Horoscope Today December 22th 2023 : డిసెంబర్ 22న (శుక్రవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?
మేషం (Aries) :ఈ రోజు మీరు అతి దూకుడు, ఆధిపత్య ధోరణితో ఉంటారు. అయితే, మీ దూకుడును కాస్త నియంత్రణలో పెట్టుకోవాలని సూచిస్తున్నాం. కొత్త ప్రయత్నాలు, పనులకు ఈ రోజు అంత అనుకూలంగా లేదు. కాబట్టి కొత్తవి ప్రయత్నించకండి.
వృషభం (Taurus) :ఈరోజు వృషభ రాశివారు జాగ్రత్తగా ఉండాలి. పరిష్కరించగలిగే సమస్యలు చుట్టుముడుతాయి. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించడం మీ పైనే ఆధారపడి ఉంది. వాటి నుంచి తప్పించుకోవడానికి అప్రమత్తంగా ఉండండి.
మిథునం (Gemini) :ఈరోజు వ్యాపారాలకు గొప్పగా ఉంటుంది. మీరు పట్టింది బంగారం అవుతుంది. ఆదాయం బాగా పెరుగుతుంది. పెట్టుబడులు మంచి లాభాలనిస్తాయి. స్నేహితులు కూడా సహాయపడతారు.
కర్కాటకం (Cancer) :ఈ రోజు మీ కుటుంబంలోని చిన్నపిల్లలపై అధిక శ్రద్ధ పెడతారు. పిల్లలకు వారి రోజువారీ పనులు మెరుగుపరుచుకునే విషయంలో తగిన సూచనలిస్తారు. వేడుకలకు ఇది తగిన సమయం. పోటీలు లేదా ఏదైనా కార్యక్రమంలో పాల్గొనాలనే కోరిక కలుగుతుంది.
సింహం (Leo) : సింహ రాశి వారికి ఈ రోజు సాధారణంగా గడుస్తుంది. అనుకున్న పనిని పూర్తి చేస్తారు. లక్ష్యం దిశగా మీ నడక ఉంటుంది. ధార్మిక కార్యక్రమాలు మిమ్మల్ని తీరిక లేకుండా చేయవచ్చు. మీరు ఒక తీర్థయాత్రకి ప్రణాళిక వేసే అవకాశం ఉంది. విదేశాల్లో నివసించే బంధువుల నుంచి వచ్చిన వార్తలతో మీకు మానసిక శాంతి కొరవడుతుంది. పిల్లలకు సంబంధించిన విషయంలో మనస్థాపం తలెత్తుతుంది. వ్యాపారస్థులకు ఈ రోజు కొంత నిరాశగానే ఉండవచ్చు.
కన్య (Virgo) :కన్య రాశి వారికి ఈరోజు కొంత ఇబ్బందులు ఎదురవుతాయి. మీ స్నేహితులు తమ భవిష్యత్తు ప్రణాళికల గురించి మీ వద్ద ప్రస్తావిస్తారు. అవి మీ ఊహకు ఉత్సుకత కలిగించే అవకాశం ఉంది. మీరు కూడా వాటిని చేయాలని భావిస్తే తీవ్ర పర్యావసనాలు ఎదురవుతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి.
తుల (Libra) :తుల రాశివారి ప్రేమ జీవితం అద్భుతంగా ఉంటుంది. వివాహితులు తమ భాగస్వాములకు తమ ప్రేమను చూపించే పనిలో ఉంటారు. అంతేగాక ప్రియమైన వారితో ప్రయాణం ఆనందకరంగా ఉంటుంది.
వృశ్చికం (Scorpio) :ఈ రోజు మీ కుటుంబ వాతావరణం సానుకూలంగా ఉంటుంది. మీరు శారీరకంగా, మానసికంగా శక్తిమంతంగా ఉండాలని భావిస్తారు. మీ విరోధులు ఈరోజు ఓటమిని అంగీకరిస్తారు. మీ సహోద్యోగుల నుంచి సహాయం లభిస్తుంది. ఆర్ధిక లాభాలు పొందడానికి అవకాశం ఉంది. అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తిచేస్తారు. అనారోగ్యంగా ఉన్నవారికి కొంత ఉపశమనం కలుగుతుంది.
ధనుస్సు (Sagittarius) : మీరు నక్షత్రాలు, గ్రహ సమస్యల నుంచి కోలుకోనందున స్వల్ప అస్వస్థతతో ఉంటారు. గత రెండు రోజుల నుంచి పట్టుకున్న ఒత్తిడి కారణంగా భావించవచ్చు. జీర్ణసంబంధ రోగాలకు తీసుకునే మందులపై జాగ్రత్త వహించండి.
మకరం (Capricorn) : మకర రాశివారికి ఈ రోజు అశుభమని ఫలితాలు చెప్తున్నాయి. శారీరకంగా, మానసికంగానూ మీరు ఇవాళ అత్యుత్సాహంతో ఉంటారు. కానీ అనుకోని సంఘటనలు మీ కుటుంబ సభ్యులని చుట్టుకుని బాధిస్తాయి. మీరు దానికి ఆందోళన చెందుతారు. నిద్రలేమితో బాధ పడతారు. నీరు పొదుపుగా వాడండి. ఆడవారి విషయంలో జాగ్రత్త వహించండి. మీరు ఆర్థికంగా నష్టపోవచ్చు. కొన్ని సంఘటనల కారణంగా మీ పరువు పోయే సందర్భాలు రావచ్చు.
కుంభం (Aquarius) :నిర్ణయాలు తీసుకునే మీ శక్తిపై ఆత్మవిశ్వాసం, గందరగోళం ప్రభావం చూపుతాయి. ఈ కారణంగా సులభమైన పరిష్కారాలు కనుగొనడంలోనూ ఇబ్బందిపడతారు. మీ రోజువారీ పనుల ప్రకారం వెళ్లండి, అనవసర ఆలోచనలకు, వివాదాలకు దూరంగా ఉండండి.
మీనం (Pisces) : ఈ రోజు మీరు ఒకరి హృదయాన్ని గాయపరిచే అవకాశాలు ఉన్నాయి. అదే సమయంలో స్థిరమైన సంబంధం నెలకొల్పుకోవాలనే కోరిక మీలో ఉంటుంది. వివాహితుల మధ్య సంబంధాలు బలంగా ఉంటాయి.