శ్రీ శుభకృత్ నామ సంవత్సరం; ఉత్తరాయణం; గ్రీష్మ రుతువు; జ్యేష్ఠ మాసం; బహుళపక్షం దశమి: రా. 12-43 తదుపరి ఏకాదశి; రేవతి: ఉ. 10-13 తదుపరి అశ్విని; వర్జ్యం: లేదు అమృత ఘడియలు: ఉ. 7-47 నుంచి 9-25 వరకు; తిరిగి తె. 3-33 నుంచి 5-12 వరకు; దుర్ముహూర్తం: ఉ9-50 నుంచి 10-43 వరకు; తిరిగి మ.3-04 నుంచి 3-56 వరకు; రాహుకాలం: మ. 1-30 నుంచి 3-00 వరకు సూర్యోదయం: ఉ.5.30, సూర్యాస్తమయం: సా.6.33
వృత్తి,ఉద్యోగ,వ్యాపారాది రంగాలలో ప్రోత్సాహకరమైన పరిస్థితులు ఏర్పడతాయి. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారంలో అనుకూలత కలదు. గోసేవ చేయడం మంచిది.
మధ్యమ ఫలితాలు ఉన్నాయి. పనులకు ఆటంకం కలుగకుండా ముందుజాగ్రత్తతో వ్యవహరించాలి. మీ మీ రంగాల్లో అనుకూల ఫలితాలు సొంతం అవుతాయి. గిట్టనివారు తప్పుదోవ పట్టిస్తారు. చిన్న చిన్న అంశాలను పెద్దవి చేసుకోవడం సరికాదు. దుర్గారాధన శుభప్రదం.
మంచి కాలం. అనుకున్న పని నెరవేరుతుంది. ముఖ్య విషయాల్లో పురోగతి సాధిస్తారు. అందరినీ కలుపుకొనిపోవడం వల్ల లక్ష్యాన్ని త్వరగా చేరుకుంటారు. ప్రయాణంలో అశ్రద్ధ వద్దు. ఇష్టదైవ ధ్యానం మేలు చేస్తుంది.
కాలం అన్నివిధాలా సహకరిస్తోంది. గౌరవ సన్మానాలు అందుకుంటారు. వృత్తి,వ్యాపారాల్లో లాభాలు ఉన్నాయి. మిత్రజన సహకారం ఉంది. లక్ష్మీస్తుతి శ్రేయస్కరం.
సమాజంలో పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు. ఆత్మీయులతో కలిసి మరువలేని మధుర క్షణాలను గడుపుతారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. విష్ణు సహస్రనామం చదవాలి.
మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. అకారణ కలహ సూచన. శారీరక శ్రమ పెరుగుతుంది. కొందరి ప్రవర్తనాశైలి మిమ్మల్ని బాధిస్తుంది. అధికారులతో కాస్త అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. విష్ణు నామస్మరణ శుభప్రదం.