తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Horoscope Today: ఈ రోజు మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Horoscope Today: ఈ రోజు(ఫిబ్రవరి 20) రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే?

horoscope-today-february-20-horoscope-in-telugu
ఈ రోజు రాశి ఫలాలు

By

Published : Feb 20, 2023, 6:19 AM IST

Horoscope Today: ఈ రోజు(ఫిబ్రవరి 20) రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే?

వ్యక్తులు, విషయాలపై ఈ రోజు మీకు అధిక వాంఛ ఉంటుంది. అదే సమయంలో మీరు ప్రతి విషయంలో.. ముఖ్యంగా మనుషుల విషయంలో అనిశ్చితితో, అనుమానంతో, అభద్రతాభావంతో ఉంటారు. మీకు సన్నిహితంగా ఉండేవారి ఉద్దేశాలు, ఆలోచనల విషయంలోనూ మీకు అనుమానాలు కలుగుతాయి. ఇంట్లోనూ ఏదో తెలియని అశాంతి, ఆందోళన ఆవరించి ఉంటాయి. మొత్తంగా ఈ రోజు అంత కలిసివచ్చేది కాదు. తెలివిగా, జాగ్రత్తగా వ్యవహరించండి.

కుటుంబసభ్యులతో కలిసి ప్రయాణం చేయాలన్న మీ కోరిక ముందుకు కదులుతుంది. దానికి సంబంధించిన షెడ్యూల్ మీరు ఖరారు చేస్తారు. మీ బడ్జెట్​కు తగిన రీతిలో సంతృప్తికరంగా మీ ప్రయాణ ప్రణాళికలు ఉంటాయి.

ఈ రోజు మీరు మీ ఉద్యోగానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. మీ ఏకాగ్రతతో మీకు అప్పగించిన పనిని మీరు వేగంగా పూర్తిచేస్తారు. పని చేయాలన్న తపన ఈ రోజు మీలో అధికంగా ఉంటుంది. స్నేహితులకు కూడా అధిక ప్రాధాన్యం ఇస్తారని, వారిని కలిసేందుకు వెళ్తారు.

ఈ రోజంతా దురదృష్టం, చికాకులూ ఉండవచ్చు. కొత్త వ్యవహారాలు మొదలు పెట్టవద్దు. ఇబ్బందులు వస్తాయి. మీరు శాంతం వహించండి. అనైతికమైన పనులను మనసులోకి చేరనీయకండి. తప్పుడు పనులు చాలా ఇరుకున పెడతాయి. ఆఫీసుకు సంబంధించిన వ్యవహారాలు అనుకూలం కావు. కుటుంబంలో శాంతిని, సమన్వయ ధోరణిని దూరం చేసే పరిస్థితులను తలెత్తనీయకండి. మానసిక బాధ, వ్యాకులత కనిపిస్తున్నాయి. నిరాశ పడకండి.

మీకు ఈ రోజు అనుకున్నట్టు గడవకపోవచ్చు. మీరు మీ జీవిత భాగస్వామితో వాదనలకు దిగే అవకాశం. పార్టనర్​షిప్​కు సంబంధించి తగాదాలు, బిజినెస్ వివాదాలకు దూరంగా ఉండాలి. ఆరోగ్య సంబంధమైన సమస్యలు ఉండొచ్చు. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించిన చింత ఉంటుంది. సమాజంలో ఉన్న పరిచయాలూ, పబ్లిక్ డీలింగ్స్ అనుకూలంగా ఉంటాయి. విదేశీయులను కలుసుకునే అవకాశం ఉంది. ఏ విషయమూ కూడా పూర్తయ్యేవరకూ నమ్మవద్దు.

చాలా అనుకూలమైన రోజు. మీ ఇంట్లో శాంతి సమన్వయ ధోరణి ఉంటాయి. మీరు రోజంతా చాలా హుషారుగా ఉంటారు. మీరు ఆశించినట్టే మీరు సంతోషంగా, సంతృప్తిగా, ఫిట్​గా ఉంటారు. అనారోగ్యం నుంచి మెల్లిగా తేరుకుంటూ ఉంటారు. లాభం, పరపతి అన్నీ ఊపందుకుంటాయి. కొలీగ్స్ సహకారం, శుభవార్తలు ఉన్నాయని తారాబలం చెబుతోంది.

మీ బాస్ కోపాన్ని మీరు చవి చూస్తారు. మీ తోటి ఉద్యోగులు కూడా మీకు అన్యమనస్కంగానే సహకారం అందిస్తారు. కెరీర్ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న బిగినర్స్​కు ఇంటర్వ్యూల్లో విజయాలు ఆలస్యమవుతాయి.

ఈ రోజు మీరు మౌనంగా, గంభీరంగా ఉండాలి. మీ స్నేహితులు, బంధువులు కొంచెం అభిప్రాయ భేదాలతో ప్రవర్తించవచ్చు. అనారోగ్యం రావచ్చు. ధన నష్టం, పరువు నష్టం సూచనలు కూడా కొట్టి పారేయలేం. ఈ రోజు మీరు స్త్రీల జోలికి, జలాశయాల వద్దకు వెళ్లకండి. మీరు మీ పరువుని రిస్క్​లో పెడుతున్నారు. ఒకటికి రెండు సార్లు ఆలోచించి గానీ డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టకండి.

మీకు ఈ రోజు ఆధ్యాత్మికంగా గడుస్తుంది. మీరు ఎంతో సంతోషంగా ఉంటారు. మీ అక్కాచెల్లెళ్లు, అన్నాదమ్ములు కూడా మీతో చాలా సరదాగా ఉంటారు. ఈ రోజు గొప్పరోజు. ఏదైనా కొత్తగా వెంచర్ ప్రారంభించడం, కొత్త బాధ్యతలు తీసుకోవడం వంటివి ఉంటే అది ఈ రోజే చేయండి. స్నేహితులతోనూ, సన్నిహితులతోనూ బాగా ఎంజాయ్ చేస్తారు. తారాబలం ప్రకారం, మీకు పోటీ ఉండదు. సంతోషంగా ఒక జాలీ ట్రిప్​కి వెళ్లి రండి. పరపతి పెరుగుతుంది.

మార్కెట్​లో పెట్టిన పెట్టుబడులు బాగా లాభిస్తాయి. కుటుంబ సభ్యులకు అస్వస్థత, మీకు ఆందోళన ఉంటుంది. గృహ వాతావరణం అంత బాగా లేదు. భార్యకు సంతృప్తి, విశ్రాంతి ఉండవు. పిల్లలు బాగా కష్టపడి చదవాల్సి ఉంటుంది. ఆరోగ్య సంబంధమైన సమస్యలు ఉంటాయి. కంటి కలకలు మొదలైన సమస్యలు. మీరు ఆరోగ్యం పట్ల చూపే శ్రద్ధ వల్ల నెగిటివ్ ఆలోచనలు లేకుండా చూసుకోవచ్చు. మీరు ఈ రోజు ఎటువంటి సాహసోపేతమైన పని చేసినా దానికి విజయం తప్పక వరిస్తుంది.

ఈరోజు మీకు ఆర్థికపరంగా గొప్పగా ఉంటుంది. మీ కుటుంబంలో ఆప్యాయత, సంతోషం ఉంటుంది. స్నేహితులు, సన్నిహితులతో సంతోషకరమైన క్షణాలు గడుపుతారు. ఒక ఆహ్లాదకరమైన విహారయాత్ర లేదా ఒక సరదా పర్యటనకు అవకాశం లేకపోలేదు. ప్రార్థన, ధ్యానం ద్వారా ప్రతికూలతలను తొలగించడానికి ప్రయత్నించండి.

ఈ రోజు మీరు మీ దృష్టినీ, ఏకాగ్రతనీ ఎక్కడో మరిచిపోయారని అనిపిస్తుంది. నిరాశ, అనాసక్తి మిమ్మల్ని కిందకు లాగుతాయి. మతపరమైన విషయాలలో గడుపుతారని సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో కొంత వివాదం వస్తుంది. కొద్దికాలం వారికి దూరంగా ఉంటారు. పెట్టుబడులు ఆలోచించి పెట్టండి. కొంచెంగా లాభాలు వస్తాయి. కానీ ఎక్కువ నష్టాలు ఉంటాయి. కోర్టు వ్యవహారాలు జాగ్రత్తగా డీల్ చెయ్యండి. మీరు రోజు ప్రార్థన, ధ్యానాది కార్యక్రమాలు చేయడం చాలా అవసరం.

ABOUT THE AUTHOR

...view details