తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆ రాశి వారు ఈరోజు పార్టీ చేస్కోవడం పక్కా! వారికి మాత్రం ఇబ్బందులే! - తెలుగు రాశి ఫలాలు కుంభం రాశి

Horoscope Today December 31th 2023 : డిసెంబర్​ 31న (ఆదివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Horoscope Today December 31th 2023
Horoscope Today December 31th 2023

By ETV Bharat Telugu Team

Published : Dec 31, 2023, 4:45 AM IST

Horoscope Today December 31th 2023 : డిసెంబర్​ 31న (ఆదివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

మేషం (Aries) :
ఈరోజు మీకు సాధారణంగా ఉంటుంది. అనారోగ్యం మీకు ఇబ్బంది కలిగిస్తుంది. మీరు నీరసంగా, అలసటతో ఉంటారు. మీరు ఈరోజు వ్యాయామాన్ని వాయిదా వేయండి. విశ్రాంతి తీసుకోండి. ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది. తొందరపడి పనులు చేయకుండా ప్రశాంతంగా ఉండేలా చూసుకోండి.

వృషభం (Taurus) :
ఈ రోజు వృషభ రాశి వారికి అనుకూలిస్తుంది. మీ తోటి ఉద్యోగులతో సఖ్యత నెలకొంటుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా వారి మీకు సాయపడతారు. మీరు చేపట్టిన పనుల్లో పురోగతి చూస్తారు.

మిథునం (Gemini) :
మిథున రాశి వారికి ఈరోజు మీకు గొప్పగా ఉంటుంది. తెలివిగా, జాగ్రత్తగా పెట్టుబడి పెట్టండి. రిస్క్ చేయకుండా ఉంటే మంచిది. ఈ రోజు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం వాయిదా వేయండి. ఈ రోజు మీరు మీ కుటుంబం, స్నేహితులు లేదా ప్రియమైన వారితో సరదాగా గడుపుతారు.

కర్కాటకం (Cancer) :
కర్కాటక రాశి వారు ఈ రోజు ప్రతికూల ఆలోచనలు మదిలోకి రానీయకండి. లేదంటే శారీరకంగా, మానసికంగా ఇబ్బంది పడతారు. మీ ప్రియమైన వారితో మాట్లాడి సమస్యను పరిష్కరించుకోండి. కుటుంబ సభ్యులతో గొడవలు వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులకు, ఫలితాల కోసం వేచిచూస్తున్నవారికి మంచి సమయం గోచరిస్తోంది.

సింహం (Leo) :
సింహ రాశి వారు ఈరోజు కొత్త బాధ్యతలు చేపట్టాల్సి వస్తుంది. మీరు చేపట్టే ప్రతి పని సమర్థవంతంగా పూర్తి చేస్తారు. సంబంధాల విషయంలో మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా అవి సులభంగానే పరిష్కారమవుతాయి.

కన్య (Virgo) :
ఈ రోజు కన్య రాశి వారు దూకుడు తగ్గించడం మంచిది. లేదంటే సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆత్మవిశ్వాసంతో ఉండటం మంచిది. గర్వం తలకెక్కితే సమస్యలు తీవ్రరూపం దాల్చవచ్చు. అవి మీ ప్రియమైన మిత్రులను మీకు దూరం చేస్తాయి..

తుల (Libra) :
ఈ రోజు తుల రాశి వారు కుటుంబంతో సరదాగా గడుపుతారు. మీ కుటుంబాన్ని పిక్నిక్​కు తీసుకెళ్లడమో లేదా ఏదైనా పార్టీ లేదా గెట్ టూ గెదర్ ఏర్పాటు చేయడమో చేస్తారు. ఆధ్యాత్మిక పర్యటన చేపట్టి ఆ దేవుడి ఆశిస్సులు అందుకుంటారు.

వృశ్చికం (Scorpio) :
మీలో తుంటరితనం ఈ రోజు చాలా ఎక్కువగా ఉంటుంది. వదంతులను దూరం పెట్టడం ఉత్తమం. ఈ రోజు మీరు చాలా మందిని ఆకట్టుకుంటారు. మిమ్మల్ని వారు అనుకరించే ప్రయత్నం చేస్తారు. సంతోషాన్ని పంచండి, మీకు పదిరెట్లు ఎక్కువ అందుతుంది.

ధనుస్సు (Sagittarius) :
ధనుస్సు రాశి వారు ఈరోజు ఆందోళనగా ఉంటారు. ఆనారోగ్య సమస్యలు వేధించవచ్చు. ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకండి. శారీరకంగా, మానసికంగా వీలైనంత విశ్రాంతి ఉండేలా చూసుకోండి. ఎక్కువ పనులు చేయవద్దు. విహారయాత్రలు వేసుకుంటే మంచిది. ఎవరితో వాదించొద్దు. తినే ఆహారం మీద దృష్టి పెట్టండి.

మకరం (Capricorn) :
మకర రాశి వారు ఈరోజు కోపాన్ని అదుపులో పెట్టుకుంటే మంచిది. తీసుకునే ఆహారం పట్ల శ్రద్ధ వహించండి. వ్యాపారంలో లాభాలు చూస్తారు. మీ భాగస్వామిని నొప్పించేలా మాట్లాడకూడదు. మీకు ఉన్న అనుభవంతో అన్ని కార్యక్రమాలను చక్కగా నిర్వహిస్తాయి.

కుంభం (Aquarius) :
కుంభ రాశి వారికి ఈరోజు అంతా ఆనందంగా ఉంటారు. పట్టుదల, ఆత్మవిశ్వాసంతో అద్భుతాలు సృష్టిస్తాయి. మీరు మొదలు పెట్టిన పనులను సకాలంలో విజయవంతంగా పూర్తి చేస్తారు. కొత్త వాహనం కొనుగోలు చేయడానికి ఇదే ఉత్తమ సమయం.

మీనం (Pisces) :
మీన రాశి వారికి ఈరోజు ఆరోగ్యపరంగా అనుకూలిస్తుంది. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం మిమ్మల్ని సంతోషంగా, సంతృప్తికరంగా ఉంచుతుంది. తీయగా మాట్లాడితే పనులు సాఫీగా పూర్తవుతాయి. అలాంటి చోట్ల దూకుడుగా వ్యవహరించడం మంచిది కాదు.

ABOUT THE AUTHOR

...view details