తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Horoscope Today: ఈరోజు మీ రాశి ఫలం ఎలా ఉందో తెలుసా?

Horoscope Today: ఈ రోజు(ఫిబ్రవరి 14) రాశి ఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?..

Etv Bharat
Etv Bharat

By

Published : Feb 14, 2023, 6:16 AM IST

Horoscope Today: ఈ రోజు(ఫిబ్రవరి 14) రాశి ఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?..

ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. కొన్ని సమయాల్లో అస్థిరబుద్ధితో వ్యవహరిస్తారు. చంచలత్వాన్ని రానీయకండి. అష్టమ చంద్రసంచారం అనుకూలంగా లేదు. దుర్గాస్తుతి చదవడం వల్ల మనోబలం పెరగడంతో పాటు బాగుంటుంది.

మంచికాలం. తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైన పనులను పూర్తిచేయగలుగుతారు. విద్యావినోదసుఖం ఉంది. ఆంజనేయ స్తోత్రం పారాయణ చేయాలి.

కుటుంబ సౌఖ్యం కలదు. మీదైన రంగాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు.ఆర్థికాభివృద్ధి ఉంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. శివనామస్మరణ ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.

కొన్ని కీలకమైన ప్రణాళికలు వేసి, వాటిని ప్రారంభిస్తారు. పనులకు ఆటంకం కలుగకుండా ముందుచూపుతో ఆలోచించాలి. మనోధైర్యంతో అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తారు. శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించడం మంచిది.

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో మిశ్రమ వాతావరణం కలదు. పనులకు ఆటంకం కలుగకుండా చూసుకోవాలి. గతంలో నిర్లక్ష్యం చేసిన కొన్ని అంశాలు ఇబ్బంది పెడతాయి. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. గోసేవ చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.

ప్రారంభించిన పనులను అనుకున్నట్టు చేయగలుగుతారు. కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. ఇష్టమైన వారితో కాలం గడుపుతారు. ఒక సంఘటన ఆత్మశక్తిని పెంచుతుంది. దుర్గాధ్యానం శుభప్రదం.

శ్రమ పెరుగుతుంది. ఉత్సాహం తగ్గకుండా చూసుకోవాలి. కొత్త వస్తువులు కొంటారు. ఆంజనేయుడిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.

నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. బంధు, మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. కనకధారాస్తోత్రం చదవడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.

ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. సొంతింటి వ్యవహారంలో ముందడుగు పడుతుంది. బంధు,మిత్రులను కలుస్తారు. అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదవడం మంచిది.

మీ శ్రమకు గుర్తింపు లభిస్తుంది. అధికారులు మీకు అనుకూలమైన ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు. కొన్ని కీలక పనులను పూర్తిచేయగలుగుతారు. కీలక నిర్ణయాలు ఫలిస్తాయి. శివస్తోత్రం చదివితే మంచిది.

కొన్ని కీలక నిర్ణయాలు మీకు అనుకూలంగా వెలువడతాయి. నూతన వస్తువులను కొంటారు. బుద్ధిబలం బాగుంటుంది. కీలక సమయాలలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. శ్రీఆంజనేయ ఆరాధన మంచిది.

మిశ్రమ కాలం. ఉద్యోగంలో శ్రద్ధగా పనిచేయాలి. ఆరోగ్య నియమాలను పాటించాలి. కలహాలకు దూరంగా ఉండాలి. శ్రీవేంకటేశ్వరస్వామి ఆరాధన శుభకరం.

ABOUT THE AUTHOR

...view details