తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆ రాశుల వారు ఇవాళ కొత్త పనులు ప్రారంభిస్తే విజయం తథ్యం! - తెలుగు రాశి ఫలాలు మీన రాశి

Horoscope Today December 21st 2023 : డిసెంబర్​ 21న (గురువారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Horoscope Today 21 December 2023
Horoscope Today December 21st 2023

By ETV Bharat Telugu Team

Published : Dec 21, 2023, 5:00 AM IST

Horoscope Today December 21st 2023 :డిసెంబర్​ 21న (గురువారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

మేషం (Aries) :ఈ రోజు మేష రాశివారికి చాలా సవాళ్లు ఎదురవుతాయి. సరైన నిర్ణయాలు తీసుకోలేక ఇబ్బంది పడతారు. ఇతరులు తన అభిప్రాయాలను మీమీద రుద్దుతారు. అనిశ్చిత పరిస్థితులు మిమ్మల్ని మానసిక వేదనకు గురిచేస్తాయి. మనోబలంతో పరిస్థితులను ఎదుర్కోవాలి.

వృషభం (Taurus) :ఈ రోజు వృషభ రాశివారి తారాబలం బాగుంది. కుటుంబ సభ్యులతో, ప్రియమైన వారితో సంతోషంగా గడుపుతారు. వృత్తి, వ్యాపారాల్లో మంచి ప్రయోజనాలు పొందుతారు. ఆర్థికంగానూ లాభపడతారు. ఆరోగ్యం బాగుంటుంది.

మిథునం (Gemini) :ఈ రోజు మిథున రాశివారికి చాలా బాగుంటుంది. శారీరక, మానసిక ఆరోగ్యాలు బాగుంటాయి. పనులను సక్రమంగా పూర్తి చేస్తారు. మీ పనికి తగిన గుర్తింపు లభిస్తుంది. పదోన్నతి కూడా లభించే అవకాశం ఉంది. ఇంతకు మునుపు ప్రారంభించిన పనులు, ప్రాజెక్టులు విజయవంతం అవుతాయి. మంచి లాభాలు తెచ్చిపెడతాయి.

కర్కాటకం (Cancer) :ఈ రోజు కర్కాటక రాశివారికి అద్భుతంగా ఉంటుంది. మీరు చేపట్టిన అన్ని పనులు విజయవంతం అవుతాయి. పదోన్నతలకు ఆస్కారం ఉంది. కీలకమైన విషయాలను కుటుంబ సభ్యులతో చర్చిస్తారు. ఇంటి నిర్మాణ పనులు చేపడతారు.

సింహం (Leo) : ఈ రోజు సింహ రాశివారు ఆరోగ్యంపై చాలా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. వైద్య ఖర్చులు పెరగవచ్చు. ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండాలి. ధ్యానం చేయడం, ఆధ్యాత్మిక అంశాలపై దృష్టి కేంద్రీకరించడం మంచిది. అప్పుడే మానసిక ప్రశాంతత లభిస్తుంది.

కన్య (Virgo) :ఈ రోజు కన్య రాశివారికి శుభ ఫలితాలు లభిస్తాయి. అధికారం, సమాజంలో గౌరవం పెరుగుతాయి. కష్టపడి పనిచేసి, మంచి ప్రతిఫలాలు పొందుతారు. కొత్త వాహనం లేదా ఖరీదైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఈ రోజంతా సంతోషంగా గడుపుతారు.

తుల (Libra) :ఈ రోజు తుల రాశివారికి చాలా బాగుంటుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. వృత్తి, వ్యాపారాల్లో మంచి లాభాలు గడిస్తారు. సహచర ఉద్యోగులు, యజమానులు మీకు మంచి సహకారం, ప్రోత్సాహం అందిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది.

వృశ్చికం (Scorpio) :ఈ రోజు వృశ్చిక రాశివారికి మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. వ్యాపార సంబంధిత ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. విద్యార్థులు బాగా కష్టపడి చదవాల్సి ఉంటుంది. ఉపాధ్యాయులు, రచయితలు, శిక్షకులు మాత్రం మంచి ప్రయోజనాలు పొందుతారు.

ధనుస్సు (Sagittarius) : ఈ రోజు ధనుస్సు రాశివారిని జీర్ణ సంబంధమైన సమస్యలు వేధించవచ్చు. పిల్లల చదువులు, ఆరోగ్యం మిమ్మల్ని కలవర పెడతాయి. కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. అనవసర చర్చలకు దూరంగా ఉండాలి. కానీ కళలు, సాహిత్య రంగంలో ఉన్నవారికి ఇవాళ మంచి ఫలితాలు లభిస్తాయి.

మకరం (Capricorn) : ఈ రోజు మకర రాశివారి నక్షత్ర బలం చాలా బాగుంది. కనుక కొత్త పనులు ప్రారంభిస్తే అవి విజయవంతం అవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో మంచి లాభాలు సంపాదిస్తారు. మీలోని సృజనాత్మక ఆలోచనలను విజయవంతంగా కార్యరూపంలోకి తెస్తారు.

కుంభం (Aquarius) :ఈ రోజు కుంభ రాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీలో రగులుతున్న కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. మానసిక ప్రశాంతత కోసం ఆధ్యాత్మిక చింతనలో గడపాలి. లేదా దైవ ధ్యానం చేయాలి. ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.

మీనం (Pisces) : ఈ రోజు మీన రాశివారు మానసికంగా ప్రశాంతంగా ఉండాలి. శారీరక ఆరోగ్యం కూడా బాగుంటుంది. కొత్త పనులు ప్రారంభిస్తారు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం మీకు లభిస్తుంది. ఇవాళ మీరు మంచి లాభాలు సంపాదిస్తారు. ధర్మిక కార్యకలాపాల కోసం డబ్బులు ఖర్చులు చేస్తారు.

ABOUT THE AUTHOR

...view details