తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Horoscope Today (07-07-2022): ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? - రాశి ఫలాలు

Horoscope Today (07-07-2022): ఈ రోజు రాశిఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

రాశి ఫలాలు
రాశి ఫలాలు

By

Published : Jul 7, 2022, 4:19 AM IST

Horoscope Today (07-07-2022): ఈ రోజు గ్రహబలం, శుభముహూర్తంతో పాటు.. పన్నెండు రాశుల వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి.

కాలం శుభప్రదంగా గడుస్తుంది. మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు. చేపట్టిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. మనఃస్సౌఖ్యం ఉంటుంది. ఈశ్వరుణ్ణి ఆరాధిస్తే మంచిది.

శ్రమతో కూడిన ఫలితాలు ఉన్నాయి. నూతన కార్యక్రమాలను కుటుంబ సభ్యుల అంగీకారం తర్వాతే ప్రారంభించండి. కుటుంబానికి సంబంధించిన ఒక శుభవార్త వింటారు. శత్రువులకు దూరంగా ఉండాలి. ఇష్టదేవతా ధ్యానం మంచి ఫలాలను ఇస్తుంది.

కార్యసిద్ధి ఉంది. దైవబలంతో ఒక పనిని పూర్తిచేస్తారు. ప్రారంభించిన పనులను ఉత్సాహంగా పూర్తిచేస్తారు. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. క్షమాగుణంతో ఉంటే మేలు జరుగుతుంది. లక్ష్మీదేవి దర్శనం శుభప్రదం.

మనఃస్సౌఖ్యం ఉంటుంది. ఒక వ్యవహారంలో తోటివారి సాయం అందుతుంది. ధైర్యంతో తీసుకున్న నిర్ణయాలు గొప్ప ఫలితాన్నిఇస్తాయి. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. శివారాధన శుభప్రదం.

మీ మీ రంగాల్లో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి అనుకూలతను సాధిస్తారు. ముఖ్యవిషయాల్లో అనుకూలమైన నిర్ణయాలు వెలువడతాయి. అధికారులకు అణిగిమణిగి ప్రవర్తించాల్సి ఉంటుంది. మీరు చేయని పొరపాటుకు నింద పడాల్సి రావచ్చు. శివస్తోత్రం చదవడం మంచిది.

అదృష్టవంతులు అవుతారు. వృత్తి,ఉద్యోగ,వ్యాపార రంగాల్లో మంచి ఫలితాలు ఉన్నాయి. ఆర్ధికంగా సానుకూలిస్తుంది. నూతన వస్తువులను కొంటారు. కొత్త పనులను ప్రారంభిస్తారు. శ్రీవిష్ణు అష్టోత్తర శతనామావళి చదవడం మంచిది

ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోరు. ప్రారంభించని పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తిచేస్తారు. కొన్ని కీలకమైన ప్రణాళికలు వేసి, వాటిని ప్రారంభం కూడా చేస్తారు. శ్రీవేంకటేశ్వర శరణాగతి స్తోత్రం చదవడం మంచిది.

కార్యానుకూలత కలదు. కొత్త పనులను ప్రారంభించడానికి ఇది సరైన సమయం. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. అనుకున్న పనులను అనుకున్నట్టు పూర్తి చేసి అందరి ప్రశంసలను అందుకుంటారు. బంధు,మిత్రుల ఆదరణ ఉంటుంది. దైవారాధన మానవద్దు.

ప్రారంభించిన పనిలో సంతృప్తికరమైన ఫలితాలు సాధిస్తారు. సమయానికి సహాయం చేసేవారు ఉన్నారు. కీలక వ్యవహారాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. లింగాష్టకం చదివితే మంచిది.

తోటివారి సహకారంతో చక్కటి ఫలితాలను పొందుతారు. బుద్ధిబలం బాగుండటం వల్ల కొన్ని కీలక వ్యవహారాల నుంచి బయటపడగలుగుతారు. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. మీ ప్రతిష్టకు మచ్చ తెచ్చేందుకు కొందరు ప్రయత్నిస్తారు జాగ్రత్త. దైవారాధన మానవద్దు.

మీ మీ రంగాల్లో అనుకున్న ఫలితాలు సొంతం అవుతాయి. ఒక వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. బంధు,మిత్రులతో కలిసి శుభకార్యక్రమంలో పాల్గొంటారు. అష్టమ చంద్రసంచారం అనుకూలంగా లేదు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. కనకధారాస్తవం చదవాలి.

బంధు,మిత్రులను కలుస్తారు. కొన్ని కీలక వ్యవహారాలను వారితో చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైన పనులను పూర్తిచేయగలుగుతారు. కొన్ని చర్చలు మీకు లాభిస్తాయి. ప్రసన్నాంజనేయ స్తోత్రం పారాయణ చేయాలి.

ఇదీ చూడండి :'ఈ రాష్ట్రంలోనూ ఏక్​నాథ్​ శిందే పుట్టుకొస్తారు'.. భాజపా 'నాన్​సెన్స్​' జోస్యం!

ABOUT THE AUTHOR

...view details