Horoscope Today December 19th 2023 :డిసెంబర్ 19న (మంగళవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?
మేషం (Aries) :ఈ రోజు మేష రాశివారికి చాలా బాగుంటుంది. వ్యాపారంలో రాణిస్తారు. ఆర్థికంగా లాభపడతారు. సమాజంలో మీ పేరు, ప్రతిష్టలు పెరుగుతాయి. జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది. పెళ్లికాని వారికి త్వరలోనే వివాహ యోగం ఉంది.
వృషభం (Taurus) :ఈ రోజు వృషభ రాశివారికి అద్భుతంగా ఉంటుంది. వ్యాపారంలో భారీగా లాభాలు సంపాదిస్తారు. మీరు చేసిన పనికి అందరి నుంచి ప్రశంసలు లభిస్తాయి. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. అన్ని విధాలుగా ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయి.
మిథునం (Gemini) :ఈ రోజు మిథున రాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉన్నతాధికారులతో, తోటి ఉద్యోగులతో సంబంధాలు చెడగొట్టుకోకండి. వీలైనంత వరకు రాజీ ధోరణి అవలంభించడం మంచిది. ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. జాగ్రత్తపడాలి.
కర్కాటకం (Cancer) :ఈ రోజు కర్కాటక రాశివారు చాలా అప్రమత్తంగా ఉండాలి. పనుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపించాలి. లేకుంటే ఇబ్బంది తప్పదు. మీకు, మీ కుటుంబానికి చెడ్డ పేరు తెచ్చే అక్రమ, అనైతిక కార్యక్రమాలకు దూరంగా ఉండాలి. పరుషంగా మాట్లాడకూడదు. వీలైనంత వరకు శాంతంగా ఉండాలి.
సింహం (Leo) : ఈ రోజు సింహ రాశివారు చాలా సంతోషంగా ఉంటారు. స్నేహితులు, బంధువులతో సరదాగా గడుపుతారు. వ్యాపారంలో కీలకమైన భాగస్వాములతో డీల్ కుదుర్చుకుంటారు. వృత్తిపనివారు కూడా ఆర్థికంగా లాభపడతారు. ఆరోగ్యం బాగుంటుంది.
కన్య (Virgo) :ఈ రోజు కన్య రాశివారికి అద్భుతంగా ఉంటుంది. వ్యాపార భాగస్వాముల నుంచి మంచి ప్రయోజనాలు పొందుతారు. పనులన్నీ విజయవంతంగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి సంతోషంగా కాలం గడుపుతారు.
తుల (Libra) :ఈ రోజు తుల రాశివారు అన్ని రంగాల్లో రాణిస్తారు. మీలోని సృజనాత్మకతను వెలికి తీస్తారు. కొత్త పనులు ప్రారంభిస్తారు. మీ శక్తి, సామర్థ్యాలను పనులన్నీ విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థికంగా బాగా లాభపడతారు. ఆరోగ్యం బాగుంటుంది.
వృశ్చికం (Scorpio) :ఈ రోజు వృశ్చిక రాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. మొండితనాన్ని విడనాడాలి. కొత్త పనులను, ప్రాజెక్టులను వీలైనంత వరకు ప్రారంభించకపోవడం మంచిది. ఆరోగ్యం మాత్రం బాగుంటుంది.
ధనుస్సు (Sagittarius) :ఈ రోజు ధనుస్సు రాశివారికి మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. ఉదయం అంతా బాగానే ఉంటుంది. కానీ సాయంత్రానికల్లా పరిస్థితులు దారుణంగా మారతాయి. మానసిక అశాంతికి గురవుతారు. మీపై మీరు నియంత్రణను కోల్పోతారు. అయితే కుటుంబ సభ్యులతో అండదండలతో, సమస్యలను అధిగమిస్తారు.
మకరం (Capricorn) : ఈ రోజు మకర రాశివారు వీలైనంత వరకు మౌనం వహించడం శ్రేయస్కరం. ఆధ్యాత్మిక కార్యక్రమాలు, దైవ దర్శనాలు మానసిక ప్రశాంతతను కలుగజేస్తాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి. వ్యాపార, వ్యవహారాల్లోనూ అప్రమత్తత అవసరం.
కుంభం (Aquarius) :ఈ రోజు కుంభ రాశివారికి కలిసి వస్తుంది. ఎప్పటి నుంచే చేయాలనుకున్న పనులు అన్నీ పూర్తి చేస్తారు. జీవిత లక్ష్యాలను చేరుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో మంచి లాభాలు సంపాదిస్తారు. సమాజంలో మీ గౌరవం, హోదా రెండూ పెరుగుతాయి.
మీనం (Pisces) : ఈ రోజు మీన రాశివారు తమ లక్ష్యాలను సాధించడానికి తీవ్రంగా కృషి చేయాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యులతో, ప్రియమైన వారితో వాగ్వాదం జరిగే అవకాశం ఉంది. శాంతం వహించాలి. మాటలను అదుపులో ఉంచుకోవాలి. దైవ ధ్యానం చేయడం మంచిది.