Horoscope Today December 28th 2023 : డిసెంబర్ 28న (గురువారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?
మేషం (Aries) :ఈ రోజు మేష రాశివారికి సాధారణంగా గడుస్తుంది. కొత్త పనులు ప్రారంభించవచ్చు. కానీ త్వరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు. మీదైన శైలిలో పనిచేసి కార్యక్రమాలను విజయవంతం చేసుకోవాలి. మాటలను అదుపులో ఉంచుకోవాలి. ప్రయాణాలు చేయాల్సి రావచ్చు.
వృషభం (Taurus) : ఈ రోజు వృషభ రాశివారి తారాబలం అంత బాగాలేదు. సరైన నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది పడతారు. ఇవాళ ఎలాంటి పొరపాట్లు చేయకూడదు. కొత్త వ్యవహారాలు ఏమీ మొదలుపెట్టకూడదు. చదవకుండా కీలకమైన పత్రాలపై సంతకాలు చేయకూడదు. ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవాలి.
మిథునం (Gemini) :ఈ రోజు మిథున రాశివారికి అద్భుతంగా ఉంటుంది. కొత్త దుస్తులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. డబ్బులు బాగా ఖర్చు చేస్తారు. కుటుంబ సభ్యులతో, స్నేహితులతో సంతోషంగా గడుపుతారు. అలాగే కృషితో మంచి ఘనకార్యాలు నెరవేర్చుతారు.
కర్కాటకం (Cancer) :ఈ రోజు కర్కాటక రాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి. కీలమైన నిర్ణయాలు ఇవాళ తీసుకోకపోవడమే మంచిది. కుటుంబ సభ్యుల మధ్య వాగ్వాదాలు చెలరేగవచ్చు. ఇవి మిమ్మల్ని తీవ్రమైన నిరాశకు గురిచేస్తాయి. ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి. ఆర్థిక, ఆరోగ్య విషయాల్లో చాలా అప్రమత్తంగా ఉండాలి.
సింహం (Leo) : ఈ రోజు సింహ రాశివారికి కలిసి వస్తుంది. స్నేహితులు మీకు తోడుగా నిలుస్తారు. ప్రేమించిన వ్యక్తితో సంతోషంగా గడుపుతారు. ఆర్థిక ప్రయోజనాలు పొందడానికి ఇది మంచి అవకాశం. కనుక విలువైన సమయాన్ని, అవకాశాలను జారవిడుచుకోకూడదు.
కన్య (Virgo) :ఈ రోజు కన్య రాశివారికి చాలా బాగుంటుంది. ఉద్యోగం, వ్యాపారం ఇలా అన్నింటా విజయం సాధిస్తారు. కొత్త పనులు, ప్రాజెక్టు లాభాలను కురిపిస్తాయి. పదోన్నతలు లభించవచ్చు. ఆదాయం పెరుగుతుంది. ఇంట్లో శాంతియుత వాతావరణం ఉంటుంది.
తుల (Libra) :ఈ రోజు తుల రాశివారికి శుభ ఫలితాలు కలుగుతాయి. వ్యాపారాల్లో మంచి లాభాలు వస్తాయి. కానీ సహోద్యోగుల సహకారం మీకు లభించదు. ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం విషయంలో మాత్రం జాగ్రత్త వహించాలి. విదేశాల నుంచి ఓ శుభవార్త వింటారు.
వృశ్చికం (Scorpio) :ఈ రోజు వృశ్చిక రాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొత్త ప్రణాళికలు వాయిదా వేయాలి. ఇవాళ మీ తారాబలం అంత బాగాలేదు. ఖర్చులు పెరగవచ్చు. కానీ భౌతిక సుఖాలు ఇవాళ లభించే అవకాశం ఉంది. ప్రభుత్వ పనులు కూడా త్వరగా నెరవేరుతాయి.
ధనుస్సు (Sagittarius) : ఈ రోజు ధనుస్సు రాశివారికి అదృష్టం కలిసి వస్తుంది. సహోద్యోగుల నుంచి మీకు పూర్తి సహకారం లభిస్తుంది. మీలోని సృజనాత్మకతను ప్రపంచానికి వెల్లడిస్తారు. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. ఇవాళ మీరు సంతోషంగా గడుపుతారు.
మకరం (Capricorn) : ఈ రోజు మకర రాశివారికి చాలా బాగుంటుంది. వ్యాపారులు, వృత్తి నిపుణులు, గృహిణులు, విద్యార్థులు అందరికీ మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు లాభాలను చేకూరుస్తాయి. కుటుంబమంతా ఆనందంగా ఉంటుంది. ప్రభుత్వ వ్యవహారాలు చక్కబడతాయి. ఆరోగ్యం బాగుంటుంది.
కుంభం (Aquarius) :ఈ రోజు కుంభ రాశివారికి మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. ఓ కీలమైన విషయంలో ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఒంటరిగా ప్రయాణం చేయడమే మంచిది. మీ బలహీనతలను బలంగా మార్చుకునే ప్రయత్నం చేయాలి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త!
మీనం (Pisces) : ఈ రోజు మీన రాశివారికి సాధారణంగా గడుస్తుంది. కానీ కొత్త ప్రాజెక్టులు, పనులు ప్రారంభించవచ్చు. వృత్తి, వ్యాపారాల్లో గట్టి పోటీ ఎదురవుతుంది. మాటలను అదుపులో ఉంచుకోవాలి. ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త వహించాలి.