తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? - రాశిఫలాలు

Horoscope Today (25-07-2022): ఈ రోజు రాశిఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

horoscope today
horoscope today

By

Published : Jul 25, 2022, 3:49 AM IST

Horoscope Today (25-07-2022): ఈ రోజు పన్నెండు రాశుల వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి..

మనోధైర్యంతో చేసే పనులు వెంటనే సిద్ధిస్తాయి. ఇష్టులతో కాలాన్ని గడుపుతారు. ముఖ్య వ్యవహారాల్లో ఆచితూచి మాటాడాల్సి ఉంటుంది. నూతన వస్తుప్రాప్తి కలదు. సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని పఠించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి.

కుటుంబ సౌఖ్యం కలదు. మీదైనా రంగాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. ఆర్థికాభివృద్ధి ఉంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. శివ నామస్మరణ ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.

మొదలుపెట్టిన పనులలో కొన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అదిగమించే ప్రయత్నం చేస్తారు. ఇతరుల వ్యవహారాలలో జోక్యంచేసుకోకపోవడమే మంచిది. గురు, శని ధ్యానం మంచినిస్తుంది.

అనుకూల ఫలితాలు కలవు. కొత్త పనులను ప్రారంభిస్తారు. పెద్దల ఆశీర్వచనాలు ఫలిస్తాయి. సమస్యగా అనిపించిన అంశాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. బంధువుల వ్యవహారాలలో అంటి ముట్టనట్లుగా ఉండాలి. ప్రయాణాలు శుభప్రదం. శివుణ్ణి ఆరాధిస్తే మంచిది.

స్థిరమైన నిర్ణయాలతో అనుకూలఫలితాలను సాధిస్తారు. తోటివారి సహాయ సహకారాలుంటాయి. బంధువులతో ఆనందాన్ని పంచుకుంటారు. ప్రయాణాలు ఫలిస్తాయి. శ్రీ విష్ణు నామాన్ని పఠించడం మంచిది

మంచిఫలితములను పొందుతారు. మానసిక ప్రశాంతత ఉంటుంది. తలపెట్టిన పనిలో ఆత్మీయుల సహకారం అందుతుంది. బంధువులతో మేలు జరుగుతుంది. ఆధ్యాత్మిక విషయాల్లో చురుగ్గా పాల్గొంటారు. చంద్రశేఖరాష్టకం శుభప్రదం.

చేపట్టే పనుల్లో ఆపదలు పెరగకుండా చూసుకోవాలి. ఉద్యోగంలో ఆత్మస్థైర్యంతో ముందుకు సాగితే మేలైన ఫలితాలు పొందుతారు. అయినవారి వల్ల సమస్యలు రాకుండా జాగ్రత్తపడాలి.అనవసర ఖర్చులను అదుపు చేయండి. మనస్సును స్థిరంగా ఉంచుకోవాలి. వేంకటేశ్వరస్వామిని ఆరాధిస్తే మంచిది.

తలపెట్టిన కార్యాలను మనోధైర్యంతో పూర్తిచేస్తారు. తోటివారితో ఆనందంగా గడుపుతారు. బంధుమిత్రులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. కీలకమైన చర్చలు ఫలిస్తాయి. ఇష్టదైవ ప్రార్థన శుభాన్నిస్తుంది.

ముఖ్య విషయాల్లో ఓర్పుతో వ్యవహరిస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. గొప్పవారితో పరిచయం ఏర్పడుతుంది. నలుగురికీ ఆదర్శంగా నిలుస్తారు. దైవబలం సంపూర్ణంగా రక్షిస్తున్నది. ఎంత ఒత్తిడి ఉన్నా ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకండి. సూర్యనారాయణ మూర్తి ఆరాధన శుభదాయకం.

వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం సిద్ధిస్తుంది. ఎన్ని ఆటంకాలు ఎదురైనా మనోబలంతో ముందుకు సాగండి అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. శ్రమ పెరుగుతుంది. ఎవరితోనూ వాదోపవాదాలు చేయరాదు. ఇష్టదైవ ప్రార్థన చేస్తే మంచిది.

మంచి మనస్సుతో చేసే ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. సుఖసంతోషాలతో గడుపుతారు. ఆర్థికంగా ప్రయోజనాలుంటాయి. వివాదాస్పద వ్యక్తులకు దూరంగా ఉండాలి. వినాయకుని ఆరాధన మేలు చేస్తుంది.

అనుకూల సమయం. తోటి వారి సహాయసహకారాలు అందుతాయి. మీ బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరించి అందరి మన్ననలను పొందుతారు. ప్రయాణాలు ఫలిస్తాయి. గణపతి ఆరాధన చేస్తే మంచిది.

ABOUT THE AUTHOR

...view details