తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? - horocope today eendau

Horoscope Today (27-07-2022): ఈ రోజు రాశిఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

horocope today
horocope today

By

Published : Jul 27, 2022, 3:59 AM IST

Horoscope Today (27-07-2022): ఈ రోజు పన్నెండు రాశుల వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి..

వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అంచనాలను అందుకుంటారు. విందు, వినోద, ఆద్యాత్మిక కార్యక్రమాలలోను పాల్గొంటారు. ఒక శుభవార్త మీ ఇంట ఆనందాన్ని నింపుతుంది. దైవారాధన మానవద్దు.

శ్రమ పెరగకుండా చూసుకోవాలి. బంధుమిత్రుల సహకారం లేకపోయినా కొన్ని పనులను ప్రారంభించి పూర్తిచేసే ప్రయత్నం చేస్తారు. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. ప్రయాణాలు తప్పకపోవచ్చును. వృథా ఖర్చులు ఉన్నాయి. గోసేవ చేయాలి.

నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. బంధుమిత్రుల వల్ల మేలు జరుగుతుంది. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. కనకధార స్తోత్రం పఠించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి.

శ్రమ పెరుగుతుంది. ఉత్సాహం తగ్గకండా చూసుకోవాలి. బంధువులతో ఆచి తూచి వ్యవహరించాలి. పంచముఖ ఆంజనేయుడిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి.

మంచి కాలం. ప్రయత్నాలు ఫలిస్తాయి. అవసరానికి తగిన సాయం అందుతుంది. ధనధాన్య వృద్ధి ఉంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఒకవార్త ఆనందాన్నిస్తుంది. శివనామస్మరణ మంచినిస్తుంది.

మీ పనితీరుతో మీ పై అధికారుల మనసులను గెలుస్తారు. గౌరవ సన్మానాలు అందుకుంటారు. బంధువులతో విబేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. విష్ణు నామస్మరణ చేస్తే మంచిది

మీ శ్రమకు గుర్తింపు లభిస్తుంది. అధికారులు మీకు అనుకూలమైన ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు. కొన్ని కీలక పనులను పూర్తిచేయగలుగుతారు. కీలక నిర్ణయాలు ఫలిస్తాయి. శివస్తోత్రం పఠిస్తే మంచిది.

అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. కుటుంబ వాతావరణం అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. కొన్ని సంఘటనలు కాస్త మనస్తాపాన్ని కలిగిస్తాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. దైవారాధన మానవద్దు.

మీ మీ రంగాల్లో అనుకూల ఫలితాలున్నాయి. ఇష్టులతో మరపురాని క్షణాలను గడుపుతారు. మానసిక ఆనందాన్ని కలిగి ఉంటారు. ఆంజనేయ ఆరాధన మంచిది.

తలపెట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేయగలుగుతారు. కీలక బాధ్యతలు మీ భుజాన పడతాయి. వాటిని సమర్థంగా నిర్వహించి అందరి ప్రశంసలూ పొందుతారు. విందూ వినోద ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. దైవారాదన మానవద్దు. శివారాధన శుభప్రదం.

పనులకు ఆటంకం కలుగకుండా ముందుజాగ్రత్తతో వ్యవహరించాలి. మీమీ రంగాల్లో అనుకూల ఫలితాలు సొంతమవుతాయి. గిట్టనివారు తప్పుదోవ పట్టిస్తారు. చిన్న చిన్న అంశాలను పెద్దవిగా చేసుకోవడం సరికాదు. దుర్గారాధన శుభప్రదం.

స్థిరమైన చిత్తంతో ముందుకు సాగితే శుభఫలితాలు కలవు. సమస్యగా అనిపించిన అంశాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. బంధువులతో ఆనందాన్ని పంచుకుంటారు. ప్రయాణాలు శుభప్రదం. శివుణ్ణి ఆరాధిస్తే మంచిది.

ABOUT THE AUTHOR

...view details