Horoscope Today December 15th 2023 :డిసెంబర్ 15న (శుక్రవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?
మేషం (Aries) :ఈరోజు మీరు అనవసరమైన వాదనలు, అర్థంలేని చర్చల్లో పాల్గొవద్దు. లేదంటే ఈరోజు మీరు ఇబ్బందులు పడతారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు.
వృషభం (Taurus) :ఈ రోజు మీరు అవిశ్రాంతంగా గడుపుతారు. ఇది మీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. కోపాన్ని, మాటలను నియంత్రణలో పెట్టుకోండి. మీరు చేసే పనిలో ఆటంకాలు ఎదురవుతాయి. కాబట్టి కొత్త పనులను ఈ రోజు ప్రారంభించవద్దు.
మిథునం (Gemini) :ఈ రోజు మీకు మిశ్రమంగా ఉంటుంది. ఉదయం బాగానే ఉంటుంది. ఆ తర్వాత కొన్ని సమస్యలు తలెత్తుతాయి. స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపేందుకు ప్రయత్నించండి.
కర్కాటకం (Cancer) : ఆఫీసులో పనికి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. పనిలో మీతో పోటీపడేవారికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు కాబట్టి అది మీకు ప్రయోజనకరంగా మారుతుంది. మీ తల్లి తరఫు నుంచి వచ్చే శుభవార్త మీ ఇంటి వాతావరణాన్ని అహ్లాదభరితం చేస్తుంది. మీ శారీరక, మానసిక స్థితి ఈ రోజు బాగుంటుంది.
సింహం (Leo) : ఈ రోజు మీరు కోపాన్ని నియంత్రణలో పెట్టుకోకపోతే పరిస్థితి ప్రతికూలంగా ఉంటుంది. అజీర్తి సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి ఈ రోజు శారీరకంగా మీరు కొంత ఇబ్బందిగా ఉంటారు.
కన్య (Virgo) :ఈ రోజు మీరు బద్ధకంగా ఉంటారు. ఖర్చులు కూడా పెరుగుతాయి. వాటిని తగ్గించుకునేందుకు ప్రయత్నించండి. మీ ఖ్యాతి తగ్గకుండా చూసుకోండి. అప్పగించిన పనిని సకాలంలో పూర్తి చేయలేకపోవడం మిమ్మల్ని నిరాశపరుస్తుంది.
తుల (Libra) :ఇవాళ మీరు కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టేందుకు మంచి రోజు. మీ బాల్య మిత్రులను కలుసుకుని సరదాగా గడిపేందుకు ఇదే సరైన సమయం. మీ పేరుప్రఖ్యాతలు పెరుగుతాయి. ఇంట్లో గొడవలు జరిగే అవకాశం ఉంది. మీ ఆస్తి వ్యవహారాల్లో జాగ్రత్త వహించండి.
వృశ్చికం (Scorpio) :ఈరోజు మీకు మిశ్రమంగా ఉంటుంది. వృత్తి నిపుణులకు ఎక్కువ పని ఒత్తిడి ఉంటుంది. ఓపికతో ఉండండి. సాయంత్రానికి పరిస్థితులు మెరుగవుతాయి. ఇంటి దగ్గరవారితో గొడవలకు దిగవద్దు.
ధనుస్సు (Sagittarius) :ఈ రోజు ధనుస్సు రాశివారికి బాగా కలిసివస్తుంది. ఈ రాశివారు ఆర్థికంగా బలపడతారు. ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. అందుకే మీరు చాలా ఉత్సాహంగా ఉంటారు. ఈ రోజు సాయంత్రం మీరు దేవాలయానికి వెళ్లే అవకాశం ఉంది. ఆఫీస్, ఇంట్లో చిన్న చిన్న సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అనవసరమైన ఖర్చులు చెయ్యకండి.
మకరం (Capricorn) : ఇవాళ మకరరాశివారికి బాగానే ఉంది. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి.
కుంభం (Aquarius) : ఈరోజు మీరు ఆర్థికంగా బలపడతారు. ఇంటి వాతావరణం ప్రశాంతత నుంచి వివాదాలవైపు వెళ్తుంది జాగ్రత్త. ఈ అస్థిర వాతావరణం మీ కుటుంబంలోని సామరస్యాన్ని, ప్రశాంతతను దెబ్బతీస్తుంది.
మీనం (Pisces) : ఈరోజు సమాజంలో మీ ప్రతిష్ఠ పెరుగుతుంది. ఆర్థికంగా బలపడతారు. వృత్తిపరంగా రాణిస్తారు. ఉద్యోగులకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. ఈ రోజు మీకు సరదాగా గడిచిపోతుంది.