తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆ రాశివారికి వ్యాపారంలో లాభాలే లాభాలు- ఈరోజు పట్టిందల్లా బంగారమే! - తెలుగు రాశి ఫలాలు మీన రాశి

Horoscope Today December 23rd 2023 : డిసెంబర్​ 23న (శనివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Horoscope Today 23 December 2023
Horoscope Today December 23rd 2023

By ETV Bharat Telugu Team

Published : Dec 23, 2023, 4:51 AM IST

Horoscope Today December 23rd 2023 : డిసెంబర్​ 23న (శనివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

మేషం (Aries) :ఈ రోజు మేష రాశివారికి చాలా బాగుంటుంది. రోజంతా సుఖంగా, శాంతియుతంగా గడుపుతారు. మానసిక, శారీరక ఆరోగ్యాలు బాగుంటాయి. పనులన్నీ చక్కగా పూర్తి చేస్తారు. మాతృ సంబంధమైన లబ్ధి చేకూరుతుంది. స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా కాలం గడుపుతారు.

వృషభం (Taurus) :ఈ రోజు వృషభ రాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి. సమస్యలను ఒక ప్రణాళిక ప్రకారం ఎదుర్కోవాలి. వీలైనంత వరకు నిగ్రహం పాటించాలి. అప్పుడే మీకు సత్ఫలితాలు వస్తాయి. మీ ప్లాన్స్​ అన్నీ ఆచరణాత్మకంగా ఉండేలా చూసుకోవాలి.

మిథునం (Gemini) :ఈ రోజు మిథున రాశివారికి వృత్తి, వ్యాపారాల్లో మంచి లాభాలు వస్తాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. మీరు పెట్టిన పెట్టుబడులు రెట్టింపు అవుతాయి. స్నేహితుల నుంచి కూడా మీరు ప్రయోజనం పొందుతారు. మీరు కోరుకున్నవారితో సంబంధ, బాంధవ్యాలను పెంచుకుంటారు.

కర్కాటకం (Cancer) :ఈ రోజు కర్కాటక రాశివారి తారాబలం చాలా బాగుంటుంది. అరుదైన కానుకలు అందుకుంటారు. ఇంటి వద్ద, కార్యాలయంలోనూ మీకు అంతా అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఆరోగ్యం బాగుంటుంది.

సింహం (Leo) : ఈ రోజు సింహ రాశివారికి సాధారణంగా గడుస్తుంది. మీరు అనుకున్న పనులు అన్నీ పూర్తి చేస్తారు. మీ లక్ష్యం దిశగా అడుగులు వేస్తారు. అయితే కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. మానసిక శాంతి కొరవడే అవకాశం ఉంది. వ్యాపార, వ్యవహారాల్లో జాగ్రత్త వహించాలి.

కన్య (Virgo) :ఈ రోజు కన్య రాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి. అత్యుత్సాహం పనికి రాదు. భవిష్యత్ ప్రణాళికల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అసంబద్ధమైన పనులు చేయకూడదు. లేదంటే ఇబ్బంది పడక తప్పదు. ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

తుల (Libra) :ఈ రోజు తుల రాశివారికి బాగుంటుంది. నచ్చిన ఆహారం, విహారం లభిస్తాయి. పాత స్నేహితులను కలుసుకుంటారు. రోజంతా ఆనందంగా గడుపుతారు. వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఆధ్యాత్మిక చింతన చేస్తారు.

వృశ్చికం (Scorpio) :ఈ రోజు వృశ్చిక రాశివారి తారాబలం చాలా అద్భుతంగా ఉంది. ఇప్పటి వరకు మీ మీద ఉన్న చెడు ప్రభావం పూర్తిగా తొలగిపోతుంది. ఇంట్లోనూ, కార్యాలయంలోనూ అన్నీ అనుకూలంగా ఉంటాయి. శారీరక, మానసిక ఆరోగ్యం బాగుంటుంది. కానీ స్త్రీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

ధనుస్సు (Sagittarius) : ఈ రోజు ధనుస్సు రాశివారికి మిశ్రమ ఫలితాలు లభిస్తాయి. చిన్న చిన్న సమస్యలు ఎదురవుతాయి. కానీ మనోధైర్యంతో వాటిని ఎదుర్కొంటారు. ఇవాళ ప్రయాణాలు మానుకోవడం శ్రేయస్కరం. పిల్లల అనారోగ్యం మిమ్మల్ని ఆందోళనకు గురిచేస్తుంది.

మకరం (Capricorn) : ఈ రోజు మకర రాశివారికి అంత అనుకూలంగా ఉండదు. ఆరోగ్యం దెబ్బతినే సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులతో, మీ ప్రియమైన వారితో గొడవలు జరిగే అవకాశం ఉంది. కొన్ని అవమానాలు ఎదురుకావచ్చు. సహోద్యోగులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. జలాలకు దూరంగా ఉండాలి. మొండి వైఖరి, నిర్లక్ష్య వైఖరిని విడనాడాలి.

కుంభం (Aquarius) :ఈ రోజు కుంభ రాశివారు ప్రతికూల ఆలోచనలను పూర్తిగా విడిచిపెట్టాలి. కుటుంబ సభ్యులతో, స్నేహితులతో కలిసి ఉండాలి. వీలైనంత వరకు ఆధ్యాత్మిక చింతనతో గడపడం మంచిది. సానుకూల వైఖరితో సమస్యలను ఎదుర్కోవాలి. అప్పుడే సత్ఫలితాలు లభిస్తాయి.

మీనం (Pisces) : ఈ రోజు మీన రాశివారు కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. లేకుండా చుట్టపక్కల వారితో విరోధం ఏర్పడే అవకాశం ఉంది. ఖర్చులు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. కనుక ఆర్థిక విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అవాంఛనీయ సంఘటనలు, గొడవలు జరిగే అవకాశం ఉంది. జాగ్రత్త వహించాలి.

ABOUT THE AUTHOR

...view details