తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆరాశి వారు ఈరోజు ట్రిప్​కు వెళ్తారు- డబ్బు విషయంలో రిస్క్ వద్దు! - తెలుగు రాశి ఫలాలు మీన రాశి

Horoscope Today December 16th 2023 : డిసెంబర్​ 16న (శనివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Horoscope Today December 16th 2023
Horoscope Today December 16th 2023

By ETV Bharat Telugu Team

Published : Dec 16, 2023, 5:07 AM IST

Horoscope Today December 16th 2023 :డిసెంబర్​ 16న (శనివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

మేషం (Aries) :ఈరోజు మీరు మీపై అధికారులతో ముఖ్యమైన చర్చల్లో పాల్గొంటారు. పనిమీద మీరు వివధ ప్రాంతాలకు వెళ్తారు. మీ కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది.

వృషభం (Taurus) :మీరు ఈరోజు దూరప్రాంతాలకు లేదా తీర్థయాత్రకు వెళ్లే అవకాశం ఉంది. అందుకోసం చాలా కాలంగా మీరు ఎదురుచూస్తున్నారు. మీ తారాబలం అనుకూలంగా ఉంది. కొత్త పెట్టుబడికి ఇదే మంచిరోజు. మీ ప్రియమైన వారి నుంచి మంచి వార్త అందుకుంటారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త.

మిథునం (Gemini) :ఈరోజు మీరు ఆస్తికి సంబంధించిన సమస్యలతో ఆందోళన చెందుతారు. మీరు కాస్త అశాంతిగా ఉంటారు. కొన్ని విషయాలు మిమ్మల్ని బాధపెడతాయి. ఆర్థికపరమైన విషయాల్లో మీరు కొంత రిస్క్ తీసుకుంటారు.

కర్కాటకం (Cancer) :మీరు ఈరోజు షాపింగ్​కు వెళ్తారు. రోజంతా సరదాగా గడుపుతారు. దూరదేశాల నుంచి వచ్చిన వ్యక్తిని కలుస్తారు. పనిలోనూ వ్యాపారంలోనూ విజయం మీకోసం ఎదురు చూస్తుంది. లాభాలు ఆనందకరంగా వృద్ధి చెందుతాయి. ప్రశంసలు కూడా లభిస్తాయి.

సింహం (Leo) : ఈరోజు మీకు స్నేహితుల నుంచి సహకారం ఉంటుంది. మీ దినచర్యలో చేసిన పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదుర్కొంటారు. మీ ప్రత్యర్ధులు సృష్టించిన కొన్ని ఆటంకాలు మిమ్మల్ని చికాకు పెడతాయి. పనిచేసే చోట పై అధికారులతో, ఇంటిలో పెద్దలతో వాదనలు చేయకండి.

కన్య (Virgo) :ఈరోజు మీరు పిల్లలు, ప్రియమైన వారి గురించి ఆలోచించి మానసికంగా ఆందోళన చెందుతారు. మీ ఆరోగ్యం పాడవుతుంది. ఖర్చులు పెరుగుతాయి. మీ ప్రియమైన వారితో లేక మీ సన్నిహితలతో మీ హృదయం విప్పి మాట్లడండి. మీ మానసిక ఒత్తిడి దూరం కావడానికి ఇంతకంటే మంచి మందు లేదు.

తుల (Libra) :ఈరోజు మీకు విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. ఏదో ఒక విషయంలో మానసికంగా ఆలోచిస్తూ ఉంటారు. ఎక్కువ ఎమోషనల్ అవుతారు. జలాశయాలకు దూరంగా ఉండండి. ఈ రోజు ప్రయాణం చేయకండి. లీగల్ పేపర్స్​తో డీల్ చేసేటప్పుడు జాగ్రత్త వహించండి.

వృశ్చికం (Scorpio) :ఈరోజు మీరు వ్యాపారం చేయడానికి తగిన సమయం. తారాబలం మీకు పూర్తి అనుకూలంగా లేదు. ఆ కారణంగా మీరు కొన్ని అడ్డంకులు ఎదుర్కొంటారు. వీలైనంత సమయం తీసుకొని అడ్డంకులన్నీ తొలగించుకోండి.

ధనుస్సు (Sagittarius) :ఈరోజు మీరు గందరగోళంగా ఉంటారు. మీ కుటుంబ వాతావరణం అస్థిరంగా ఉండవచ్చు. సాధారణమైన పనులు పూర్తిచేయలేక, మీరు నిరుత్సాహకరంగా భావిస్తారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం మానుకోండి.

మకరం (Capricorn) : ఈరోజు వ్యాపారఉద్యోగాలు చేసిన వారికి అనుకూలమైన రోజు. ప్రమోషన్ కూడా రావచ్చు. సరిగా ప్లాన్ చేసుకుంటే ఉద్యోగంలోనే కావలసినంత ఆదాయం లభిస్తుంది. తీసుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి అయిపోతాయి. సాయంత్రం మీ ఇష్టమైన వారితో సరదాగా సినిమాకు వెళ్తారు.

కుంభం (Aquarius) :ఈరోజు మీరు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. పోషకాహారం తీసుకోవాలి. కొంచెం రెస్ట్ తీసుకోండి. కుదిరితే సెలవు పెట్టండి. సరైన లబ్ధి ఉండేచోట మీ పెట్టుబడులు పెట్టండి. ధన సంబంధమైన విషయాల్లో జాగ్రత్త వహించండి. మీరు కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి.

మీనం (Pisces) : ఈ రోజు మీ మీద పని ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. అయినప్పటికీ మీ ప్రత్యర్థులను మట్టికురిపించడంలో మీరు వెనక్కి తగ్గరు. ఇతరుల అవసరాలపై మీరు సానుకూలంగా ఉన్నప్పటికీ అవసరమైన సందర్భాల్లో మీరు జిత్తులమారిగా కూడా ఉంటారు. ప్రజలు మీ గురించి ఇప్పుడు తెలుసుకుంటారు.

ABOUT THE AUTHOR

...view details