తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఈ రోజు ఆ రాశివారి రహస్యాలు బయటపడే అవకాశం ఉంది - జాగ్రత్త! - తెలుగు రాశి ఫలాలు మీన రాశి

Horoscope Today December 17th 2023 : డిసెంబర్​ 17న (ఆదివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Horoscope Today 17 December 2023
Horoscope Today December 17th 2023

By ETV Bharat Telugu Team

Published : Dec 17, 2023, 4:56 AM IST

Horoscope Today December 17th 2023 :డిసెంబర్​ 17న (ఆదివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

మేషం (Aries) :ఈ రోజు మేష రాశివారు మంచి దూకుడుగా ఉంటారు. స్నేహితులతో వ్యాపార సంబంధమైన చర్చలు జరుపుతారు. మీ ఆత్మబంధువు మీకు ప్రత్యేకమైన ఆతిథ్యం అందిస్తారు. ఇది మీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఇవాళ మీరు అన్ని రంగాల్లోనూ రాణిస్తారు.

వృషభం (Taurus) :ఈ రోజు అనేక సమస్యలు ఏర్పడతాయి. కానీ ఆత్మబలంతో, స్వయంకృషితో వాటిని పరిష్కరించుకుంటారు. పనులన్నింటినీ కష్టపడి పూర్తి చేస్తారు. మీ ప్రియమైన వ్యక్తి కోసం కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా ఇవాళ మీకు బాగుంటుంది.

మిథునం (Gemini) :ఈ రోజు మిథున రాశివారు మంచి దూకుడుగా వ్యవహరిస్తారు. వ్యాపారంలో లాభాలు సంపాదిస్తారు. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. సాయంత్రానికి అన్ని సమస్యలు తొలగిపోతాయి. కానీ ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవాలి.

కర్కాటకం (Cancer) :ఈ రోజు కర్కాటక రాశివారు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. వీలైనంత వరకు రాజీ ధోరణి పాటించడం మంచిది. అప్పుడే వృత్తిపరమైన వ్యవహారాల్లో ఎలాంటి ఆటంకాలు ఏర్పడకుండా ఉంటాయి. ఆరోగ్యం బాగుంటుంది. చేసే పనులు తృప్తినిస్తాయి.

సింహం (Leo) : ఈ రోజు సింహ రాశివారికి లేనిపోని ఇబ్బందులు ఏర్పడతాయి. ఇవి మిమ్మల్ని మానసికంగా చికాకు పరుస్తాయి. కానీ మీరు శాంతయుతంగా ఉండడం మంచిది. సన్నిహితులతో మాట్లాడడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది.

కన్య (Virgo) :ఈ రోజు కన్య రాశివారు పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటారు. మధుర స్మృతులను గుర్తుకు తెచ్చుకుని సంతోషిస్తారు. భావసారూప్యం ఉన్న వ్యక్తులతో మీ ఆలోచనను పంచుకుంటారు. వేదాంతం, మత సంబంధమైన విషయాలను చర్చిస్తారు.

తుల (Libra) :ఈ రోజు తుల రాశివారికి ఎన్నో ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. చాలా రహస్యాలు బయటపడతాయి. వృత్తి, వ్యాపారాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. మొత్తంగా ఇవాళ మీరు చాలా సరదాగా కాలం గడుపుతారు. ఆరోగ్యం కూడా బాగుంటుంది.

వృశ్చికం (Scorpio) :ఈ రోజు వృశ్చిక రాశివారికి చాలా బాగుంటుంది. ప్రియమైన వ్యక్తిని కలుసుకుంటారు. అవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో, స్నేహితులతో సంతోషంగా కాలం గడుపుతారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆర్థికంగా లాభపడతారు.

ధనుస్సు (Sagittarius) :ఈ రోజు ధనుస్సు రాశివారు గతంలో చేసిన పొరపాట్లను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు. పనులన్నీ సక్రమంగా నెరవేరుస్తారు. కానీ ఎలాంటి ప్రశంసలు లభించవు. ఇది మీకు నిరాశ కలిగిస్తుంది. కానీ త్వరలోనే మీకు మంచి జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రశాంతంగా ఉండండి.

మకరం (Capricorn) : ఈ రోజు మకర రాశివారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. పగలంతా స్నేహితులతో కలిసి సరదాగా గడుపుతారు. లేదా జీవిత భాగస్వామితో విహారయాత్రకు వెళతారు. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. జాగ్రత్త వహించాలి. రాజకీయాల జోలికి వెళ్లకపోవడం మంచిది.

కుంభం (Aquarius) :ఈ రోజు కుంభ రాశివారు ఆధ్యాత్మిక అంశాలపై దృష్టి కేంద్రీకరిస్తారు. మత వ్యవహారాలకు అధికంగా ఖర్చు చేస్తారు. తీర్థయాత్రలకు వెళ్లే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కోర్టు వ్యవహాలు ఏమైనా ఉంటే.. వాటిని పరిష్కరించుకుంటారు. అన్ని విషయాల్లోనూ మీకు విజయం లభిస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది.

మీనం (Pisces) : ఈ రోజు మీన రాశివారు ఒక కీలక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ఈ నిర్ణయాల ప్రభావం దీర్ఘకాలంపాటు ఉంటుంది. కనుక కాస్త ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం. ఆర్థికంగా లాభపడతారు. కానీ వ్యాపార, వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి.

ABOUT THE AUTHOR

...view details