తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Horoscope Today: ఈరోజు మీ రాశి ఫలం చూసుకున్నారా? - telugu panchangam

Horoscope Today: ఈ రోజు(ఫిబ్రవరి 22) రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే?

horoscope-today
horoscope-today

By

Published : Feb 22, 2023, 6:30 AM IST

Horoscope Today: ఈ రోజు(ఫిబ్రవరి 22) రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే?

మీకు స్థిరమైన అభిప్రాయం ఉండనివ్వకుండా మీ నిర్ణయ శక్తి అడ్డుపడుతుంది. ఈరోజు మీకు అనిశ్చితిగా ఉంటుంది. ఇది మీకే కాదు.. ఇతరులకూ మంచిది కాదు. మీ జీవితంలో ఉన్న 'ఇతరులు' ఇప్పటికే ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. కానీ ప్రస్తుతం అది అంత సానుకూలమైన పాత్ర కాదు.

నక్షత్రాలు మిమ్మల్ని మెప్పించడానికి సిద్ధంగా ఉన్నాయి. నక్షత్రాలు మీపై అనుగ్రహించిన సంతోషాన్ని ఆస్వాదించండి. ఆ సంతోషాన్ని ఇతరులతో పంచుకోండి. ఈరోజు సాయంత్రం ఆనందంతో మీ కుటుంబంతో, ప్రియమైనవారితో గడుపుతారు.

ఒక బలమైన శారీరక ఆరోగ్యం, ఒక నిర్మలమైన మానసిక స్థితి మిమ్మల్ని తృప్తిగా, ఆనందంగా ఉంచుతాయి. పని వద్ద కూడా సంతోషకరమైన స్థితి కలిగి ఉంటారు. మీకు ఒక రివార్డు లభించవచ్చు. ఆఫీసులో మీ స్థానం మెరుగవుతుంది. ఇంతకుముందు ప్రారంభించిన ప్రాజెక్టులు ఇప్పుడు ఫలవంతం అవుతాయి. మీరు లాభాలు పొందుతారు.

ఈరోజు పనులు అన్నీ విజయవంతం అవుతాయి. మీ సీనియర్లతో ముఖ్యమైన చర్చల్లో పాల్గొనవచ్చు. వాళ్లు మీ పనితీరుతో సంతోషంగా ఉంటారు. ఈరోజు పదోన్నతులకు ఆస్కారం ఉంది. ఇంటి విషయంలో, మీరు మీ కుటుంబ సభ్యులతో పరస్పర సంభాషణలు చేయడానికి సంతోషంగా ఉంటారు. మీ ఇంటి సౌందర్యం మెరుగుపరచడం కోసం కొత్త పనులు చేపడతారు.

ఈరోజు మీరు మీ ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాలి. వైద్యపరమైన ఖర్చులకు చాలా అవకాశం ఉంది. ఈరోజు మీరు బయట తినకుండా ఉంటే మంచిది. కొన్ని ప్రతికూల ఆలోచనలు మిమ్మల్ని రోజంతా ఇబ్బంది పెట్టవచ్చు. మీరు వాటి నుంచి దూరంగా ఉండాలి. ధ్యానం, ఆధ్యాత్మికత ఈ సమస్యలను అధిగమించి మానసికంగా ప్రశాంతంగా ఉండటానికి సహకరిస్తాయి.

ప్రజాదరణ, అధికారం, గౌరవం, సామాజిక అంగీకారం పెరుగుతాయి. ఆఫీసులో లేదా ఇంటి వద్ద మీ సంబంధాలను మెరుగుపర్చుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈరోజు మీరు షాపింగ్ చేయడానికి అవకాశం ఉంది. మీరు ఒక వాహనం లేదా చాలా ఖరీదైన ఆభరణం కొనడం ద్వారా మీకు మీరు కానుక ఇచ్చుకుంటారు.

ఈరోజు మీకు మంచిగా ఉంటుంది. ఇప్పుడు మీ హృదయం కుటుంబం, ఇంటి వద్ద ఉంది. మీరు బాగా అవసరమైన మానసిక ప్రశాంతతను, అది ఇచ్చే స్థిరత్వాన్ని ప్రేమిస్తారు. పని వద్ద వాతావరణం అనుకూలంగా ఉంటుంది. మీ కింది స్థాయి ఉద్యోగులు, సహచరులు, యజమానులు అందరూ మీరు ఇప్పుడున్న మానసిక స్థితిలోనే ఉన్నారు.

ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వ్యాపార సంబంధిత ప్రయాణాలు మానుకోండి. లేదా కనీసం సాయంత్రం వరకు వాయిదా వేయండి. ఈరోజు విద్యార్ధులకు, చదువులకు సంబంధించి బాగా ఉంటుంది. ఉపాధ్యాయులు, రచయితలు ప్రయోజనం పొందుతారు.

జీర్ణ సంబంధమైన సమస్యలు మీకు ఇబ్బంది కలిగించవచ్చు. మీ పిల్లల చదువులు, ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు రోజు మొత్తం మీ మనసులో మెదులుతూ ఉంటాయి. మీరు కోపాన్ని అదుపులో పెట్టుకోని, మేథోపరమైన చర్చల నుంచి దూరంగా ఉంటే మంచిది. ఈరోజు కళలు, సాహిత్యం వైపు ఆసక్తిని పెంపొందించుకుంటారు.

నక్షత్రాలు మీకు ఒక అద్భుతమైన రోజును సూచిస్తున్నాయి. ప్రత్యేకంగా మిమ్మల్ని ఇటీవలే ఆకర్షించినది ఏదైనా ప్రారంభించడానికి ఈరోజు మంచిది. వృత్తి, వ్యాపారం లేదా ఏ రంగానికి సంబంధించిన ఆలోచననైనా అమలు చేయడానికి ఉత్తమ సమయం.

సాంకేతిక పరిజ్ఞానం మంచిదేనా కాదా అన్న ఆలోచనలో పడతారు. ఎంపిక చేసుకోవాల్సిన అంశాలు తక్కువగా ఉన్నప్పుడే జీవితం సరళంగా ఉందని భావిస్తారు. మీలో రగులుతున్న కోపాన్ని అదుపులో పెట్టుకోండి.

మీరు ఈరోజు మానసికంగా ప్రశాంతంగా, శారీరకంగా దృఢంగా ఉంటారు. కొత్త పనులు ప్రారంభించడానికి ఉత్సాహం చూపుతారు. మీ కుటుంబ జీవితం స్నేహపూర్వకంగా ఉంటుంది. స్నేహితులు, ప్రియమైన వారితో ఒక విహారయాత్ర మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఆర్థిక లాభాలకు చాలా అవకాశం ఉంది. మీరు ధార్మిక కార్యకలాపాలు, తీర్థయాత్రలపై ఖర్చు చేస్తారు.

ABOUT THE AUTHOR

...view details