తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Horoscope Today ఈ రోజు మీ రాశి ఫలం ఎలా ఉందంటే

ఈ రోజు రాశి ఫలం గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే.

horoscope today
horoscope today

By

Published : Aug 24, 2022, 6:09 AM IST

Horoscope Today: ఈ రోజు(ఆగస్టు 24) రాశి ఫలం గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే.

కృషికి తగ్గ ఫలితాలున్నాయి. కీలక వ్యవహారాల్లో కుటుంబ సహకారం అందుతుంది. బంధుప్రీతి కలదు. ఈశ్వర సందర్శనం శుభప్రదం.

మంచి పనులు చేపడతారు. కీలక విషయాల్లో పురోగతి ఉంటుంది. ఇష్టులతో కాలాన్ని గడుపుతారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. ఆంజనేయ ఆరాధన శుభప్రదం.

మనస్సౌఖ్యం ఉంది. భవిష్యత్ ప్రణాళికలో స్పష్టత వస్తుంది. తోటివారితో కలిసి శుభకార్యాలలో పాల్గొంటారు. ఆదాయానికి తగ్గ వ్యయం ఉంది. ప్రయాణాలు ఫలిస్తాయి. శివ నామస్మరణ ఉత్తమం.

మధ్యమ ఫలితాలున్నాయి. పక్కవారిని కలుపుకొనిపోవడం వల్ల ఇబ్బందులు తగ్గుతాయి. మనోబలం తగ్గకుండా చుచుకోవాలి. దుర్గా ధ్యాన శ్లోకం చదివితే మంచి జరుగుతుంది.

కొన్ని కీలకమైన వ్యవహారాలలో ఆలస్యం జరిగే సూచనలు ఉన్నాయి. పెద్దలతో కాస్త సంయమనం పాటించాలి. శివ అష్టోత్తర శతనామావళి పారాయణ చేయడం మంచిది.

కీర్తి పెరుగుతుంది. ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. కుటుంబసభ్యులతో కలిసి కొన్ని మధుర క్షణాలను గడుపుతారు. ఎట్టిపరిస్థితుల్లోనూ బద్దకాన్ని దరిచేరనీయకండి. శ్రీరామనామాన్ని జపించడం ఉత్తమం

బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు. మీ మీ రంగాల్లో అధికారుల ప్రశంసలు అందుకుంటారు. కుటుంబసభ్యుల సహకారం ఉంటుంది. శివ నామస్మరణ చేస్తే మేలు.

శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రణాళికాబద్దంగా ముందుకు సాగి పనులను పూర్తిచేస్తారు. శత్రువులపై మీరే విజయం సాధిస్తారు. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి.

పనుల్లో విజయం సాధిస్తారు. తోటివారి సహకారంతో ఆటంకాలను అధికమిస్తారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఇష్టదైవ స్తోత్రాన్ని చదవడం మంచిది.

మిశ్రమఫలాలున్నాయి. వాద ప్రతివాదాల జోలికి పోకుండా ఉండటం మేలు. గోసేవ చేయడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి. అపమృత్యు భయం వల్ల మనశ్శాంతి తగ్గుతుంది. శని శ్లోకం చదవాలి

ధనవ్యయం జరిగే సూచనలు ఉన్నాయి. కొన్ని పరిస్తితులు బాధకలిగిస్తాయి. కొందరిని అతిగా నమ్మడం మంచిది కాదు. సూర్య నమస్కారాలు ఆత్మశక్తిని పెంచుతుంది.

మంచి కాలం. అనుకున్న పని నెరవేరుతుంది. ముఖ్య విషయాల్లో పురోగతి సాధిస్తారు. అందరినీ కలుపుకొని పోవడం వల్ల లక్ష్యాన్ని త్వరగా చేరుకుంటారు. ప్రయాణాలలో అశ్రద్ధ వద్దు. ఇష్టదైవ ధ్యానం మేలు చేస్తుంది.

ABOUT THE AUTHOR

...view details