక్కని అనుబంధం ఏర్పరచుకోవాలని సూచిస్తున్నాం.
ఈ రోజు మీలో తీవ్రమైన ఆలోచన చేయాలనే కోరిక కలుగుతుంది. ప్రకృతి వైపు ఆకర్షితులయ్యే సూచనలూ కనిపిస్తున్నాయి. వివాదాలు ఏర్పడకుండా చూసేందుకు మీ మాటను అదుపులో పెట్టుకోండి. మీ ఆరోగ్యం కూడా స్వల్పంగా ఇబ్బంది పెడుతుంది. మీరు మీ ప్రయాణాలు మధ్యాహ్నం తర్వాత పెట్టుకోవడం మంచిది. ఈ రోజు ఏదైనా కార్యం తలపెడితే అది మధ్యలోనే ఆగిపోతుంది.
తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే నష్టం వాటిల్లుతుంది. ఏదైనా పని చేపట్టేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. లేనిపక్షంలో మీ ప్రయత్నాలన్నీ వృధా అవుతాయి. మీ ప్రయత్నాలన్నీ వృథా అవుతాయి కాబట్టి ఈ రోజు అంతా ఆశాజనకంగా కనిపించడం లేదు. వ్యాపారంలో భాగంగా ప్రయాణాలు చేపట్టే సూచనలున్నాయి. సాయంత్రం మీరు ప్రేమించే వ్యక్తిని ఆశ్చర్యపరచండి.
ఈ రోజు మీరు మౌనంగా, ప్రశాంతంగా ఉంటారు. ఆత్మశోధన చేసుకుంటారు. మీ భావాలు వ్యక్తం చేసి మీ కుటుంబ సభ్యుల ముందు ఓ సెంటిమెంటల్ వ్యక్తిగా నిలుచుంటారు. మధ్యాహ్నం వేళ వ్యాపార పనులు లేదా సరదా, వినోదాల్లో తీరిక లేకుండా ఉంటారు. సాయంత్రం వేళ మీ జేబు ఖాళీ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ రోజు మీ ఆరోగ్యం క్రమేపీ క్షీణించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు కష్టపడినదానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. కాని దానికి కాస్త సమయం పట్టే అవకాశం ఉన్నందున సహనంతో వేచి చూడాల్సిన సమయం ఇది. మీ ప్రయాణాలను వచ్చే వారానికి వాయిదా వేసుకోవడం ఉత్తమం. మధ్యాహ్నం నుంచి మీ తారాబలం బాగుంది. ఈ సమయంలో మీకు ఆరోగ్యపరంగా కానీ, ఆర్థికపరంగా కానీ, ఇతర విషయాల పట్ల మీ దృక్పథం కానీ, అన్నీ మీకు అనుకూలంగా వుంటాయి. సాయంత్ర సమయంలో మంచి సంగీతంతో ఆనందించండి.
ఈ రోజు భావోద్వేగానికి లోనయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆస్తులు, భూములకు సంబంధించిన వ్యవహారాలకు దూరంగా ఉండండి. మీకు ఈ రోజంతా మానసికంగా చికాకుగా అనిపిస్తుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. మొండిగా ఉంటే మీకు ప్రయోజనం ఉండదు కాబట్టి మీరు కోరుకున్నదే జరగాలని భావించకండి.
ఈ రోజు మీరు కొత్త పనులు మొదలు పెట్టడానికి శుభప్రదమైన రోజు. కానీ మీ ఆలోచనలు స్థిరంగా ఉండవు. తొందరపడి నిర్ణయాలు తీసుకునే ధోరణి మానుకోండి. ఈ రోజు రచయితలకు చాలా మంచి రోజు. కానీ మధ్యాహ్నం తర్వాత గానీ, సాయంత్రానికి గానీ పరిస్థితిలో మార్పు ఉంటుంది. ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. కొందరి మాటలు, ప్రవర్తనలూ మిమ్మల్ని బాధించే అవకాశం ఉంది. ఆస్తికి సంబంధించిన విషయాలను గురించి ఈ రోజు ఏ పనులు చేయకపోవడం మంచిది. మీ ఆందోళన తగ్గించడానికి ఆధ్యాత్మికత ఎంతో ఉపకరిస్తుంది.
ఈ రోజు మీకు వినాయకుడి అనుగ్రహం ఉంటుంది. గణేశుడి ఆజ్ఞ మేరకు మీరు మీ గురించి ఆలోచించడమే కాకుండా అందరి గురించీ ఆలోచిస్తారు. లక్ష్య సాధన కోసం మీరు పడుతున్న తపన కారణంగా మీరు పనిచేస్తున్న రంగంలో, మీ కుటుంబం నుంచి కూడా కావలసినంతగా సహకారం లభిస్తుంది. మీ మాటల్ని అదుపులో ఉంచుకుంటే, వివాదాలకు దూరంగా ఉండవచ్చు. మొత్తానికి, మీరొక సంపూర్ణ మానవునిగా ఎదిగే సూచనలు ఉన్నాయి. కొత్త పనులతో ఈ రోజంతా హడావుడిగా ఉంటారు. అనుకున్నది సాధిస్తామని మీపై మీకు నమ్మకం లేకపోతే కొత్త పనులు ప్రారంభించకండి. ప్రయాణం వాయిదా వెయ్యడం మంచిది.