Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (06-07-2022) - ASTROLOGY IN TELUGU
Horoscope Today (06-07-2022): ఈ రోజు రాశిఫలాల గురించి డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..
Horoscope
By
Published : Jul 6, 2022, 5:06 AM IST
చేపట్టిన పనుల్లో బాధ్యతాయుతంగా వ్యవహరించి, అనుకూల ఫలితాలు సాధిస్తారు. ఒక ముఖ్యమైన సమస్యను చాకచక్యంగా పరిష్కరిస్తారు. గురువుల ఆశీర్వచనాలు మేలు చేస్తాయి.
ప్రారంభించిన పనిలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. బంధు,మిత్రుల సహకారం మేలు చేస్తుంది. నవగ్రహ స్తోత్రం చదివితే శుభ ఫలితాలు కలుగుతాయి.
శ్రమ పెరగకుండా చూసుకోవాలి. తోటివారి సహకారం లభిస్తుంది. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. దగ్గరివారిని దూరం చేసుకోకండి. శ్రీరామనామాన్ని జపిస్తే మేలు జరుగుతుంది.
కీలక విషయాలలో అనుకున్న ఫలితాలు సిద్ధిస్తాయి. మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. సంతానాభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. సుబ్రహ్మణ్య భుజంగ స్తవం చదివితే బాగుంటుంది.
చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా దైవానుగ్రహంతో వాటిని సమర్ధంగా ఎదుర్కొంటారు. క్రమంగా అభివృద్ది సాధిస్తారు. శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం శుభప్రదం.
శరీర సౌఖ్యం ఉంది. మీ మీ రంగాల్లో సమర్ధంగా ముందుకు సాగి విజయం సాధిస్తారు. తోటివారికి ఉపయోగపడే కార్యక్రమాలను చేస్తారు. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి. సుబ్రహ్మణ్య స్వామి సందర్శనం శుభప్రదం.
కీలక వ్యవహారాలలో ఆచితూచి అడుగేయాలి. ఒత్తిడి పెరగకుండా ముందు జాగ్రత్తతో వ్యవహరించాలి. బంధు,మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. అనవసర ఖర్చులకు అడ్డుకట్ట వేయాలి. సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామావళి చదివితే బాగుంటుంది.
ప్రారంభించబోయే పనుల్లో పట్టుదల వదలకండి. ఉద్యోగంలో ఉన్నత అధికారులతో నమ్రతగా వ్యవహరించాలి. గిట్టనివారు మీ ఉత్సాహంపై నీళ్లు చల్లుతారు. మనోవిచారం కలిగించే సంఘటనలకు దూరంగా ఉండాలి. దైవధ్యానంతో ఆపదల నుంచి బయటపడతారు.
సకాలంలో పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. గొప్పవారిని కలుస్తారు. వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. మానసిక ప్రశాంతత ఉంటుంది. ఆదిత్య హృదయం చదవాలి.
పనుల్లో ఆటంకాలు ఎదురైనా తెలివిగా పరిష్కరిస్తారు. వృథా ప్రసంగాలతో సమయాన్ని వృథా చేయకండి. మీ పై అధికారులతో అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. దుష్టులను దరిచేరనీయకండి. ఈశ్వర సందర్శనం ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది.
శ్రమతో కూడిన ఫలితాలు ఉన్నాయి. తోటివారి సహకారం ఉంది. సమయానికి ఆహారంతో పాటు విశ్రాంతి తీసుకోవాలి. ఖర్చులు పెరుగుతాయి. శ్రీవేంకటేశ్వరస్వామి ఆరాధన శ్రేయోదాయకం.
ఆత్మబలంతో ముందుకు సాగి విజయం సాధిస్తారు. ధనధాన్యాభివృద్ధి కలదు. మాట పట్టింపులకు పోకండి. మొహమాటం వల్ల లేనిపోని సమస్యలను కొనితెచ్చుకోకండి. ఎవరినీ అతిగా నమ్మకండి. విష్ణుసహస్రనామ స్తోత్రం చదివితే మంచిది.