Horoscope Today: ఈ రోజు మీ రాశి ఫలం ఎలా ఉందంటే? - ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే న్యూస్
Horoscope Today: ఈ రోజు(ఫిబ్రవరి 1) రాశి ఫలాల గురించి శంకరమంచి డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?..
ఈ రోజు రాశి ఫలాలు
By
Published : Feb 1, 2023, 6:39 AM IST
Horoscope Today: ఈ రోజు(ఫిబ్రవరి 1) రాశి ఫలాల గురించి శంకరమంచి డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?..
మిశ్రమ వాతావరణం ఉంటుంది.కొన్ని పరిస్థితులు ఇబ్బంది పెడతాయి.చంచలబుద్ధితో వ్యవహరించి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. గోసేవ చేయడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి.
కీలకమైన పనులను ప్రారంభిస్తారు. మీ ధర్మం మిమ్మల్ని ఉన్నతుల్ని చేస్తుంది. మొహమాటం వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఆహార నియమాలను పాటించాలి. శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనం శుభప్రదం.
మీ మీ రంగాల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు.బంధుప్రీతి ఉంది. ఒక ముఖ్యమైన పనిలో కదలిక వస్తుంది. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది.గోసేవ చేయాలి.
ఉత్సాహభరితమైన వాతావరణం ఉంటుంది. పెద్దలు మీకు కొత్త బాధ్యతలను అప్పగిస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. బంధువుల గృహాలలో భోజనం చేస్తారు. కీలక విషయాల్లో శుభపరిణామాలు చోటుచేసుకుంటాయి. ఇష్టదైవ నామస్మరణ శ్రేయోదాయకం.
ఏ పనిని ప్రారంభించినా నిర్విఘ్నంగా పూర్తవుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మేలైన ఫలితాలు ఉంటాయి. ఆర్థికపరమైన విషయాలలో మీరు ఆశించిన ఫలితాలు వస్తాయి. ఇష్టదైవారాధన శుభప్రదం.
ముఖ్య విషయాల్లో పెద్దల ఆశీర్వచనాలు అందుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అనవసర ధనవ్యయం సూచితం.అనారోగ్య సమస్యలు కాస్త ఇబ్బంది పెడతాయి. నవగ్రహ స్తోత్రం పారాయణ చేస్తే మంచిది.
శారీరక శ్రమ పెరుగుతుంది. బంధువులతో వాదులాటకు దిగకపోవడమే మంచిది. అనవసర ధనవ్యయం జరిగే సూచనలు ఉన్నాయి. అధికారులను మెప్పించడానికి కాస్త కష్టపడాల్సి వస్తుంది. దైవారాధన మానవద్దు.
శుభకాలం. మనోధైర్యంతో అనుకున్నది సాధిస్తారు. ఒక పనిలో మీకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. అర్ధ ,వస్త్ర లాభాలు ఉన్నాయి. ఇష్టదేవతా శ్లోకాలు చదివితే బాగుంటుంది.
మంచి ఫలితాలు ఉన్నాయి. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది.బంధు,మిత్రులతో కలిసి చేసే పనులు సత్ఫలితాన్ని ఇస్తాయి. ఒక ముఖ్య వ్యవహారంలో మీరు ఆశించిన పురోగతి ఉంటుంది.ఆదిత్య హృదయం చదవాలి.
దూరదృష్టితో ఆలోచించి ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటారు. కీలక అంశాల్లో పెద్దలను సంప్రదించడం ఉత్తమం. రుణ సమస్యలు తగ్గుతాయి. ఇష్టదేవతా ఆరాధన శుభప్రదం.
శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ఒక వ్యవహారంలో తోటివారి సాయం అందుతుంది.శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. అవసరానికి డబ్బు అందుతుంది. ఆదిత్య హృదయం చదవాలి.
ప్రారంభించిన పనులు సునాయాసంగా పూర్తవుతాయి. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీ ప్రతిభను పెద్దలు మెచ్చుకుంటారు. అవసరాలకు ధనం చేకూరుతుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆదిత్య హృదయ పారాయణ మంచిది.