Horoscope Today December 18th 2023 :డిసెంబర్ 18న (సోమవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?
మేషం (Aries) :ఈ రోజు మేష రాశివారికి చాలా బాగుంటుంది. స్నేహితులతో, కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గడుపుతారు. విపరీతంగా ఖర్చు చేస్తారు. పెద్ద వాళ్లతో సాన్నిహిత్యం పెరుగుతుంది. ఆర్థిక లాభం కూడా ఉంటుంది. పిల్లలు చదువుల్లో రాణిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది.
వృషభం (Taurus) :ఈ రోజు వృషభ రాశివారికి మంగళకరంగా ఉంటుంది. కొత్తగా ప్రారంభించే వెంచర్స్ లాభాలను అందిస్తాయి. వృత్తి నిపుణులకు, వ్యాపారులకు మంచిగా లాభపడతారు. అధికారుల ఆదరణతో పదోన్నతి లభిస్తుంది. జీతం కూడా పెరుగుతుంది. ఇంట్లో శాంతి, సౌభాగ్యం వెల్లివిరుస్తాయి. సమాజంలోనూ గౌరవ, మర్యాదలు పెరుగుతాయి.
మిథునం (Gemini) :ఈ రోజు మిథున రాశివారు మానసిక ఆందోళనకు గురవుతారు. ఉదర సంబంధమైన వ్యాధులు రావచ్చు. అనవసర ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారంలోనూ నష్టం రావచ్చు. పిల్లలకు సంబంధించి అనేక చికాకులు ఏర్పడతాయి. పైగా మీ కష్టానికి తగిన ఫలితం రాదు. ఆఫీస్ వ్యవహారాల్లో అసంతృప్తితో ఉంటారు.
కర్కాటకం (Cancer) :ఈ రోజు కర్కాటక రాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులకు తీవ్రమైన పోటీ ఎదురవుతుంది. ఆర్థిక నష్టాలు ఏర్పడవచ్చు. స్పెక్యులేషన్ వ్యవహారాల్లోకి తలదూర్చకూడదు. ఇతరులతో వాదనలు చేయకూడదు. ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
సింహం (Leo) : ఈ రోజు సింహ రాశివారు ప్రశాంతంగా ఉంటారు. బంగారు భవిష్యత్ కోసం తగిన ప్రణాళికలు వేస్తారు. ఆర్థికంగా లాభపడతారు. ఆధ్యాత్మిక అంశాలపై దృష్టి కేంద్రీకరిస్తారు. ధ్యానం, యోగా లాంటి ఆచరించడం వల్ల మానసిక, శారీరక ఆరోగ్యం బాగుంటుంది.
కన్య (Virgo) :ఈ రోజు కన్య రాశివారు మంచి ఉత్సాహంగా ఉంటారు. మీలోని సృజనాత్మకతను వెలికి తీస్తారు. నచ్చిన రంగంలోకి వెళ్లి బాగా రాణిస్తారు. అన్ని పనుల్లోనూ మంచి విజయాన్ని అందుకుంటారు. ధన లాభం పొందుతారు. విదేశీ విద్యావకాశాలు కూడా వస్తాయి.
తుల (Libra) :ఈ రోజు తుల రాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆకాంక్షలు నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేయవచ్చు. కానీ మాటలను అదుపులో ఉంచుకోవాలి. లేదంటే ఘర్షణలు, గొడవలు జరిగే అవకాశం ఉంటుంది. దైవ ధ్యానం చేయడం మంచిది.
వృశ్చికం (Scorpio) :ఈ రోజు వృశ్చిక రాశివారికి అద్భుతంగా ఉంటుంది. దయా స్వభావంతో మెలుగుతారు. ఇతరులకు దాన, ధర్మాలు చేస్తారు. జీవిత భాగస్వామితో సఖ్యంగా ఉంటారు. ఆర్థికంగా లాభపడతారు. ఆరోగ్యం కూడా బాగుంటుంది.
ధనుస్సు (Sagittarius) :ఈ రోజు ధనుస్సు రాశివారు చాలా సహనంగా ఉండాలి. అప్పుడే మానసిక ప్రశాంతత లభిస్తుంది. మీరు ఇవాళ కష్టపడి పనిచేసి మీ గమ్యస్థానాన్ని చేరుకుంటారు. అయితే అనవసర ఘర్షణలకు దూరంగా ఉండాలి. జీవిత భాగస్వామితో అన్యోన్యంగా ఉండడం మంచిది.
మకరం (Capricorn) : ఈ రోజు మకర రాశివారు ప్రత్యర్థులపై పైచేయి సాధిస్తారు. శత్రువుల వ్యూహాన్ని తునాతనకలు చేస్తారు. పరిస్థితులు అదుపుతున్నా, మీరు మాత్రం ధైర్యంగా ఉండాలి. అప్పుడే విజయం లభిస్తుంది. కొత్త విషయాలు నేర్చుకునే ప్రయత్నం చేస్తారు.
కుంభం (Aquarius) :ఈ రోజు కుంభ రాశివారి తారాబలం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల్లో మంచి లాభాలు సంపాదిస్తారు. శారీరకంగా, మానసికంగా బాగుంటారు. వైవాహిక జీవితం కూడా బాగుంటుంది. ఆధ్యాత్మిక అంశాలపై మక్కువ పెరుగుతుంది.
మీనం (Pisces) : ఈ రోజు మీన రాశివారు ప్రశాంతంగా కాలం గడుపుతారు. ఏకాంతంగా ఉండడానికి ఇష్టపడతారు. మీ అంతరంగాల్లోని ఆలోచనలను నెమరువేసుకుంటారు. ప్రియమైన వారితో మీ మనస్సులోని భావాలను పంచుకుంటారు. పిల్లలతో సరదాగా గడుపుతారు.