తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Horoscope Today ఈ రోజు మీ రాశి ఫలం ఎలా ఉందంటే - daily horoscope news

ఈ రోజు రాశి ఫలం గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే

Horoscope Today
Horoscope Today

By

Published : Aug 22, 2022, 6:26 AM IST

Horoscope Today: ఈ రోజు రాశి ఫలం గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే.

శుభకాలం. మంచి పనులు చేపడతారు. ఉద్యోగంలో మంచి ఫలితాలు ఉన్నాయి. మీ బుద్ధిబంతో కీలక సమస్యను పరిష్కరిస్తారు. శ్రీ మహాగణపతి ఆరాధన చేస్తే మంచిది.

చేపట్టే పనుల్లో శ్రమ పెరుగుతుంది. సమయానుకూలంగా ముందుకు సాగండి. కొందరి ప్రవర్తన బాధ కలిగిస్తుంది. కొన్ని సంఘటనలు నిరుత్సాహపరుస్తాయి. సమయానికి నిద్రాహారాలు తీసుకోవాలి. దుర్గా అష్టోత్తర శతనామావళి చదవాలి.

అనుకున్న పనులను అనుకున్నట్టు చేయగలుగుతారు. ఓ శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. ప్రయత్న కార్యసిద్ధి ఉంది. ఒక ముఖ్య వ్యవహారంలో పెద్దల సాయం అందుతుంది. కొన్ని వ్యవహారాలలో దైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. ఇష్టదేవత స్తోత్రం చదివితే బాగుంటుంది.

చేపట్టినపపనులలో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. శారీరక శ్రమ ఎక్కువవుతుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల తరవాత ఇబ్బందులు పడతారు. సుబ్రహ్మణ్య భుజంగస్తవం పఠిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి

పట్టుదలతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు. అనవసర ఖర్చులు సూచితం. శ్రమ అధికమవుతుంది. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. దుర్గ అష్టోత్తరం చదివితే మంచిది.

కార్యసిద్ధి ఉంది. తలపెట్టిన పనిలో ముందుచూపుతో వ్యవహరించి అనుకున్నది సాధిస్తారు. చక్కటి ఆలోచనా విధానంతో ముందుకు సాగి మంచి పేరు సంపాదిస్తారు. శివ నామస్మరణ ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.

మిశ్రమ వాతారణం కలదు. కీలక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఒక శుభవార్త మీ ఇంట్లొ సంతోషాన్ని నింపుతుంది. ఒక ముఖ్య వ్యవహరంలో ఆర్థిక సాయం అందుతుంది. లక్ష్మీదేవి సందర్శనం శుభాన్నిస్తాయి.

మీ మీ రంగాల్లో జాగ్రత్తగా పనిచేయాలి. ఆత్మవిశ్వాసం సడలకుండా జాగ్రత్తపడాలి. చేపట్టిన పనులలో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. అనవసర ఖర్చలు వస్తాయి. నిర్ణయాలలో స్తిరత్వం ఉండదు. కలహాలకు దూరంగా ఉండాలి. శని శ్లోకం పఠిస్తే శుభఫలితాలు కలుగుతాయి.

శుభకార్యాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల నుంచి ఒక ముఖ్య వ్యవహారంలో సంపూర్ణ సహకారం లభిస్తుంది. అవసరానికి తగిన సహకారం లభిస్తుంది. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వసాన్ని పెంచుతుంది. సూర్యాష్టకం చదివితే బాగుంటుంది.

మీ నిజాయితీ మిమ్మల్ని కాపాడుతుంది. కుటుంబ సహకారం లభిస్తుంది. ఒక శుభవార్త ఆనందాన్నిస్తుంది. మొహమాటాన్ని దరిచేరనీయకండి. ప్రయాణాలు ఫలిస్తాయి. శ్రీరామనామాన్ని జపిస్తే మేలు జరుగుతుంది.

పనుల్లో జాప్యం జరగకుండా చూసుకోవాలి. కుటుంబ భాద్యతలు అధికమవుతాయి, ఒక పరీక్షలాగ వాటిని ఎదుర్కోవలసి వస్తుంది. మీ అంచనాలు తప్పుతాయి. విలువైన వస్తువుల విషయాలలో అజాగ్రత్త పనికి రాదు ఆదిత్య హృదయం చదవడం మంచి ఫలితాలనిస్తుంది

అస్థిర బుద్ధి వల్ల ఇబ్బందులకు గురవుతారు. కీలక సందర్భాల్లో పెద్దలు చెప్పే అనుభవ సూత్రాలు అమృత గుళికల్లా పనిచేస్తాయి. మనోవిచారం కలిగించే సంఘటనలకు దూరంగా ఉండాలి. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన మేలైన ఫలితాలను ఇస్తుంది.

ఇవీ చదవండి:బైక్​ను ఢీకొట్టిన కారు, గాల్లోకి ఎగిరిపడ్డ భార్యాభర్తలు, ఒకరు మృతి

హ్యాట్రిక్​ కోసం భాజపా పక్కా గేమ్ ప్లాన్, అందుకే ఆయనకు నో, ఈయనకు ఎస్​

ABOUT THE AUTHOR

...view details