తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆ రాశివారికి ఇవాళ గోల్డెన్ ఛాన్స్- జీవితంలో కీలక మలుపు పక్కా! - తెలుగు రాశి ఫలాలు మీన రాశి

Horoscope Today December 26th 2023 : డిసెంబర్​ 26న (మంగళవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Horoscope Today 26 December 2023
Horoscope Today December 26th 2023

By ETV Bharat Telugu Team

Published : Dec 26, 2023, 4:45 AM IST

Horoscope Today December 26th 2023 : డిసెంబర్​ 26న (మంగళవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

మేషం (Aries) :ఈ రోజు మేష రాశివారికి ఒక సువర్ణావకాశం తలుపు తడుతుంది. ఇది మీ జీవితాన్ని మార్చివేస్తుంది. వ్యాపారంలో మంచి లాభాలు సంపాదిస్తారు. మీరు చేసే ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. భవిష్యత్ కోసం పొదుపు చేస్తారు. ఆరోగ్యం బాగుంటుంది.

వృషభం (Taurus) : ఈ రోజు వృషభ రాశివారికి శుభ ఫలితాలు కలుగుతాయి. పనులన్నీ విజయవంతంగా పూర్తి చేస్తారు. భవిష్యత్ కోసం కచ్చితమైన నిర్ణయాలు తీసుకుంటారు. మీ మనస్సులోని చేదు జ్ఞాపకాలను వదిలించుకునే ప్రయత్నం చేస్తారు. ఆత్మబలంతో మీ సమస్యలను పరిష్కరించుకుంటారు.

మిథునం (Gemini) :ఈ రోజు మిథున రాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మిత్రుల కోసం భారీగా ఖర్చులు పెడతారు. అయితే ఇతరులు మీపై దురభిప్రాయాన్ని పెంచుకునే పరిస్థితులు ఏర్పడతాయి. కానీ మీ వ్యక్తిత్వం నిలుపుకునే ప్రయత్నం చేయాలి. ఆరోగ్యం జాగ్రత్త!

కర్కాటకం (Cancer) :ఈ రోజు కర్కాటక రాశివారికి మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. రోజులో మొదటి అర్థ భాగంలో అనేక ఇబ్బందులు ఏర్పడతాయి. కానీ కష్టపడి పనిచేస్తే, కచ్చితంగా మంచి ఫలితాలు కలుగుతాయి. విద్యార్థులు చదువుల్లో రాణిస్తారు. కానీ ఆరోగ్యం అంతగా సహకరించకపోవచ్చు.

సింహం (Leo) : ఈ రోజు సింహ రాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీపై ఒత్తిడిలు పెరిగే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో వాదనలు, ఘర్షణలు జరగవచ్చు. వీలైనంత వరకు మౌనంగా ఉండడం మంచిది. అనవసర చర్చలకు దూరంగా ఉండాలి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి.

కన్య (Virgo) :ఈ రోజు కన్య రాశివారి తారాబలం చాలా బాగుంది. స్నేహితులు, బంధువులతో సంతోషంగా గడుపుతారు. వ్యాపార, వ్యవహారాల్లో మంచి లాభాలు వస్తాయి. అయితే మధ్యాహ్నం తరువాత కొన్ని అనుకోని ఇబ్బందులు తలెత్తవచ్చు. జాగ్రత్తగా ఉండాలి.

తుల (Libra) :ఈ రోజు తుల రాశివారి అదృష్టం బాగుంటుంది. కోర్టు వ్యవహారాల్లో మీకు అనుకూలమైన ఫలితాలు లభించవచ్చు. ఇతరుల చెప్పుడు మాటలను పరిగణనలోకి తీసుకోకూడదు. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకునే ముందు కాస్త జాగ్రత్త వహించడం మంచిది.

వృశ్చికం (Scorpio) :ఈ రోజు వృశ్చిక రాశివారు మంచి దూకుడుగా ఉంటారు. వ్యాపారంలో మంచి లాభాలు సంపాదిస్తారు. ఎప్పటి నుంచో పూర్తి కాని పనులను చక్కబెడతారు. మీ కష్టానికి తగిన ఫలితాన్ని పొందుతారు. ఉద్యోగులకు పదోన్నతి లభించవచ్చు. ఆరోగ్యం బాగుంటుంది.

ధనుస్సు (Sagittarius) : ఈ రోజు ధనుస్సు రాశివారి రహస్యాలు బయటపడే అవకాశం ఉంది. మీరు ప్రేమించిన వ్యక్తుల పట్ల కృతజ్ఞతా భావంతో ఉండాలి. ఇవాళ మీరు ఏర్పరుచుకునే బంధాలు జీవితాంతం ఉంటాయి. వ్యాపార, వ్యవహారాల్లో శ్రద్ధ చూపించాల్సి ఉంటుంది.

మకరం (Capricorn) : ఈ రోజు మకర రాశివారికి మిశ్రమ ఫలితాలు లభిస్తాయి. సరైన ప్రణాళికతో ముందడు వేయాలి. డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. లేదంటే ఇబ్బంది పడతారు. మీ గౌరవానికి భంగం కలిగే అవకాశం ఉంది.

కుంభం (Aquarius) :ఈ రోజు కుంభ రాశివారికి మంచి ప్రయోజనాలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో భారీ లాభాలు వస్తాయి. ఉద్యోగులకు, రాజకీయ నాయకులకు పదోన్నతులు లభించే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగుంటుంది. అనుకున్న పనులు అన్నీ నెరవేరుతాయి.

మీనం (Pisces) : ఈ రోజు మీన రాశివారు సాహిత్య రచనల పట్ల అభిరుచి పెంచుకునే అవకాశం ఉంది. ఇది మీకు నూతన ఉత్సాహాన్ని ఇస్తుంది. దూరపు బంధువులను కలుసుకుంటారు. వారితో సంతోషంగా గడుపుతారు. కానీ ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండడం మంచిది.

ABOUT THE AUTHOR

...view details