తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Horoscope Today (14-07-2022): ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే ? - ఈ రోజు రాశి ఫలం

Horoscope Today (14-07-2022): ఈ రోజు రాశిఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

ఈ రోజు రాశి ఫలం
ఈ రోజు రాశి ఫలం

By

Published : Jul 14, 2022, 5:00 AM IST

ప్రారంభించిన కార్యక్రమాల్లో విజయసిద్ధి ఉంది. ఒక శుభవార్త ఉత్సాహాన్ని ఇస్తుంది. విందు,వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. తోటివారి సహాయ సహకారాలు ఉన్నాయి. దైవబలం రక్షిస్తోంది. శ్రీ వెంకటేశ్వర సందర్శనం శుభప్రదం.

చేపట్టే పనులకు ఆటంకాలు ఎదురవకుండా చూసుకోవాలి. మీ అభివృద్ధికి దోహదపడే ఒక కీలక నిర్ణయం తీసుకుంటారు. అకారణ కలహ సూచన. కుటుంబంలో చిన్నపాటి సమస్యలు వస్తాయి. హనుమాన్ చాలీసా చదవడం మంచిది.

చేపట్టబోయే పనుల్లో పట్టుదల వదలకండి. ఉద్యోగంలో పై అధికారులతో నమ్రతగా వ్యవహరించాలి. గిట్టనివారు మీ ఉత్సాహంపై నీళ్లు చల్లుతారు. మనోవిచారం కలిగించే సంఘటనలకు దూరంగా ఉండాలి. దైవధ్యానంతో ఆపదల నుంచి బయటపడతారు.

శుభప్రదమైన కాలాన్ని గడుపుతారు. బాధ్యతలను సమర్థంగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలు సాధిస్తారు. సాయిబాబా వారి సచ్చరిత్ర పారాయణ శుభాలను చేకూరుస్తుంది.

మనసుపెట్టి పనిచేస్తే విజయం మీదే. మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. శ్రమ అధికం అవుతుంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. దత్తాత్రేయస్వామి ఆరాధన మంచి ఫలితాన్ని ఇస్తుంది.

లక్ష్యాలకు కట్టుబడి పనిచేస్తారు. ధర్మ సందేహాలతో కాలాన్ని వృథా చేయకండి. కుటుంబ సభ్యులతో ఆచితూచి వ్యవహరించాలి. మనో విచారం కలుగకుండా చూసుకోవాలి. ప్రయాణంలో ఆటంకాలు కలుగుతాయి. శివారాధన శుభప్రదం.

మంచి కాలం. కాలాన్ని సత్కార్యాలు వినియోగించండి. గొప్ప ఫలితాలను అందుకుంటారు. మీ ప్రతిభతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు. మానసిక ఆనందాన్ని కలిగించే సంఘటనలు చోటుచేసుకుంటాయి. ఒక శుభవార్త సంతోషాన్ని కలిగిస్తుంది. శ్రీఆంజనేయుని సందర్శనం శుభప్రదం.

పనిలో మనోభీష్టం నెరవేరుతుంది. కొన్ని సందర్భాల్లో సర్దుకుపోయే మనస్తత్వం మీకు గొప్ప ఫలితాలను తెచ్చి పెడుతుంది. వ్యాపారంలో అనుభవజ్ఞుల సలహాలు అమృతగుళికల్లాగా పనిచేస్తాయి. శారీరక శ్రమ కాస్త పెరుగుతుంది. దుర్గా ధ్యానం శుభప్రదం.

బాగా కష్టపడితే తప్ప పనులు పూర్తికావు. కీలక విషయాల్లో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. స్నేహపూర్వక వాతావరణం ఉంటుంది. సత్తువ ఉన్న భోజనాన్ని తీసుకోవాలి. కుటుంబ సభ్యుల మాటలకు గౌరవం ఇస్తూ ముందుకెళ్లండి. మంచి జరుగుతుంది. శ్రీఆంజనేయుని సందర్శనం శుభప్రదం.

శరీరసౌఖ్యం కలదు. కొన్ని సందర్భాల్లో లౌక్యంగా వ్యవహరించి సమస్యలను అధిగమిస్తారు. భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగండి. తోటి వారిని కలుపుకొనిపోవడం వల్ల పనులు తొందరగా పూర్తవుతాయి. ఆదాయానికి తగ్గ ఖర్చులు ఉంటాయి. గణపతి ఆరాధన శుభప్రదం.

రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాలి. సమన్వయలోపం లేకుండా చూసుకోవాలి. సమర్ధతను పెంచాలి. ఆవేశంతో నిర్ణయాలు తీసుకోవద్దు. ప్రశాంతమైన ఆలోచనలతో గొప్పవారవుతారు. ఆత్మీయులతో విభేదాలు రాకుండా చూసుకోవాలి. శ్రీవెంకటేశ్వరుని సందర్శనం శుభకరం.

మీలోని నిబద్ధతే మిమ్మల్ని రక్షిస్తుంది. స్థిర నిర్ణయాలు మేలు చేస్తాయి. బంధువులతో ప్రేమగా వ్యవహరించాలి. అపకీర్తి కలిగించేవారు ఎదురవుతారు. ఎలాంటి పరిస్థితిలోనైనా మనోధైర్యాన్ని వదలకండి. ఆంజనేయ ఆరాధన శుభప్రదం.

ABOUT THE AUTHOR

...view details